పెళ్లి తర్వాత ఆడవాళ్లు గూగుల్ లో ఎక్కువగా ఏం వెతుకుతారో తెలుసా?
పెళ్లితో లైఫ్ పూర్తిగా మారుతుంది. ఆడవాళ్లు ఈ కొత్త జీవితానికి అలవాటు పడటానికి కొంచెం టైం పడుతుంది. ఇది అందరికీ తెలిసిందే. అయితే కొత్తగా పెళ్లైన ఆడవారు గూగుల్ లో ఏం సెర్చ్ చేస్తారో తెలిస్తే షాక్ అవుతారు.
గూగుల్ లో సమాదానం దొరకని ప్రశ్న అంటూ ఏదీ ఉండదు. అందుకే ఓకే గూగుల్ అంటూ ప్రతి ఒక్కరూ ఎన్నో ప్రశ్నలు గూగుల్ తల్లిని అడుగుతుంటారు. ఇక గూగుల్ తనకు తెలిసిన సమాధానాన్ని స్తుంది. గూగుల్ ఎంతటి కష్టమైన ప్రశ్నలకే కాదు మనం అడిగే విచిత్రమైన ప్రశ్నలకు కూడా సమాధానం ఇస్తుంది. అందుకే మనకు తెలియని ప్రతి ప్రశ్నను గూగుల్ కు వేస్తుంటాం. అయితే అందరిలాగే కొత్తగా పెళ్లైన ఆడవారు కూడా గూగుల్ ను చిత్ర విచిత్రమైన ప్రశ్నలు అడుగుతుంటారు. చాలా మందికి వీళ్లు గూగుల్ లో ఏం సెర్చ్ చేస్తారబ్బా అని డౌట్ కూడా వస్తుంటుంది. ఎందుకంటే పెళ్లైన తర్వాత ఆడవారు చిన్న చిన్న విషయాలకు కూడా గూగుల్ సాయం తీసుకుంటారని అధ్యయనాలు చెబుతున్నాయి. అందుకే కొత్తగా పెళ్లైన అమ్మాయిలు గూగుల్ లో ఎక్కువగా ఏం సెర్చ్ చేస్తారో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
భర్త గురించి..
చాలా మంది ఆడవారు పెళ్లి తర్వాత భర్తకు సంబంధించిన ఎన్నో విషయాలను గూగుల్ లో వెతుకుతారని సర్వేలు చెబుతున్నారు. ఈ విషయం నవ్వొచ్చేలా ఉన్నా.. నిజం. అవును ఆడవారు సాధారణంగా తమ భర్త ఇష్టా యిష్టాల గురించి గూగుల్ లో ఎక్కువగా సెర్చ్ చేస్తుంటారట. ఇది చాలా కామన్ విషయం. ఎందుకంటే భర్తకు ఏది ఇష్టం, ఏది ఇష్టం ఉండదు అన్న విషయాలను తెలుసుకోవాలనే ఇంట్రెస్ట్ ప్రతి ఒక్క అమ్మాయికీ ఉంటుంది. అయితే ఈ విషయాలను నేరుగా తమ భర్తను అడగకుండా ఇలా గూగుల్ లో సెర్చ్ చేస్తారట.
భర్తను బానిసను చేయడం ఎలా?
ఇది నిజంగా నవ్వు తెప్పించే విషయమే. కానీ కొత్తగా పెళ్లైన ఆడవారు గూగుల్ ఇలా సెర్చ్ చేస్తారట. కొంతమంది ఆడవారు తమ భర్తలను ఎలా బానిసలుగా చేసుకోవాలో మార్గాలను తెలుసుకోవడానికి ఇలా గూగుల్ ను అడుగుతారట. అంతేకాదు పెళ్లైన తర్వాత భర్త ఆనందంగా, సంతోషంగా ఉండటానికి ఏం చేయాలో కూడా వెతుకుతారట. అందుకే భర్తలకు నచ్చేలా వంటలను చేయడమే కాకుండా.. వారికి రకరకాల బహుమతులను కూడా ఇస్తుంటారట.
పిల్లలు పుట్టాలంటే?
పెళ్లైన తర్వాత ఎక్కువగా గూగుల్ లో సెర్చ్ చేసే విషయాల్లో సంతానం గురించి కూడా ఉంది. పిల్లలు పెట్టడానికి ఏ నెల సరైంది? బిడ్డను ఏ వయసులో కంటే మంచిది? వంటి ఎన్నో విషయాలను ఆడవాళ్లు గూగుల్ లో ఎక్కువగా సెర్చ్ చేస్తారు.
కుటుంబంలో భాగం కావడం..
పెళ్లి తర్వాత అత్తగారింట్లో ఎలా ఉండాలి? ఎలా ఉండకూడదు? వంటి విషయాలను కూడా గూగుల్ లో ఎక్కువగా సెర్చ్ చేస్తారు. చాలా తక్కువ సమయంలో భర్త కుటుంబంలో ఎలా భాగం కావాలి? అంటూ గూగుల్ ను అడుగుతుంటారు. అలాగే కుటుంబ బాధ్యతలను ఎలా నెరవేర్చాలి? అత్తమామలు సంతోషంగా ఉండాలంటే ఏం చేయాలి? వంటి విషయాలను కూడా కొంతమంది ఆడవారు గూగుల్ లో సెర్చ్ చేస్తుంటారు.