Relationship: భార్యభర్తల మధ్య ఏజ్ గ్యాప్ ఎక్కువగా ఉంటే ఏమౌతుంది?
ఏజ్ గ్యాప్ ఎక్కువతో పెళ్లి చేసుకున్న సెలబ్రెటీలు కూడా ఉన్నారు. అసలు.. ఇలా పెళ్లి చేసుకోవడం కలిగే లాభం ఏంటి? నష్టం ఏంటి? అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం..

రిలేషన్ షిప్ లో ఈ మధ్య ఏజ్ గ్యాప్ ఎక్కువగా ఉండటం అనేది కామన్ అయిపోయింది. దీనిని చాలా మంది ఫ్యాషన్ గా కూడా భావిస్తున్నారు. వయసులో తనకంటే పెద్ద అమ్మాయిలను పెళ్లి చేసుకుంటున్న అబ్బాయిలు ఉన్నారు. తమ కంటే వయసులో పెద్ద వారిని ఇష్టపడుతున్న అమ్మాయిలు కూడా ఉన్నారు. ఇలా ఏజ్ గ్యాప్ ఎక్కువతో పెళ్లి చేసుకున్న సెలబ్రెటీలు కూడా ఉన్నారు. అసలు.. ఇలా పెళ్లి చేసుకోవడం కలిగే లాభం ఏంటి? నష్టం ఏంటి? అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం..
Age gap
ఎక్కువ ఏజ్ గ్యాప్ తో పెళ్లి చేసుకోవడం వల్ల కొన్ని లాభాలు ఉన్నాయట. ముందు అవేంటో చూద్దాం..
అనుభవం..
వయసులో పెద్ద అయిన వారికి అనుభవం ఎక్కువగా ఉంటుంది.దాని వల్ల రిలేషన్ షిప్ లో ఒక స్టెబిలిటీ ఉంటుంది. ఇక.. రిలేషన్ లో చిన్నవారు వారి బంధానికి కొత్తదనం, అలాగే ఎనర్జీ తీసుకువస్తారు. లైఫ్ చాలా బ్యాలెన్స్డ్ గా ఉంటుంది.
ఒకరి నుంచి ఒకరు నేర్చుకునే అవకాశం
పెద్ద వయసు ఉన్న వ్యక్తి జీవితంలోని ముఖ్యమైన విషయాలు నేర్పిస్తారు. చిన్న వయసు వ్యక్తి కొత్త ఆలోచనలు, ట్రెండ్స్ గురించి చెబుతారు. దీంతో ఒకరి నుంచి మరొకరు తెలియని విషయాలు తెలుసుకునే అవకాశం ఉంది.
3. మెచ్యూరిటీ
పెద్ద వయసు వ్యక్తి సాధారణంగా మెచ్యూర్డ్ గా ఉంటారు. దీనివల్ల రిలేషన్షిప్ లో తక్కువ గొడవలు, ఎక్కువ అవగాహన ఉంటాయి. విడిపోతాం అనే భయం ఉండదు. చిన్న వయసులో ఉన్న భాగస్వామి తొందరపడినా, వయసులో పెద్దవారు సర్దిచెప్పే అవకాశం ఉంటుంది.
4. బ్యాలెన్స్డ్ లైఫ్ స్టైల్
ఇలాంటి రిలేషన్షిప్స్ లో ఇద్దరు పార్ట్నర్స్ ఒకరి స్వభావాన్ని ఒకరు బ్యాలెన్స్ చేయగలరు. ఒకరు కెరీర్ పై దృష్టి పెడితే, మరొకరు స్వేచ్ఛ, అడ్వెంచర్ పై నమ్మకం ఉంచుతారు.
ఏజ్ గ్యాప్ ఎక్కువగా ఉంటే నష్టాలు...
1. ఆలోచనలు, అభిరుచుల్లో తేడా
ఏజ్ గ్యాప్ రిలేషన్షిప్ లో ఆలోచనలు, అభిరుచుల్లో తేడా ఉండవచ్చు. ఒకరికి సినిమాలు, మ్యూజిక్ ఇష్టం కావచ్చు, మరొకరికి కాదు. లైఫ్ స్టైల్ లో కూడా తేడా ఉండవచ్చు. దీని వల్ల ఎక్కువ కాలం కలిసి ఉండకపోవచ్చు.
2. సమాజం, కుటుంబం నుంచి విమర్శలు
ఏజ్ గ్యాప్ ఎక్కువగా ఉన్నవారు రిలేషన్ లో అడుగుపెడితే.. సమాజం, కుటుంబం తొందరగా ఒప్పుకోదు. దీని వల్ల వారికి సమస్యలు రావచ్చు.
3. జీవితంలో వేర్వేరు లక్ష్యాలు
ఒక పార్ట్నర్ కెరీర్ లో ఎదగాలని అనుకుంటే, మరొకరు రిటైర్మెంట్ గురించి ప్లాన్ చేసుకోవచ్చు. దీనివల్ల ప్లాన్స్ కలవకపోవచ్చు. ఎక్కువ కాలం కలిసి ఉండకపోవచ్చు.
4. ఆరోగ్యపరమైన సవాళ్లు
పెద్ద వయసు ఉన్న పార్ట్నర్ కు ఆరోగ్య సమస్యలు త్వరగా రావచ్చు. దీనివల్ల రిలేషన్షిప్ లో అదనపు బాధ్యతలు వస్తాయి.