Relationship: భార్య కోపాన్ని ఇలా మాయం చేయండి.. ఎప్పుడు తగ్గాలో తెలుసుకోండి?
Relationship: సాధారణంగా భర్తల పొరపాట్లను భార్యలు క్షమిస్తారు. కానీ శృతి మించితే విపరీతమైన కోపాన్ని ప్రదర్శిస్తారు. అప్పుడు భర్తలూ.. మీరే కాస్త తగ్గండి. భార్యని మీ దారిలోకి తెచ్చుకోండి ఈ చిట్కాలు పాటించండి.
సాధారణంగా భర్తలు తప్పులు చేయటం భార్యలు ఆలగటం ఆ అలకలు తీర్చడం ఇవన్నీ అందరి సంసారాల్లోనూ జరిగేవి కానీ కొన్ని కొన్ని సార్లు భర్తల ప్రవర్తన అద్దుమీరినప్పుడు భార్యల కోపం కూడా అద్దుమీరుతుంది అప్పుడు ఆ భార్యల కోపాన్ని తగ్గించవలసిన బాధ్యత ఆ భర్తలదే.
అలిగితివా.. సఖి ప్రియా.. అలక మానవా.. అంటే మానే భార్యలు కాదు నేటి మహిళలు. అందుకోసం కొన్ని చిట్కాలు పాటించండి. మీ భార్య కోపం తగ్గాలంటే ముందు మీరు చేసిన తప్పుకి క్షమాపణ చెప్పండి భార్య కి క్షమాపణ చెప్పటం వల్ల మీకు జరిగే అవమానం ఏమీ లేదు.
అప్పుడప్పుడు తగ్గడం వల్ల బంధం నిలబడుతుంది. అలాగే చేసిన తప్పుకి సంజాయిషీ కూడా ఇవ్వండి అప్పుడు ఆమె అర్థం చేసుకుంటుంది. అలాగే ఆడవాళ్ళ పలక సాధారణంగా గిఫ్ట్లు ఇవ్వడం ద్వారా తగ్గించవచ్చు కాబట్టి ఆమెకి ఇష్టమైన వస్తువుని గిఫ్ట్ చేయండి.
అదే సమయంలో వంట గదిలోకి వెళ్లి ఆమెకి నచ్చిన వంట ప్రిపేర్ చేయండి. తనకోసం తన భర్త వంట చేశాడు అంటే ఎంత కోపంలో ఉన్న భార్య అయినా కరిగి తీరాల్సిందే. ఇంకా ఆమె కోపం చల్లారకపోతే అలా బయటికి షాపింగ్ కి తీసుకువెళ్లండి నచ్చిన వస్తువులు కొనిపెట్టండి.
వస్తూ వస్తూ బయటే తినేసి రండి. ఎన్ని పొరపాట్లు చేసినా, ఎన్ని అబద్ధాలు చెప్పినా ఏవి నీ కన్నా ఎక్కువ కాదు అని ఆమెకి నమ్మకం కలిగేలాగా చేయండి. మీ భార్య కోపాన్ని తగ్గించడానికి ఆఖరి బ్రహ్మాస్త్రం శృంగారం.
నిజమే ప్రేమగా ఆప్యాయతగా భార్యని దగ్గరికి తీసుకోవడం వల్ల ఆమెతో శారీరిక సంబంధం వల్ల పూర్తిగా ఆమె కోపాన్ని దూరం చేయగలరు ఎందుకంటే శారీరక సంబంధం ఇద్దరి వ్యక్తులను మానసికంగా కనెక్ట్ చేయడంలో సహాయపడుతుంది.