Relashionship: తరుచూ మీ భాగస్వామి మీతో గొడవపడుతున్నారా.. అయితే ఇలా చెక్ పెట్టండి?
Relationship: పెళ్లి.. ఇది ఒక పవిత్ర బంధం కానీ అవగాహన లేకపోవడం వల్ల తరుచూ భార్యాభర్తలు గొడవ పడుతూ ఉంటారు. అలా జరగకుండా ఒకసారి ఇలా ప్రయత్నించి చూడండి.
భార్యాభర్తల బంధం కలకాలం నిలవాలంటే ముందుగా ఇద్దరి మధ్య అవగాహన ఉండాలి కాబట్టి ఒకరి కోసం ఒకరు వీలైనంత ఎక్కువ సమయం కేటాయించండి. అందులోనూ ఎక్కువ సమయం మీ గురించే మాట్లాడుకోండి. తర్వాతే మిగిలిన విషయాలు.
ఇలా మాట్లాడుకోవడం వలన ఒకరి గురించి మరొకరు లోతుగా తెలుసుకునే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత ఒకరికి ఒకరు సాయం చేసుకోవడం వల్ల కూడా బంధం బలపడుతుంది. అలా కాకుండా ఒకరిని ఒకరు నిందించుకోవడం వలన ఎదుటి వ్యక్తి మీద ఉన్న సదాభిప్రాయం పోతుంది.
కాబట్టి జీవిత భాగస్వామి మీద నిందలు వేయటం మానేయండి. చేసే పని చిన్నదైనా ఆ పనిని మెచ్చుకోవటం వల్ల ఎదుటి వ్యక్తిలో ఉత్సాహం వస్తుంది వారు మరింత చురుకుగా పనిచేయటానికి అవకాశం ఇచ్చినవారు అవుతారు.
అలా కాకుండా చులకనగా మాట్లాడటం వల్ల ఎదుటి వ్యక్తి నిరాశకు గురవుతారు. అలాగే తరచుగా మీ ఇద్దరూ మాత్రమే చిన్న చిన్న టూర్లు ప్లాన్ చేసుకోండి. దానివల్ల ఒత్తిడి నుంచి దూరమై మనసుకి ఆహ్లాదంగా ఉంటుంది అప్పుడు ప్రతి విషయం మనకి పాజిటివ్ గానే కనిపిస్తుంది.
అలాగే ఒకరికి ఒకరు విలువ ఇచ్చుకోవడం వల్ల కూడా బంధం బలపడుతుంది. ఎదుటి వ్యక్తి గురించి పదిమందిలోని చులకనగా మాట్లాడితే అది బంధం పల్చబడటానికి కారణం అవుతుంది. మీరు విలువ ఇస్తేనే మీ భాగస్వామికి ఎదుటి వ్యక్తి విలువ ఇస్తారు అని తెలుసుకోండి.
మీ భార్య గాని భర్త గాని సమస్యలలో ఉన్నప్పుడు నేను ఉన్నాను అనే భరోసా ఇవ్వండి. ఆ మాట ఎదుటి వాళ్ళ మనసులో మీ స్థానాన్ని మరింత పెంచుతుంది. అలా చేతనైతే ఆ సమస్యని పరిష్కరించండి. ఇలాంటి చిన్న చిన్న సర్దుబాట్లు చేసుకుంటే భార్యాభర్తల మధ్య ఎలాంటి గొడవలు జరగవు.