MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Relationship
  • Marriage: మీరు కూడా పిల్లల్ని ఇందుకోసమే కంటున్నారా.?...అయితే అస్సలు వద్దు

Marriage: మీరు కూడా పిల్లల్ని ఇందుకోసమే కంటున్నారా.?...అయితే అస్సలు వద్దు

పిల్లలను కనాలన్న ఉద్దేశం మీది కాదా? సామాజిక ఒత్తిడికి లోనై తప్పుడు నిర్ణయం తీసుకోవద్దు. అసలైన కారణాలపై ఇప్పుడు ఆలోచించండి.

2 Min read
Bhavana Thota
Published : Jul 15 2025, 01:16 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
సమాజం కోసమా?
Image Credit : Freepik

సమాజం కోసమా?

పెళ్లి అయిన తరువాత చాలా మంది వెంటనే పిల్లల్ని కనాలి అనుకుంటారు.కొంతమంది మాత్రం కొంచెం గ్యాప్‌ తీసుకోవాలనుకుంటారు. కానీ అసలు పిల్లల్ని మీకు మీరుగా కనాలి అనుకుంటున్నారా..లేక సమాజం కోసం,ఇంట్లో పెద్దవారి కోసం కనాలని అనుకుంటున్నారా...అనే విషయం గురించి మాత్రం ఓ సారి పరిశీలించుకోవాలి. ఎందుకంటే పిల్లల్ని పెంచడం కేవలం ప్రేమతో కాదు, పూర్తిగా సిద్ధంగా ఉండే ఓ నిబద్ధతతో కూడిన జీవన ప్రయాణం.

27
వారసత్వాన్ని కొనసాగించాలనే
Image Credit : I stock

వారసత్వాన్ని కొనసాగించాలనే

మొదటగా, మీరు పిల్లలను ఎందుకు కనాలనుకుంటున్నారు? నిజంగా మీకు పిల్లల అవసరమా? లేక ఇంట్లో పెద్దవాళ్ల ఒత్తిడికి లోనై ఈ నిర్ణయం తీసుకుంటున్నారా? ఈ ప్రశ్నలకి నిజాయితీగా సమాధానం చెప్పగలిగితేనే మీరు ఈ నిర్ణయానికి సిద్ధంగా ఉన్నారని అర్థం.

కొంతమంది పెద్దలు మనవళ్లు కావాలని ఆశిస్తారు. తమ వారసత్వాన్ని కొనసాగించాలనే కోరికతో మన పిల్లల గురించి ముందుగానే ప్రణాళికలు వేస్తుంటారు.

Related Articles

Related image1
Relationship Tips: మీ పార్టనర్‌ నోరేసుకుపడిపోతున్నారా..అయితే ఇలా చేయండి చాలు..చచ్చిన మిమ్మల్ని వదలరు!
Related image2
Relationship: భార్య వల్ల ఆయుష్షు తగ్గుతుందా? ఇకిగాయ్ సూత్రం ఏం చెబుతోంది?
37
బంధం బలపడుతుంది
Image Credit : Freepik

బంధం బలపడుతుంది

కానీ వారి కోరిక కోసమే పిల్లలు కనడం సరైన నిర్ణయం కాదు. ఎందుకంటే మీరు తల్లిదండ్రులు అవుతారు, బాధ్యత మీ మీదే ఉంటుంది. పిల్లల భవిష్యత్తు ఒక మాదిరిగా నిర్ణయించే విషయం కాదు, అది ఒక జీవితాంత ప్రయాణం.ఇంకొంత మంది ఏం అనుకుంటారంటే - పిల్లలు కలిగితే భార్యభర్తల మధ్య బంధం బలపడుతుంది. అయితే ఇది తప్పు. సంబంధంలో అప్పటికే ఉన్న సమస్యలు పిల్లలతో మాయమవుతాయనే భావన చాలా ప్రమాదకరం. పిల్లలతో కలిసి ఉన్నపుడు మరింత ఒత్తిడి, సమయం, ఆర్థిక భారాలు వస్తాయి. ఈ పరిస్థితుల్లో మానసిక ఒత్తిడులు పెరగొచ్చు, సంబంధాలు మెరుగుపడకపోవచ్చు.

47
పురుషత్వం లేదా స్త్రీత్వాన్ని
Image Credit : TI

పురుషత్వం లేదా స్త్రీత్వాన్ని

మరికొంత మంది తమ పురుషత్వం లేదా స్త్రీత్వాన్ని నిరూపించుకోవడానికే పిల్లలు కావాలనుకుంటారు. సమాజం అలాంటి తప్పుడు అంచనాలు పెడుతూ ఉంటే, వాళ్లను సవాలు చేయడం కంటే తలొగ్గడం తేలికగా అనిపించొచ్చు. కానీ, పిల్లలు మీ గౌరవానికి సాక్ష్యం కావాల్సిన అవసరం లేదు. మీరు సంతోషంగా, స్థిరంగా ఉన్నపుడే వారి జీవితంలోకి రావడం మంచిది.

57
అందరూ కనేస్తున్నారు...
Image Credit : pexels

అందరూ కనేస్తున్నారు...

కొన్ని జంటలు అందరిలా కాకుండా భిన్నంగా ఉండాలని కోరుకుంటారు. అందరూ పిల్లల్ని కంటున్నారనేదే వారి ప్రేరణ. ఇది కూడా ప్రమాదకరమైన తప్పుడు కారణం. పిల్లల్ని పెంచడం అన్నది ఫ్యాషన్ కాదు. ఇది ఒక జీవిత బాధ్యత. మీరు మానసికంగా, శారీరకంగా సిద్ధంగా లేనప్పుడు వారి ఎదుగుదలపై ప్రతికూల ప్రభావం పడొచ్చు.

ఇంకొంతమంది తల్లిదండ్రులు భావిస్తారు – తమ జీవితంలో సాధించలేకపోయినవాటిని పిల్లల ద్వారా సాధించాలన్న ఆశ. అయితే ఇది పిల్లల పట్ల అన్యాయంగా ప్రవర్తించడమే అవుతుంది. ప్రతి ఒక్కరి జీవిత ప్రయాణం వేరు. పిల్లల వ్యక్తిత్వం వారికే చెందాలి.వారి ఆలోచనలు వారికే ఉండాలి.మన కోరికలు, ఆశలు,కలలు వారి మీద ఎప్పటికీ రుద్దకూడదు.

67
సమర్థంగా పెంచగలరా
Image Credit : Getty

సమర్థంగా పెంచగలరా

ఈ కారణాలన్నింటిలోనూ ముఖ్యమైన విషయం ఏమిటంటే, మీరు పిల్లల్ని ప్రేమగా, సమర్థంగా పెంచగలరా అనే ప్రశ్నకు స్పష్టంగా సమాధానం చెప్పగలగడం. పిల్లలు ఒక సంబంధాన్ని బలపరచే సాధనం కావు. వారు ఒక బాధ్యత, ఒక ప్రయాణం. మీరు తమకు కావలసిన ప్రేమ, సంరక్షణ, సమయం ఇవ్వగలరా అనే విషయాన్ని గమనించాలి.

పిల్లలు కనాలనే ఆలోచన ముందు, మీరు నిజంగా సిద్ధంగా ఉన్నారా? మీ జీవిత పరిస్థితులు దానికి అనుకూలమా? ఈ ప్రశ్నలపై స్పష్టత ఉండాలి. కుటుంబ ఒత్తిడి, సమాజ ఆశలు, వ్యక్తిగత అసంతృప్తుల కారణంగా నిర్ణయం తీసుకోవడం కాకుండా, పిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని నిర్ణయం తీసుకోవాలి.

77
ఒక బాధ్యత
Image Credit : Google

ఒక బాధ్యత

మీ జీవితాన్ని మార్చే అతి కీలకమైన ఈ నిర్ణయం ముందు ఒక సారి ఆలోచించండి. తల్లి తండ్రిగా మారడం అనేది ఒక  బాధ్యత. మీరు నిజంగా సిద్ధంగా ఉన్నప్పుడు మాత్రమే ఈ ప్రయాణం ప్రారంభించండి.

About the Author

BT
Bhavana Thota
భావన మహిళా జర్నలిస్ట్. ఈమె 10 ఏళ్లుగా పాత్రికేయరంగంలో ఉన్నారు. స్థానిక వార్తలు మొదలుకుని అంతర్జాతీయ వార్తల దాకా ఏ అంశంపై అయినా సులభంగా అర్థం అయ్యేలా కథనాలు రాయగలగడం భావన ప్రత్యేకత. ఈమె ఈనాడులో దాదాపు ఆరేళ్లు పని చేశారు. తొలివెలుగు, ఆర్టీవీలోనూ ఈమె పలు కేటగిరీలకు సబ్ ఎడిటర్ గా వ్యవహరించారు. ప్రస్తుతం ఏసియానెట్ న్యూస్ తెలుగులో ఆమె ఫ్రీలాన్స్ జర్నలిస్టుగా పని చేస్తున్నారు.
బంధుత్వం
జీవనశైలి
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Related Stories
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved