- Home
- Life
- Relationship
- పెళ్లై పిల్లలున్న వారు లవర్‌తో కలిసి భర్తలను ఎందుకు చంపేస్తున్నారు.? సైకాలజీ ఏం చెబుతోందంటే
పెళ్లై పిల్లలున్న వారు లవర్‌తో కలిసి భర్తలను ఎందుకు చంపేస్తున్నారు.? సైకాలజీ ఏం చెబుతోందంటే
Psychology: వివాహేతర సంబంధాలు మనుషులను హంతకులుగా మారుస్తున్నాయి. కట్టుకున్న భర్తను కడతెర్చుతున్నారు కొందరు మహిళలు. తాజాగా మేడిపల్లి పరిధిలో జరిగిన అశోక్ హత్య అందరినీ ఉలిక్కిపడేలా చేసింది. ఈ నేపథ్యంలో ఈ రాక్షస ధోరణికి కారణం ఏంటో తెలుసుకుందాం.

బయటకు సాధారణంగా కనిపించే జీవితం లోపల ఏం జరుగుతోంది?
పెళ్లి అయి, పిల్లలు ఉన్న మహిళలు హఠాత్తుగా వేరే వ్యక్తితో ప్రేమలో పడటం చాలా మందికి ఆశ్చర్యంగా అనిపిస్తుంది. బయటకు చూస్తే కుటుంబం ఉంది, భర్త ఉన్నాడు, బాధ్యతలు ఉన్నాయి. కానీ లోపల మాత్రం ఖాళీ ఉంటుంది. సైకాలజీ ప్రకారం మనిషి కేవలం బాధ్యతలతో జీవించలేడు. భావోద్వేగ కనెక్షన్ లేకపోతే మనసు నెమ్మదిగా వేరే చోట సాంత్వన వెతుకుతుంది. ఈ మహిళలు ప్రేమను కాదు, తమను ఎవరో అర్థం చేసుకోవాలని కోరుకుంటున్నారు.
ఎమోషనల్ డిప్రివేషన్, ప్రేమ లేని పెళ్లి ప్రభావం
చాలా పెళ్లిళ్లలో భర్త–భార్య మధ్య మాటలు ఉంటాయి, కానీ భావాలు ఉండవు. భర్త పని, బాధ్యతలు, కుటుంబ ఒత్తిళ్లలో మునిగిపోతాడు. మహిళ తన భావాలు, భయాలు, ఒంటరితనం చెప్పుకునే స్థలం కోల్పోతుంది. ఇలాంటి సమయంలో ఒక వ్యక్తి వచ్చి “నిన్ను అర్థం చేసుకుంటున్నాను” అని చెప్పగానే మెదడులో డోపమైన్ విడుదల అవుతుంది. ఇది ప్రేమగా అనిపిస్తుంది. నిజానికి అది భావోద్వేగ ఆకలి తీరిన ఆనందం మాత్రమే.
నిషేధించిన విషయానికే ఆకర్షణ ఎక్కువ
సైకాలజీ ప్రకారం నిషేధించిన విషయం మెదడుకు ఎక్కువగా ఆకర్షణీయంగా అనిపిస్తుంది. దీనినే “Forbidden Fruit Effect”గా పిలుస్తారు. భర్తతో జీవితం రొటీన్‌గా మారిన తర్వాత, దాచుకోవాల్సిన ప్రేమ, రహస్యంగా జరిగే కలయిక, భయంతో కూడిన ఆనందం ఇవన్నీ కలిసి ప్రేమను చాలా గాఢంగా అనిపింపజేస్తాయి. ఇక్కడ ప్రేమ అని చెప్పేకంటే.. డ్రామా + రిస్క్ + ఎమోషన్ ఇవి మహిళను బలంగా కట్టిపడేస్తాయి.
హింస వరకు ఎలా వెళ్తోంది?
ఇక్కడే ప్రమాదకరమైన మలుపు వస్తుంది. కొన్ని సందర్భాల్లో ప్రేమించిన వ్యక్తితో కలిసి భర్తను చంపే స్థాయికి పరిస్థితి చేరుతుంది. సైకాలజీ ప్రకారం ఇలా జరగడానికి కొన్ని కారణాలు ఉన్నాయి.
* భర్త తమ బంధానికి అడ్డంకిగా ఉన్నాడన్న భావన నెమ్మదిగా బలపడుతుంది.
* ప్రేమించిన వ్యక్తి మాటలు మహిళ ఆలోచనలను ప్రభావితం చేస్తాయి.
* “మన జీవితానికి అతనే అడ్డం” అనే భావన నార్మల్ అవుతుంది. ఎంపథీ తగ్గిపోతుంది, సామాజిక విలువలు మసకబారతాయి. అయితే ఇదంతా ఒక్కసారిగా జరగదు. చిన్న చిన్న ఆలోచనలు క్రమంగా పెద్ద నిర్ణయాలుగా మారతాయి. దీనినే Cognitive Distortionగా చెబుతుంటారు.
ఇది ప్రేమా? మానసిక అస్థిరతా?
ఇలాంటి కేసుల్లో కనిపించేది ప్రేమ కాదు. అది Unresolved Trauma + Emotional Neglect + Psychological Dependency కలయిక. సైకాలజీ చెప్పే దాని బట్టి.. ప్రేమ హింసకు దారి తీస్తే అది ప్రేమ కాదు. భావోద్వేగ సమస్యలను మాట్లాడుకునే అవకాశం లేకపోవడం ప్రధాన కారణం. ఇందులో కేవలం మహిళలనే నిందించడం తప్పని కూడా చెప్పే వారు ఉన్నారు. అవతలి వ్యక్తి చెప్పే మాటలు, చేసే పనులు మహిళ మెంటల్ స్టేటస్‌ను మార్చేస్తాయని నిపుణులు అంటున్నారు. ఇది ఒక వ్యవస్థ వైఫల్యం అని చెబుతుంటారు. మెంటల్ హెల్త్‌ను నిర్లక్ష్యం చేయడం, సంబంధాల్లో భావాలను అణిచివేయడం వంటి ఎన్నో అంశాలు ఇలాంటి విషాదాలకు దారి తీస్తున్నాయని నిపుణుల అభిప్రాయం. అయితే ఒక వ్యక్తికి తనకు నచ్చినట్లు జీవించే హక్కు ఎంత ఉందో మరో వ్యక్తిని హతమార్చే హక్కు అస్సలు ఉండదనే విషయాన్ని గుర్తించాలి. పరిస్థితులు ఎలాంటివైనా సరే చేసిన తప్పునకు కచ్చితంగా శిక్ష అనుభవించాల్సిందే.

