Relationship: మీ భర్త మిమ్మల్ని నిర్లక్ష్యం చేస్తున్నారా.. అయితే ఈ విధంగా చేసి చూడండి!
Relationship: సాధారణంగా వివాహ బంధం లో చిన్న చిన్న పొరపొచ్చాలు వస్తూ పోతూ ఉంటాయి. అయితే అవి వెంటనే సమసి పోవాలి. అంతేగాని గొడవల కారణంగా నీ భర్త మిమ్మల్ని దూరం పెట్టినట్లు అనిపిస్తే ఈ విధంగా చేసి చూడండి.
హిందూ సంప్రదాయం ప్రకారం వివాహ బంధం ఎంతో పవిత్రమైనది. ఆ బంధాన్ని నిలుపుకోవటం దంపతులిద్దరి చేతుల్లోని ఉంటుంది. వివాహ బంధంలో ప్రేమ, విశ్వాసం,సహనం ఎప్పుడూ ఉండాలి. ఒకరి అవసరాలు ఒకరు తెలుసుకుంటూ చేదోడు వాదోడుగా ఉండాలి.
అయితే నేటి కాలంలో చిన్న చిన్న విషయాలనే పెద్దవిగా చేసుకొని పట్టుమని పదేళ్లు కూడా కలిసి ఉండలేకపోతున్నారు దంపతులు. ఏ బంధం లో అయినా గొడవలు రావడం సహజం. అలాంటి సందర్భాలలో మీ భర్త మిమ్మల్ని నిర్లక్ష్యం చేస్తున్నట్లు మీకు అనిపిస్తే బాధపడకండి.
మీ ప్రవర్తనతో తిరిగి అతనిని మీ వశం చేసుకునేలాగా ప్రవర్తించండి. అందుకు ఏం చేయాలంటే ముందుగా మీ భర్త మిమ్మల్ని నిజంగానే నిర్లక్ష్యం చేస్తున్నారా, ఒత్తిడి వల్ల అలా ప్రవర్తిస్తున్నారా అనేది తెలుసుకోండి. వీలైతే అతనితో సమస్యల గురించి మాట్లాడండి.
వర్క్ ప్రెజర్స్ వంటివి ఉన్నట్లయితే అతనికి మీ సపోర్ట్ ని ఇవ్వండి. పని ఒత్తిడి వల్ల మగవాళ్ళు ఎక్కువగా బంధాల్ని నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. కాబట్టి వారితో వీలైనంత ఎక్కువ సమయం గడిపేందుకు ప్రయత్నించండి. ఒకరు ప్రెజర్ లో ఉన్నప్పుడు మరొకరు ప్రెషర్ రిలీఫ్ గా ఉండటానికి ప్రయత్నించండి.
ఇద్దరూ ప్రెజర్ ఫీల్ అయితే అది బంధం విచ్ఛిన్నం అవటానికి కారణం అవుతుంది. వారు ఒత్తిడిలో ఉన్నప్పుడు మీ సమస్యను వారి ముందు పెట్టకండి. వారికి కొంత సమయం ఇచ్చి చూడండి. సమస్య దానంతట అదే పరిష్కారం అవుతుంది. ఎందుకంటే చాలా గాయాలకు సమయమే మంచి ఔషధం. అలాగే చాలా సమస్యలు మాట్లాడటం ద్వారా పరిష్కారం అవుతాయి
మీ యొక్క బాధని, ఆవేశాన్ని వారు ప్రశాంతంగా ఉన్నప్పుడు మాత్రమే వారి ముందు వ్యక్తపరచండి, వారి అభిప్రాయాన్ని కూడా తెలుసుకోండి. ఎందుకంటే వారి వెర్షన్ లో వారు కరెక్ట్ అయ్యి ఉండవచ్చు. కాబట్టి వారిలా ఆలోచిస్తే సమస్య చాలా మటుకు సర్దుమనుగుతుంది.