MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Bigg Boss Telugu 10
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Life
  • Relationship
  • Love Psychology: సైకాలజీ ప్రకారం అమ్మాయిలు, అబ్బాయిల నుంచి ఏం ఆశిస్తారో తెలుసా?

Love Psychology: సైకాలజీ ప్రకారం అమ్మాయిలు, అబ్బాయిల నుంచి ఏం ఆశిస్తారో తెలుసా?

ప్రేమ బంధం.. చూడటానికి సింపుల్ గా కనిపించినా, లోపల మాత్రం వేరే ప్రపంచం ఉంటుంది. ముఖ్యంగా అమ్మాయిలు, అబ్బాయిల నుంచి ఏం ఆశిస్తారనే డౌట్ చాలామందిలో ఉంటుంది. సైకాలజీ ప్రకారం అబ్బాయిలోని ఏ లక్షణాలు అమ్మాయి మనసులో ప్రత్యేక స్థానం సంపాదిస్తాయో చూద్దాం. 

2 Min read
Author : Kavitha G
Published : Feb 20 2026, 06:05 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
Love Psychology
Image Credit : X

Love Psychology

సాధారణంగా అమ్మాయిలు, అబ్బాయిల నుంచి నిజంగా ఏం ఆశిస్తారనే సందేహం చాలామందిలో ఉంటుంది. కొన్ని సినిమాలు, సోషల్ మీడియా, స్నేహితుల మాటలు ప్రేమను చాలా క్లిష్టంగా చూపించినా, సైకాలజీ మాత్రం చాలా సింపుల్‌ విషయాలు చెబుతోంది. అవేంటో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
ఎమోషనల్ కనెక్షన్
Image Credit : X

ఎమోషనల్ కనెక్షన్

సైకాలజీ ప్రకారం మహిళలకు ఎమోషనల్ కనెక్షన్ చాలా ముఖ్యమైంది. అబ్బాయి తన భావాలను కూడా ఓపెన్‌గా పంచుకుంటే, అది ఆమెకు భద్రతా భావాన్ని ఇస్తుంది. చాలామంది అబ్బాయిలు “స్ట్రాంగ్‌గా ఉండాలి” అనే ఫీలింగ్ తో వారి బలహీనతలను దాచిపెడతారు. కానీ సరైన సమయంలో తన భావాలను పంచుకునే వ్యక్తే అమ్మాయిలకు మరింత నమ్మకంగా కనిపిస్తాడు. అమ్మాయిల అభిప్రాయాలను గౌరవించడం, పర్సనల్ స్పేస్ ని అర్థం చేసుకోవడం, నిర్ణయాల్లో వారిని భాగస్వామిని చేయడం వంటి అంశాలు వారి మనసులో స్థిరమైన స్థానాన్ని ఏర్పరుస్తాయి.

36
స్థిరత్వం ముఖ్యం
Image Credit : Getty

స్థిరత్వం ముఖ్యం

రిలేషన్ షిప్ లో స్థిరత్వం ముఖ్యమైంది. ఒక రోజు చాలా ప్రేమగా ఉండి, మరుసటి రోజు పూర్తిగా దూరంగా ఉండే ప్రవర్తన అమ్మాయిలలో అనిశ్చితిని పెంచుతుంది. సైకాలజీ ప్రకారం అమ్మాయిలు సహజంగా స్థిరమైన ప్రవర్తన ఉన్నవారిని నమ్ముతారు. చిన్న మెసేజ్ కూడా ఆమెకు మీరు కేర్ చేస్తున్నారనే భావన ఇస్తుంది. కానీ అతిగా కంట్రోల్ చేయడం, అనవసరమైన అనుమానాలు పెట్టుకోవడం వంటివి బంధాన్ని దెబ్బతీస్తాయి.

46
భవిష్యత్తుపై అవగాహన ఉన్న వ్యక్తి
Image Credit : Gemini AI

భవిష్యత్తుపై అవగాహన ఉన్న వ్యక్తి

చాలామంది అమ్మాయిలు తమను తాము విలువైనవారిగా భావించే వ్యక్తిని కోరుకుంటారు. జీవితం మీద ఫోకస్, లక్ష్యాలు, ఎదగాలనే తపన ఉన్న అబ్బాయిలు సహజంగా ఆకర్షణీయంగా కనిపిస్తారు. అయితే అహంకారం లేదా స్వార్థం చూపించే ప్రవర్తన మాత్రం రిలేషన్ షిప్ లో దూరాన్ని పెంచుతుంది. నవ్వించగలిగే వ్యక్తితో ఉండటాన్ని కూడా అమ్మాయిలు ఇష్టపడతారు. కానీ అవమానకరమైన జోకులు, ఇతరులను తగ్గించి మాట్లాడటం మాత్రం నెగటివ్ ప్రభావం చూపుతాయి.

56
తగిన గుర్తింపు..
Image Credit : Getty

తగిన గుర్తింపు..

అమ్మాయిలు ఎక్కువగా.. ప్రేమించిన వ్యక్తి తనని అర్థం చేసుకోవాలని కోరుకుంటారు. అంటే ప్రతి సమస్యను విన్న వెంటనే పరిష్కరించాలని కాదు. ఆమె బాధను వినడం, వారి భావాలను అర్థంచేసుకోవడం ముఖ్యం. చిన్న విషయాలకు థాంక్స్ చెప్పడం, ఆమె చేసిన పనిని గుర్తించి ప్రశంసించడం కూడా సంబంధాన్ని బలపరుస్తుంది.

66
గౌరవం ముఖ్యం..
Image Credit : Asianet News

గౌరవం ముఖ్యం..

సైకాలజీ ప్రకారం ప్రేమలో పరస్పర గౌరవం, సమానత్వం ముఖ్యమైనవి. ఆధిపత్యం చూపడం లేదా పూర్తిగా ఆధారపడిపోవడం రెండూ ఆరోగ్యకరం కాదు. ఆరోగ్యకరమైన సంబంధం అంటే ఇద్దరూ తమ వ్యక్తిత్వాన్ని కాపాడుకుంటూ, ఒకరికొకరు మద్ధతు ఇచ్చుకోవడమేనని సైకాలజీ నిపుణులు చెబుతున్నారు. అందుకే ఎక్కువశాతం అమ్మాయిలు, అబ్బాయిల నుంచి నిజాయతీ, గౌరవం, స్థిరత్వం, శ్రద్ధ కోరుకుంటారని వివరిస్తున్నారు.

About the Author

KG
Kavitha G
8 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2016లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియానెట్‌లో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు.
బంధుత్వం
జీవనశైలి
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
పబ్లిక్‌లో ముద్దు పెట్టుకోవడం నేరమా? ఇండియన్ చట్టాలు ఏం చెబుతున్నాయి?
Recommended image2
Love Signs: ఒక అమ్మాయి మిమ్మల్ని ప్రాణంగా ప్రేమిస్తోందని చెప్పకనే చెప్పే 7 సీక్రెట్ సిగ్నల్స్ ఇవే
Recommended image3
Relationship : మీ తల్లి, భార్య గొడవపడితే ఏం చేయాలి? చాణక్య పరిష్కారాలు
Related Stories
Recommended image1
Relationship Psychology: కొందరు అమ్మాయిలు పెళ్లైన అబ్బాయిలని ఎందుకు ఇష్టపడతారు?సైకాలజీ ఏం చెబుతోంది?
Recommended image2
Child Psychology: పిల్లల్ని పదే పదే చెంపపై కొడుతున్నారా? వాళ్లు ఎలా మారిపోతారో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved