Friendship: క్లోజ్ ఫ్రెండ్స్ లేకపోతే వారి జీవితం ఎలా ఉంటుందో తెలుసా?
కష్టమైనా, నష్టమైనా, సంతోషమైనా.. ఇంకేదైనా మొదటగా పంచుకునేది స్నేహితుడితోనే. చాలామంది వారి కుటుంబం కంటే కూడా ఎక్కువగా ఫ్రెండ్స్ తోనే చాాలా విషయాలు షేర్ చేసుకుంటారు. వారితోనే ఎక్కువ టైం గడుపుతారు. నిజమైన స్నేహితుడెప్పుడు మన మంచే కోరుకుంటాడు. మనం మంచి దారిలో నడవడానికి ప్రోత్సహిస్తాడు. కానీ క్లోజ్ ఫ్రెండ్ అనేవారు లేకపోతే వారి లైఫ్ ఎలా ఉంటుందో తెలుసా?

స్నేహితులు లేని జీవితాన్ని చాలామంది ఊహించుకోలేరు. ఎలాంటి రక్త సంబంధం లేకుండా మనపై శ్రద్ధ చూపేవారే స్నేహితులు. సంతోషంలోనే కాదు మన కష్ట, నష్టాల్లోనూ తోడు ఉండేవారే స్నేహితులు. అలాంటి స్నేహితులు అసలే లేరంటే వారి జీవితం ఎలా ఉంటుందో మీకు తెలుసా? ఇక్కడ చూద్దాం.

క్లోజ్ ఫ్రెండ్స్ తగ్గిపోతున్నారు!
మానసిక నిపుణుల ప్రకారం వ్యక్తుల జీవితాల్లో దగ్గరి స్నేహితులు తగ్గిపోతున్నారట. స్నేహానికి కరువు ఏర్పడుతోందట. అమెరికా లాంటి దేశాల్లో ప్రస్తుతం దగ్గరి సంబంధాలు తగ్గిపోతున్నాయని నిపుణులు చెబుతున్నారు. ముఖాముఖి సంబంధాలు పెట్టుకునే సామాజిక కార్యక్రమాలు కూడా తగ్గిపోతున్నాయని చెబుతున్నారు.

దగ్గరి స్నేహితులు లేకపోతే?
ప్రస్తుతం ఒకరిని ఒకరు పూర్తిగా నమ్మడమే మానేశారని నిపుణులు చెబుతున్నారు. ప్రజల్లో స్నేహ లేమి స్పష్టంగా కనిపిస్తోందంటున్నారు. ఇందుకు స్వార్థం, అపనమ్మకం, లేదా కొందరి చేతిలో మోసపోవడం కారణం కావచ్చని చెబుతున్నారు. అయితే ఒంటరిగా ఉండకుండా.. భావోద్వేగంగా జీవించడానికి స్నేహం అవసరమని వివరిస్తున్నారు.

పరిశోధనల ప్రకారం..
1990లో చేసిన పరిశోధన ప్రకారం.. 33% మందికి కనీసం 10 లేదా అంతకంటే ఎక్కువ మంది దగ్గరి స్నేహితులు ఉండేవారట. 2021లో ఆ సంఖ్య 13%కి పడిపోయిందట. ఇప్పుడు అది ఏ స్థాయిలో ఉంటుందో మనం ఈజీగా ఊహించుకోవచ్చు.

నిపుణుల ప్రకారం
నిపుణుల ప్రకారం స్నేహితులు లేకుండా జీవిస్తే వారికి మానసిక ఒత్తిడి, ఆందోళన వంటివి కలగవచ్చట. కొందరిని ఒంటరితనం వెంటాడుతుందట. అందుకే మంచి స్నేహం ఎప్పుడూ తోడుగా ఉండాలని.. అలాంటి స్నేహితులను దూరం చేసుకోవద్దని నిపుణులు చెబుతున్నారు.