పీరియడ్ సెక్స్ అంటే ఇష్టమా? అయితే మీరు ఈ ముచ్చట తెలుసుకోవాల్సిందే..!
కొంతమంది ఆడవారికి పీరియడ్ సమయంలో కూడా సెక్స్ లో పాల్గొనాలనుకుంటారు. నిజానికి పీరియడ్ లో సెక్స్ ను ఆడవారు మరింత ఆస్వాదిస్తారని నిపుణులు చెబుతున్నారు. అయితే..
మిగతా రోజుల్లోనే కాకుండా పీరియడ్ సమయంలో కూడా కొంతమంది ఆడవారు సెక్స్ లో పాల్గొనాలనుకుంటారు. ఈ సమయంలో కూడా సెక్స్ పై కోరికలు కలుగుతాయి. అయితే పీరియడ్ నొప్పి, రక్తస్రావం కారణంగా ఇది సురక్షితం కాదని చాలా మంది అనుకుంటారు. నిజానికి ఈ టైంలో కూడా సెక్స్ లో పాల్గొనొచ్చని నిపుణులు చెబుతున్నారు. అయితే ఈ పీరియడ్స్ సెక్స్ లో ప్రయోజనాలే కాదు.. కొన్ని సమస్యలను కూడా ఫేస్ చేయాల్సి వస్తుంది. అవేంటంటే..
భావప్రాప్తి పీరియడ్ తిమ్మిరిని తగ్గిస్తుంది
చాలా మందికి పీరియడ్స్ వల్ల తిమ్మిరి సమస్యను ఎదుర్కొంటారు. అయితే ఈ సమయంలో సెక్స్ లో పాల్గొంటే భావప్రాప్తి కలిగి తిమ్మిరి ఇట్టే తగ్గిపోతుందని నిపుణులు చెబుతున్నారు. క్లైటోరల్ ఉద్దీపన ఒత్తిడిని తగ్గించడానికి, తిమ్మిరి నుంచి ఉపశమనం కలిగించడానికి సహాయపడుతుంది.
ఇది అపవిత్ర రక్తం కాదు
చాలా మంది పీరియడ్స్ ఉన్నప్పుడు ఒక రూం లోనే ఉంటారు. కారణం ఈ నెలసరి రక్తస్రావాన్ని అపవిత్రంగా భావిస్తారు. కానీ ఇది అపవిత్రం కానే కాదని నిపుణులు అంటున్నారు. రుతుస్రావ రక్తం అనారోగ్యకరమైనది లేదా అపవిత్రమైంది కాదు. ఇది శరీరానికి అవసరం లేని కణజాలాల నుంచి విడుదలయ్యే తాజా రక్తం.
లైంగిక ఉద్రేకం తారాస్థాయికి
ఇది కాస్త వింతగా అనిపించొచ్చు. నిజమేంటంటే.. పీరియడ్స్ సమయంలో ఆడవారి లైంగిక ఉద్రేకం తారాస్థాయికి చేరుకుంటుందట. కాబట్టి ఈ సమయంలో సెక్స్ చేయడం వల్ల ఇతర సమయాల కంటే మరింత ఎక్కువ లైంగిక ఆనందాన్ని పొందుతారు.
ఎస్టీఐల ముప్పు ఎక్కువే
పీరియడ్ సెక్స్ తో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. అలాగే దీనివల్ల అనారోగ్య సమస్యలొచ్చే ప్రమాదం కూడా ఉంది. పీరియడ్స్ సమయంలో సెక్స్ లో పాల్గొనడం వల్ల లైంగిక సంక్రమణ అంటువ్యాధులు లేదా ఎస్టీఐలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. అయిత ఎస్టీఐల వ్యాధికారకాలు రుతుస్రావ రక్తంలో వృద్ధి చెందే అవకాశం ఉంది. ఇది మీ ఆరోగ్యానికి ప్రమాదకరం. అందుకే పీరియడ్ సెక్స్ లో కండోమ్స్ ను ఖచ్చితంగా వాడండి.
పిల్లలకు వెంట్రుకలు ఎర్రగా వస్తాయి
పీరియడ్స్ సెక్స్ విషయంలో ఎన్నో అపోహలు ఉన్నాయి. వీటిని గుడ్డిగా నమ్మేవారు లేకపోలేదు. పీరియడ్ సమయంలో తల్లిదండ్రులు సెక్స్ లో పాల్గొంటే బిడ్డకు వెంట్రుకలు ఎర్రగా వస్తుందని కొందరు నమ్ముతారు. కానీ దీనిలో ఏ మాత్రం నిజం లేదని నిపుణులు చెబుతుున్నారు. పీరియడ్ సమయంలో సెక్స్ లో పాల్గొనే జంటలు ఎర్రని జుట్టున్న పిల్లలను కంటారని భావించడం వల్ల ఇలాంటి పుకారును నమ్మడం మొదలు పెట్టారు.