Relationship: లేటు వయసులో పెళ్లి చేసుకుంటే.. ఎన్ని లాభాలో తెలుసా!
Relationship: చాలామంది కెరీర్ మీద దృష్టి పెట్టి పెళ్లి లేటుగా చేసుకుంటున్నారు. అయితే నేటి పరిస్థితుల దృష్ట్యా అలా చేయడం చాలా మంచిది అంటున్నారు రిలేషన్ ఎక్స్పర్ట్స్. లేటుగా పెళ్లి చేసుకోవడం వల్ల లాభాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.
ఒకప్పుడు 16, 17 సంవత్సరాలు వచ్చాయంటే చాలు తల్లిదండ్రులు పెళ్లి సంబంధాలు వేట మొదలు పెట్టేవారు. అప్పట్లో కెరియర్ కి అంత ఇంపార్టెన్స్ ఇచ్చేవారు కాదు. కానీ నేటి పరిస్థితి అందుకు విరుద్ధంగా ఉంది. ముందు కెరియర్ తర్వాత పెళ్లి అంటున్నారు యువతరం. అందుకు వయసు పైపడుతున్నా కూడా పట్టించుకోవడం లేదు.
అయితే ఇలా చేయడం కూడా కరెక్టే అంటున్నారు రిలేషన్ ఎక్స్పర్ట్స్. ఎందుకంటే 30ల్లోకి వచ్చిన తర్వాత పెళ్లి చేసుకుంటే వారికి జీవితం మీద ఒక అవగాహన వస్తుంది. ఏది ప్రేమ, ఏది ఆకర్షణ అనే విషయాలపై స్పష్టమైన అవగాహన ఉంటుంది.
పెళ్లి అంటే కోరికలు తీర్చుకోవడం మాత్రమే కాదని అంతకు మించిన విషయాలు ఎన్నో ఉన్నాయి అని అర్థమవుతుంది, ఎదుటి మనిషిని అంచనా వేసే ఒక మెచ్యూరిటీ వస్తుంది. అలాగే స్నేహితులతో ఎంజాయ్ చేయటానికి తగినంత సమయం ఏర్పడుతుంది. బాధ్యత లేని జీవితం మనిషికి ఆనందాన్ని ఇస్తుంది.
సింగిల్ లైఫ్ లో ఇంకా ఏదో మిస్ అయ్యామని ఫీలింగ్ వాళ్లకి కలగదు. మూడు పదుల వయసు వచ్చేసరికి ఎవరితో మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి, మనతో మాట్లాడుతున్న వారు నిజాయితీగా ఉన్నారా అనే విషయాలపై క్లారిటీ వస్తుంది. దానిని బట్టి మనం కూడా ఎలా ప్రవర్తించాలి అనే అవగాహన ఏర్పడుతుంది.
అదే చిన్న వయసులో పెళ్లి చేసుకుంటే రిలేషన్ షిప్ కి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉంటుంది. చుట్టూ ఉన్న ప్రపంచాన్ని, కెరియర్ ని, మనదైన వ్యక్తిత్వాన్ని కోల్పోవాల్సి ఉంటుంది. అలాగే సమస్యలు వచ్చినప్పుడు పరిష్కరించుకునే స్వభావం కూడా చిన్న వయసులో పెళ్లి చేసుకుంటే కలగదు.
సమస్య పరిష్కరించటం కోసం పెద్దవాళ్ళ మీద ఆధారపడవలసి వస్తుంది. అదే 30 సంవత్సరాలు దాటిన వాళ్ళకి సమస్యలు వస్తే వాళ్ళకి ఆ సమస్యని పరిష్కరించుకోగలరు. లేట్ మ్యారేజ్ లో లాభాలు చూశారు కదా కాబట్టి లేట్ మ్యారేజ్ అని కంగారు పడవలసిన అవసరం లేదు.