Relationship: మీ భర్త మీతో టైం స్పెండ్ చేయాలా.. అయితే ఈ చిట్కాలు ట్రై చేయండి?
Relationship: కొందరు ఎంతో ఇష్టపడి పెళ్లి చేసుకుంటారు కానీ అనుకోని కారణాలవల్ల వాళ్ళ మధ్య డిస్టబెన్స్ వస్తుంటాయి అందులో ఒకటి బిజీగా ఉండడం వల్ల భార్యని పట్టించుకోకపోవడం అయితే ఈ విధంగా చేస్తే మీ భర్త మీ కొంగు పట్టుకొని తిరుగుతాడు అది ఎలాగో చూద్దాం.
సాధారణంగా భార్యలు భర్తల మీద చేసే కంప్లైంట్ ఎలా ఉంటుందంటే పొద్దున్నుంటా పనితో అలసిపోయి ఉంటాను సాయంత్రం ఇయ్యటప్పటికీ నా భర్త కోసం ఎదురు చూస్తూ ఉంటాను కానీ నా భర్త మాత్రం పనిలో పడిపోయి ఇంటిదగ్గర భార్య వెయిట్ చేస్తుందనే విషయం కూడా మర్చిపోతారు.
ఇది భార్యల కంప్లైంట్. దీనికి భర్తలు ఏమంటున్నారంటే బలమైన భవిష్యత్తు కోసం మల్టీ ప్రాజెక్టు మీద పనిచేస్తున్నాను భవిష్యత్తులో కుటుంబం ఆర్థిక ఒడిదుడుకులు ఉండకూడదు అంటే నేను ఈ మాత్రం కష్టపడాలి.
కానీ నా భార్య తనని అశ్రద్ధ చేస్తున్నాను అనుకుంటుంది అని చెప్తారు. అయితే ఇద్దరి బాధలోనూ నిజం ఉంది ఇద్దరి ఎక్స్ప్లనేషన్లోనూ కూడా నిజం ఉంది అయితే కొన్ని చిట్కాలతో. మీ సమస్యలను దూరం చేసుకోవచ్చు అది ఎలాగో చూద్దాం.
మీ భర్త ఇంటికి లేటుగా వస్తున్నాడు అంటే కష్టపడి పని చేసి మాత్రమే ఇంటికి వస్తున్నాడు. గ్యాంబ్లింగ్ కి వెళ్లి టైం వేస్ట్ చేసుకుని రావడం లేదు అనే విషయం గుర్తుంచుకోండి. కాబట్టి అతనికి సపోర్ట్ గా నిలబడండి అలసటతో వచ్చిన అతనికి కాస్త మంచి మాటలతో సేద తీర్చండి.
నీకు వీలైతే అతనితోనే కూర్చొని భోజనం చేయండి. ఆరోజు జరిగిన సరదా సంఘటనలన్నీ అతనికి చెప్పండి. అతను లేటుగా ఇంటికి రావడం వలన మీరు ఎంత మిస్ అవుతున్నారు అతనికి అర్థం అయ్యేలాగా చెప్పండి. ఇలా చేయడం వలన మీరు పడుతున్న బాధని మీ భర్త అర్థం చేసుకుంటాడు.
తను చేసే పని అంత ఇంపార్టెంట్ కాదు అనుకున్నప్పుడు పోస్ట్ పోన్ చేసి మీతో టైం స్పెండ్ చేయడానికి వస్తాడు. అంతేకానీ అరిచి గోల చేయడం వల్ల ఉపయోగం ఏమీ ఉండదు సరి కదా సమస్య మరింత పెరుగుతుంది.