- Home
- Business
- Recharge plans: మీ సిమ్ 365 రోజులు యాక్టివ్‌గా ఉండాలా.? తక్కువ ధరలో బెస్ట్ రీఛార్జ్ ప్లాన్స్
Recharge plans: మీ సిమ్ 365 రోజులు యాక్టివ్‌గా ఉండాలా.? తక్కువ ధరలో బెస్ట్ రీఛార్జ్ ప్లాన్స్
Budget Recharge: ఇంట్లో ముగ్గురు ఉంటే ఐదు ఫోన్ నెంబర్లు ఉంటున్నాయి. అయితే అన్ని నెంబర్లకు తప్పనిసరిగా రీఛార్జ్ చేయడం సమస్యగా మారుతోంది. తక్కువ రీఛార్జ్ ప్లాన్స్‌తో మీ సిమ్‌ను ఏడాది పాటు యాక్టివ్‌గా ఉండే కొన్ని బెస్ట్ ప్లాన్స్ ఇవే..

ట్రాయ్ ఆదేశం
ఈ సంవత్సరం ప్రారంభంలో టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (TRAI) ప్రధాన టెలికాం కంపెనీలైన Airtel, Jio, BSNL, Vodafone Idea (Vi)లకు కొత్త ఆదేశాలు జారీ చేసింది. డేటా సౌకర్యం లేకపోయినా మొబైల్ నంబర్‌ను యాక్టివ్‌గా ఉంచే బడ్జెట్ ఫ్రెండ్లీ ప్లాన్‌లను అందించాలని సూచించింది. దీని ఫలితంగా ఈ కంపెనీలు ఫీచర్ ఫోన్ వినియోగదారులు కాలింగ్ కోసం మాత్రమే ఫోన్‌ను వాడే వారికోసం ప్రత్యేక రీఛార్జ్ ప్లాన్‌లను మార్కెట్లోకి తీసుకొచ్చాయి.
KNOW
ఎయిర్‌టెల్ ప్లాన్స్
84 రోజుల ప్లాన్ – రూ.469
* అన్‌లిమిటెడ్ కాలింగ్
* ఉచిత రోమింగ్
* 900 ఉచితం ఎస్ఎమ్ఎస్‌లు
365 రోజుల ప్లాన్ – రూ.1849
* ఏడాది పొడవునా అపరిమిత కాలింగ్
* ఉచిత రోమింగ్
* 3600 SMSల సౌకర్యం
ఎయిర్ టెల్ రీఛార్జ్ ప్లాన్స్ పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
జియో ప్లాన్స్
84 రోజుల ప్లాన్ – రూ.448
* అపరిమిత కాలింగ్
* 1000 SMSల సౌకర్యం
336 రోజుల ప్లాన్ – రూ.1748
* ఏడాది పొడవునా కాలింగ్ సౌకర్యం
* 3600 SMSలు
జియో రీఛార్జ్ ప్లాన్ లకు సంబంధించిన పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
వోడాఫోన్ ఐడియా (Vi) ప్లాన్‌లు
వోడాఫోన్ ఐడియా కూడా Airtel మాదిరిగానే ప్లాన్‌లను ప్రవేశపెట్టింది:
84 రోజుల ప్లాన్ – రూ.470
* అపరిమిత కాలింగ్
* SMS సౌకర్యం
365 రోజుల ప్లాన్ – రూ.1849
* ఏడాది పొడవునా అన్‌లిమిటెడ్ కాలింగ్
* SMS సౌకర్యం
వోడాఫోన్ ఐడియా 365 ప్లాన్స్ పూర్తి వివరాలు, రీఛార్జ్ చేసుకోవడం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
టెలికాం రంగంలో పోటీ
TRAI జూన్ నివేదిక ప్రకారం Vodafone Idea (Vi), BSNL వినియోగదారులు తగ్గిపోతున్నారు. జూన్‌లో Vi 2 లక్షల కస్టమర్లను, BSNL 1.35 లక్షల కస్టమర్లను కోల్పోయింది. మే నెలలో కూడా ఇలాంటి పరిస్థితి కొనసాగింది. మరోవైపు Jio, Airtel కొత్త కస్టమర్లను ఆకర్షిస్తూ, దేశంలో టాప్ టెలికాం కంపెనీలుగా తమ స్థానాన్ని మరింత బలపరుచుకుంటున్నాయి.