MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Relationship
  • Motivation: పెళ్లైన కొత్త జంటలు ఎలా ఉండాలి.? సుధామూర్తి సలహాలు పాటిస్తే లైఫ్‌ ఈజ్‌ బ్యూటిఫుల్ అంతే.

Motivation: పెళ్లైన కొత్త జంటలు ఎలా ఉండాలి.? సుధామూర్తి సలహాలు పాటిస్తే లైఫ్‌ ఈజ్‌ బ్యూటిఫుల్ అంతే.

ప్రతీ మనిషి జీవితంలో వివాహానికి ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. భవిష్యత్ తరాలను అందించే వివాహ వ్యవస్థ బాగుండాలంటే ఆలుమగలిద్దరు అన్యోన్యంగా ఉండాలి. మరి వివాహ బంధం బలంగా ఉండాలంటే ఎలాంటి చిట్కాలు పాటించాలి? లాంటి వివరాలను ప్రముఖ రచయిత్రి, రాజ్యసభ సభ్యురాలు సుధా మూర్తి పంచుకున్న కొన్ని ఆసక్తికర విషయాలు మీకోసం..  

2 Min read
Author : Narender Vaitla
Published : Feb 21 2025, 11:56 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14

సుధా మూర్తి ఈ పేరును ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. ఇన్ఫోసిస్‌ వ్యవస్థాపకుల్లో ఒకరైన నారాయణ మూర్తి సతీమణి, కొన్ని వేల కోట్లకు అధిపతి, రాజ్యసభ సభ్యురాలు, సామాజిక కార్యకర్త. ఇలా ఎన్ని హోదాలు ఉన్నా అత్యంత నిరాడంరబంగా ఉంటారు సుధా మూర్తి. జీవితం పట్ల తనకున్న అవగాహన అసాధారణం. పలు ఇంటర్వ్యూలో ఆమె చెప్పిన విషయాలు యువకు ఎంతో ఆదర్శంగా ఉంటాయి. ఈ క్రమంలోనే వివాహ వ్యవస్థ గురించి గతంలో ఆమె పలు ఆసక్తికర విషయాలు తెలిపారు. మంచి భార్యభర్తలకు ఉండాల్సిన లక్షణాల గురించి వివరించారు. అవేంటంటే.. 
 

24

* ఆలుమగలు అన్న తర్వాత గొడవలు సర్వసాధారణం. దీనిని కచ్చితంగా అంగీకరించాల్సిందే. మీ మధ్య ఎప్పుడూ గొడవలు జరగలేవంటే మీరు నిజమైన భార్య, భర్తలు కాదని అర్థం చేసుకోవాలి. 

* అయితే గొడవ జరిగిన సమయంలో ఇద్దరిలో ఒకరు కచ్చితంగా కూల్‌ అవ్వాలి. అలా కాకుండా నువ్వెంత అంటే నువ్వెంత అంటూ పోతే ఆ గొడవకు అంతు పడదు. అందుకే కొన్నిసార్లు మన తప్పు లేకపోయినా తగ్గాలి, అందులో తప్పేం ఉండదు. 

* ఇక మూడో అంశం.. పరిపూర్ణమైన జీవితం ఉంటుందని అస్సలు అనుకోకూడదు. ఎందుకంటే అలా ఎప్పటికీ ఉండదు. పర్ఫెక్ట్ జంట అని కూడా ఏదీ ఉండదు. ఒక వ్యక్తిలో మంచి, చెండు రెండూ ఉంటాయి. కాబట్టి ఒకరికొరు తమ తప్పుఒప్పులను అర్థం చేసుకుంటూ ముందుకు సాగాలి. 
 

34

* మగవారు కచ్చితంగా వంట గదిలో తమ భార్యలకు సహాయం చేయాలి. అది కేవలం మహిళల పనేనని భావించకూడదు. కనీసం ఆదివారం రోజైనా మీ భార్యకు వంట చేయడంలో సాయం చేయండి, అది వారికి ఎంతో సంతోషాన్ని ఇస్తుంది. 

* వైవాహిక జీవితం సాఫీగా సాగాలంటే ఓపిక కచ్చితంగా ఉండాలి. కుటుంబాన్ని కలిపి ఉంచేందుకు కొన్ని విషయాల్లో తగ్గాలి, కొన్ని సందర్భాల్లో ఓపికతో ఉండాలనే సత్యాన్ని అర్థం చేసుకోవాలి. 

44

* భార్యభర్తలు స్నేహితులుగా ఉంటే ఎలాంటి సమస్యలు రావు. ఇంట్లో నా మాట వేదం, నేను చెప్పిందే జరగాలన్నా ఆలోచనల నుంచి వీలైనంత వరకు బయటకురావాలి. 

* సంబంధాల్లో అహంకారం విషం లాంటిది. ఒకరినొకరు సమానంగా చూసుకోవాలి. అధికారం కోసం అస్సలు పోటీ పడకూడదు. ఎవరి మాట చెల్లడం కంటే కుటుంబం సంతోషంగా ఉంటుందా లేదా అన్న దానికి ప్రాధాన్యత ఇవ్వాలి. 

About the Author

NV
Narender Vaitla
Narender Vaitla has over eight years of experience in print and digital media. He is currently working as a Senior Sub Editor at Asianet News.He began his journalism career in 2015 with the Sakshi newspaper. Later, in 2019, he worked as a Sub Editor in the digital division of Eenadu, and in 2020, he joined TV9 Telugu (Digital) as a Senior Sub Editor.He regularly writes news stories across sections such as lifestyle, technology, human interest, and related beats.

Latest Videos
Recommended Stories
Recommended image1
Love Psychology: సైకాలజీ ప్రకారం ప్రేమలో ఉన్నవాళ్లు కచ్చితంగా తెలుసుకోవాల్సిన 5 విషయాలు ఇవే!
Recommended image2
Relationship Psychology: సైకాలజీ ప్రకారం మనల్ని నిజంగా మిస్ అయ్యేవారు చేసే 5 పనులు ఇవే!
Recommended image3
Love Psychology: సైకాలజీ ప్రకారం అమ్మాయిలు, అబ్బాయిల నుంచి ఏం ఆశిస్తారో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved