పాపులర్ సెక్స్ పొజీషన్స్.. ఇవి తొందరగా బరువును తగ్గిస్తాయి తెలుసా?
సెక్స్ కూడా ఒక వ్యాయామమే. ఎందుకంటే సెక్స్ లో పాల్గొనడం వల్ల ఎన్నో కేలరీలు కరిగిపోతాయి. ముఖ్యంగా సెక్స్ తో బరువు తగ్గాలనుకునేవారికి కొన్ని సెక్స్ పొజీషన్స్ బాగా ఉపయోగపడతాయని నిపుణులు చెబుతున్నారు.
వ్యాయామం మనల్ని ఎన్నో రోగాల నుంచి దూరం చేస్తుంది. మీకు తెలుసా.. సెక్స్ కూడా ఒక మంచి వ్యాయామమే. ఎందుకంటే ఇది మీ శరీరాన్ని మొత్తం కదిలిస్తుంది. మీరు జిమ్ లో బర్న్ చేసే దానికంటే ఇంకా ఎక్కువ కేలరీలను కరిగించడానికి సెక్స్ మీకు ఎంతగానో సహాయపడుతుంది.
ఆనందాన్ని కలిగించే సెక్స్ మీ శరీరంలోని ప్రధాన కండరాలకు పని ఎక్కువగా చెబుతుంది. ఇది మీ శరీరాన్ని సడలిస్తుంది. వేర్వేరు సెక్స్ భంగిమలు మీ ఆనందాన్ని రెట్టింపు చేస్తాయి. అయితే మీరు ఏ రకమైన సెక్స్ పొజీషన్ లో పాల్గొంటున్నారనే దానిపై ఎన్ని కేలరీలు బర్న్ అవుతున్నాయో ఆధారపడి ఉంటుంది. అయితే కేలరీలను కరిగించడానికి కొన్ని సెక్స్ భంగిమలు బాగా ఉపయోగపడతాయి. అవేంటంటే..
మిషనరీ సెక్స్ పొజిషన్
ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. మిషనరీ సెక్స్ పొజిషన్ పురుషులు పైన ఉంటే 150 కేలరీలను చేయడానికి సహాయపడుతుంది. అయితే స్త్రీలు పైన ఉంటే ఫలితాలు వేరేలా వస్తాయి.
స్పూనింగ్
స్పూనింగ్ భంగిమ తక్కువ తీవ్రత కలిగిన లైంగిక చర్య. దీనిలో కూడా 100 కేలరీల కంటే ఎక్కువ కేలరీలను బర్న్ చేస్తారు. స్పూనింగ్ లో భాగస్వాములు తమ పక్కన పడుకుని ఒకరినొకరు కౌగిలించుకుంటారు. అయితే కొంతమంది జంటలు హిప్ చర్యను కలిగుంటారు. ఇది కేలరీలను బర్న్ చేయడానికి బాగా సహాయపడుతుంది.
డాగ్ స్టైల్
డాగీ స్టైల్ పొజీషన్ బాగా ప్రసిద్ది చెందిన సెక్స్ పొజీషన్. ఈ పొజీషన్ ను చాలామంది ఇష్టపడతారు. అయితే ఈ లైంగిక చర్య సమయంలో మహిళలు సెక్స్ తీవ్రతను బట్టి 100 నుంచి 130 కేలరీలను బర్న్ చేసే అవకాశం ఉంది.
లెగ్ అప్ స్టైల్
కాళ్లు పైకి పెట్టే ఈ భంగిమలో స్త్రీ కింది అవయవాల ప్రధాన కండరాలు చాలా తీవ్రతతో పనిచేస్తాయి. Quadriceps, hamstrings,calves కలిసి పనిచేస్తాయి. ఈ భంగిమలో సుమారు 120 కేలరీలు బర్న్ అవుతాయి.
లోటస్ సెక్స్ భంగిమ
లోటస్ సెక్సో భంగిమలో దంపతులు కూర్చొని ఒక భాగస్వామి మరొకరి కాళ్లను చుట్టూ చుట్టి క్రాస్ లెగ్స్ భంగిమలో ఉంటారు. ఈ భంగిమలో సుమారుగా 80 కేలరీలు బర్న్ అవుతాయి.
ఇతర పాపులర్ సెక్స్ భంగిమలు
ఇవి మాత్రమే కాదు.. ఇంకిన్ని పాపులర్ సెక్స్ భంగిమలు కూడా ఉన్నాయి. ఏదేమైనా మీ భాగస్వామి సమ్మతితోనే ఈ సెక్స్ భంగిమలను ట్రై చేయండి.
స్టాండింగ్ సెక్స్, kneeling wheelbarrow sex,స్క్వాట్ పొజిషన్, 69 సెక్స్ భంగిమ, కౌ గర్ల్ .. రివర్స్ కౌ గర్ల్ వంటి కొన్ని సాధారణ భంగిమలు కూడా ఎక్కువ మొత్తంలో కేలరీలను బర్న్ చేస్తాయి.
మీరు తెలుసుకోవాల్సిన కొన్ని విషయాలు
సెక్స్ ఒక ఆనందకరమైన, ఆహ్లాదకరమైన చర్య. ఇది మీ మొత్తం శరీరాన్ని శారీరక శ్రమలో పాల్గొనేలా చేస్తుుంది. అయితే కేలరీలను బర్న్ చేయాలనే ఒకే ఉద్దేశంతోనే సెక్స్ లో పాల్గొనకూడదు. భాగస్వామి సమ్మతితోనే ఎలాంటి లైంగిక చర్యలోనైనా పాల్గొనండి. అయితే పైన చెప్పిన సెక్స్ పొజీషన్ లో 30 నిమిషాలు మాత్రమే పాల్గొనాలని నిపుణులు చెబుతున్నారు.