Relationship: భార్య వల్ల ఆయుష్షు తగ్గుతుందా? ఇకిగాయ్ సూత్రం ఏం చెబుతోంది?
ఆరోగ్యంగా, హ్యాపీగా జీవించాలని అందరూ కోరుకుంటారు. కానీ హ్యాపీగా బతకనిచ్చే వాళ్లు కూడా ఉండాలి కదా.. అంటున్నారు జపనీస్ జీవితాలను అధ్యయనం చేసిన ఇకిగాయ్ రచయితలు. ఫ్రెండ్స్ వల్ల ఆయుష్షు పెరుగుతుంది.. భార్య వల్ల తగ్గుతుందా? అన్న మాటను వారు ఇలా వివరించారు.

ఫ్రెండ్స్ వల్ల ఆయుష్షు పెరుగుతుంది- భార్య వల్ల తగ్గుతుందా?
ఆయుష్షు పెరగాలంటే బ్రతకాలని మాత్రమే కాదు.. బ్రతికించేవాళ్లు కూడా ఉండాలి అంటారు ఓగిమి గ్రామపు వందేళ్ల నాటి జపనీస్ తాతలు. వారి జీవితాన్ని అధ్యయనం చేసిన ఇకిగాయ్ రచయితలు హెక్టర్ గార్సియా, ఫ్రాన్సెస్ మిరాలెస్. ఫ్రెండ్స్, భార్య మన ఆయుష్షు పెరగడానికి, తగ్గడానికి ఎలా కారణమవుతారో.. వారి మాటల్లో ఇక్కడ తెలుసుకుందాం
ఇకిగాయ్ సూత్రం
జపానీస్ ఆరోగ్యంగా జీవించడానికి ప్రధాన కారణం ఇకిగాయ్ సూత్రం. ఒక వ్యక్తికి సంతోషం, సార్థకతను అందించే ఒక ముఖ్యమైన భావన ఇకిగాయ్. ఇది ప్రజలకు ఉద్ధేశం, సంతోషంతో నిండిన జీవితాన్ని గడపడానికి సహాయపడుతుంది.
ఫ్రెండ్స్ వల్ల ఆయుష్షు పెరుగుతుంది!
ఒకినావా అనే జపాన్ దీవిలో మోయ్ అనే ప్రాచీన సంప్రదాయం ఉంది. ఇది ఒక ఫ్రెండ్స్ గ్రూప్. వారంతా చిన్నప్పటి నుంచే ఒక చిన్న క్లబ్ లా తయారవుతారు. నెలనెలా చందాలు వేసుకుంటారు. ఎవరికైనా ఆరోగ్య సమస్యలు, డబ్బు అవసరం, మానసిక ఒత్తిడి వచ్చినా ఈ ఫ్రెండ్స్ తాము ఉన్నామంటూ ముందుకు వస్తారు.
ఆయుష్షు పెరగడానికి..
ఇది జపాన్ దేశ ప్రజల ఆయుష్షు రహస్యాల్లో ఒకటి. ఫ్రెండ్స్ వల్ల మనకు ఒక భరోసా లభిస్తుంది. మనం ఒంటరిగా లేమనే భావన కలుగుతుంది. దీనివల్ల మన శరీరం కార్టిసాల్ అనే ఒత్తిడి హార్మోన్ ను తక్కువగా రిలీజ్ చేస్తుంది. ఫలితంగా గుండె, మెదడు మెరుగ్గా పనిచేస్తాయి.
అంతే కాదు ప్రతి రోజు మోయ్ (Moai) గ్రూప్ లో చర్చలు, ఆటలు పాటలు, పొలిటికల్ డిబేట్లు, చిన్నపాటి గొడవలు కూడా జరుగుతాయి. ఇవన్నీ మానసిక ఉత్సాహానికి తోడ్పడుతాయి. ఇవి అన్ని కలిసి ఆయుష్షును పెంచేలా చేస్తాయి.
భార్య వల్ల ఆయుష్షు తగ్గుతుందా?
ఈ ప్రశ్నకి కరెక్టుగా సమాధానం చెప్పాలంటే.. భార్యతో బంధం మన ఎదుగుదల, సంతోషానికి సహకరించేలా ఉంటే ఆయుష్షు పెరుగుతుంది. మన సంతోషాన్ని తగ్గించేలా ఉంటే ఆయుష్షు తగ్గుతుంది.
ఇకిగాయ్ లో చెప్పిన మరో ప్రధాన కాన్సెప్ట్ ఏంటంటే.. సంఘ బంధాలు. ఇవి మానసిక స్థిరత్వానికి బలమైన ఆధారం. ప్రేమ, సహనం, స్వేచ్ఛ ఉండే సంబంధం ఆయుష్షును పెంచుతుంది. కానీ ఒత్తిడి, బాధ, నియంత్రణ ఎక్కువైన బంధం మాత్రం కార్టిసాల్ ను పెంచుతుంది. ఇది మన శరీరాన్ని త్వరగా వృద్ధాప్యంలోకి నెట్టేస్తుంది.
ఫైనల్ గా..
మన జీవితం స్నేహితులతో కలిసి నవ్వుకునే సందర్భాలతో నిండితే మన జీవిత రైలు సాఫీగా సాగుతుంది. హస్పెండ్ / వైఫ్ కూడా మోయ్ ఫ్రెండ్ లా మారితే… ఇకిగాయ్ రచయితలు చెప్పినట్లు ఆయుష్షు మరింత పెరుగుతుంది.