శృంగారం నచ్చడం లేదా? అయితే మీకు ఈ సమస్యలున్నట్టే..!
శృంగారంలో పాల్గొనడం వల్ల మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది. శారీరక ఆరోగ్యం బాగుంటుంది. అయితే చాలా మంది ఆడవారికి సెక్స్ పై ఇంట్రెస్ట్ పోతుంది. దీనికి కొన్ని అనారోగ్య సమస్యలే కారణమంటున్నారు నిపుణులు.
లిబిడో మెరుగ్గా ఉంటేనే శృంగారాన్ని ఆస్వాధిస్తారు. దీనిలో పాల్గొంటారు. కానీ ఏదో ఒక సమయంలో ఆడవారు, మగవారు లిబిడోను కోల్పోతారు. ఇది సర్వ సాధారణ సమస్య. అయితే దీనికి ఎన్నో కారణాలు ఉంటాయి. తక్కువ లిబిడోకు అనారోగ్య, జీవన శైలి సమస్య వంటి కారణాలు ఉంటాయి. ఎందుకు ఇలా అవుతుందో తెలుసుకోవడం చాలా ముఖ్యం. సెక్స్ ను ఆస్వాధించకపోవడానికి ఆరోగ్య కారణాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
Image: Getty
ఒత్తిడి
ఒత్తిడి మన ఆరోగ్యాన్ని ఎన్నో విధాలా ప్రభావితం చేస్తుంది. పని ఒత్తిడి, పిల్లల పెంపకం, ఇంటి బాధ్యతలు ఎక్కువ కావడం వల్ల చాలా మంది ఆడవారు విపరీతమైన ఒత్తిడికి గురవుతారు. ఈ ఒత్తిడి కూడా సెక్స్ కు మిమ్మల్ని దూరం చేస్తుంది. అందుకే ఒత్తిడి తగ్గేందుకు విశ్రాంతి తీసుకోండి. పని బాధ్యతలను తగ్గించుకోండి. ఇది మీ సెక్స్ డ్రైవ్ ను మెరుగుపర్చడానికి సహాయపడుతుంది.
సరిగ్గా నిద్రపోకపోవడం
కంటినిండా నిద్రపోవడం చాలా చాలా అవసరం. నిద్రతోనే శరీరం తిరిగి శక్తివంతంగా, ఎనర్జిటిగ్ గా మారుతుంది. అయితే ప్రస్తుతం చాలా మంది సరిగ్గా నిద్రపోవడం లేదు. దీనివల్ల ఆడవారిలో ఈస్ట్రోజెన్, ప్రొజెస్టెరాన్ వంటి సెక్స్ హార్మోన్లకు అంతరాయం కలుగుతుంది. నిద్రలేకపోవడం వల్ల సెక్స్ పట్ల చిరాగ్గా అనిపిస్తుంది. అందుకే నిద్రపోవడానికి ముందు విశ్రాంతి తీసుకోవడానికి కాస్త సమయాన్ని కేటాయించండి. అలాగే ప్రతిరోజూ 7 నుంచి 8 గంటలు ఖచ్చితంగా నిద్రపోండి. ఒకవేళ మీ భాగస్వామి గురక పెడితే దానిని తగ్గించే మార్గాలను వెతకండి.
అతి చురుకైన మూత్రాశయం
ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. అతి చురుకైన మూత్రాశయం ఉన్న మహిళల్లో మూడింట ఒక వంతు మందికి సంభోగం సమయంలో మూత్రం లీక్ అవుతుంది. ఇది ఇబ్బంది కలిగిస్తుంది. మూత్రం మీద పడితే ఏ భాగస్వామికైనా సెక్స్ లో పాల్గొనాలనే ఇంట్రెస్ట్ ఉండదు. అయితే సెక్స్ కు ముందు మూత్ర విసర్జన చేస్తే మూత్రం లీక్ అయ్యే అవకాశం ఉండదు. ఎందుకంటే మూత్రాశయం ఖాళీగా ఉంటే మూత్రవిసర్జన చేసే అవకాశం ఉండదు. అయితే ఈ అతిచురుకైన మూత్రాశయం సమస్య ఉంటే డాక్టర్ ను సంప్రదించి మందులను వాడొచ్చు.
హార్మోన్ ఆధారిత గర్భినిరోధకాలు
మాత్రలు, ఇంజెక్షన్లు వంటి హార్మోన్ ఆధారిత గర్భనిరోధకాలు టెస్టోస్టెరాన్ స్థాయిలను తగ్గిస్తాయి. ఇది మీ సెక్స్ డ్రైవ్ కు ప్రతికూలంగా ప్రభావితం చేస్తుంది. అందుకే ఇలాంటి హార్మోన్ ఆధారిత గర్భనిరోధకాలను వాడకండి. కొన్ని మాత్రలు లిబిడోను పెంచడానికి కూడా సహాయపడతాయి. గర్బాశయ క్యాప్, కండోమ్ లు వంటి ఇతర రకాల గర్భనిరోధకాలను వాడండి. ఇవి మీ సెక్స్ డ్రైవ్ ను ప్రభావితం చేయవు.
menopause
రుతువిరతి
రుతువిరతి మీ ఈస్ట్రోజెన్ 90% కోల్పోయేలా చేస్తుంది. ఉద్వేగం, లూబ్రికేషన్ కు ఎక్కువగా బాధ్యత వహించే సెక్స్ హార్మోన్ ఇది. అయితే ఈస్ట్రోజెన్ తగ్గడం వల్ల సెక్స్ ఇబ్బందికరంగా, బాధగా ఉంటుంది. ఈస్ట్రోజెన్ తగ్గడమంటే మీ లిబిడో తగ్గడమన్నట్టే. చురుకైన సెక్స్ డ్రైవ్ కలిగి ఉండటానికి, సెక్స్ లో చురుకుగా పాల్గొనండి. ఎందుకంటే ఇది మీ జననేంద్రియాలకు రక్త ప్రవాహాన్ని ప్రోత్సహిస్తుంది. శృంగారాన్ని మరింత సౌకర్యవంతంగా చేసే మందులను కూడా వాడొచ్చు.