Name Astrology: ఈ అక్షరంతో పేరున్న భర్త వస్తే.. అమ్మాయిలకు పండగే
సాంకేతికంగా ఎంత ఎదిగినా ఇప్పటికీ జ్యోతిష్యాన్ని విశ్వసించే వారు చాలా మంది ఉన్నారు. జ్యోతిష్యంలో ఒక భాగమైన 'నేమ్ ఆస్ట్రాలజీ'పై చాలా మంది ఆసక్తి చూపిస్తుంటారు. పేరులో మొదటి లెటర్ ఆధారంగా మన జీవితంలో జరిగే విషయాలను అంచనా వేస్తుంటారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ లెటర్‌తో పేరున్న భర్తలు లభిస్తే అమ్మాయిల జీవితం చాలా హ్యాపీగా ఉంటుందని చెబుతుంటారు..

నేమ్ ఆస్ట్రాలజీ ఆధారంగా ఒక వ్యక్తి బలాలు, బలహీనతలు అంచనా వేస్తుంటారు. జీవితంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు.? వారి భవిష్యత్తు ఎలా ఉంటుంది.? లాంటి విషయాలను పేరులోని మొదటి అక్షరం ఆధారంగా చెబుతుంటారు. నిజానికి మన పేరును నిర్ణయించే ముందు జ్యోతిష్యులు మనం పుట్టిన తేదీ, సమయం ఆధారంగానే లెక్కిస్తారు. ఆ సమయంలో గ్రహాలు ఎలా ఉన్నాయి.? ఏ రాశిలో జన్మించారు.? అన్న వివరాల ఆధారంగానే పేరును నిర్ణయిస్తారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ అక్షరాలతో ప్రారంభమయ్యే పేరున్న అబ్బాయిలు తమ జీవితంలోకి వస్తే అమ్మాయిలు జీవితం మారినట్లే. ఇంతకీ ఆ అక్షరాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
'V' అక్షరంతో మొదలైతే:
ఈ అక్షరంతో పేరున్న పురుషులు తమ భాగస్వామి కోరికను అస్సలు కాదనలేరు. వీరు చాలా రొమాంటిక్‌గా ఉంటారు. భార్య జీవితంలో ముఖ్యమైన అంశాలను గుర్తించుకుంటారు. ఎప్పటికప్పుడు సర్‌ప్రైజ్ ఇవ్వాలని కోరుకుంటారు.
'K' అక్షరంతో మొదలైతే:
కే అక్షరంతో మొదలయ్యే భర్తలు తమ భాగస్వామికి సపోర్ట్‌గా ఉంటారు. భార్యతో అన్ని విషయాల్లో నిజాయితీగా ఉంటారు. ఎలాంటి దాపరికాలు లేకుండా జీవితం సాగిస్తుంటారు.
'A' అక్షరంతో మొదలైతే:
'A' అక్షరంతో మొదలయ్యే అబ్బాయిలు తమ భార్యను కళ్లల్లో పెట్టుకుని చూసుకుంటారు. భార్యను అధికంగా ప్రేమిస్తారు. ప్రతీ విషయంలో అర్థం చేసుకుంటారు.
marriage calls off
'P' అక్షరంతో మొదలైతే:
ఈ అక్షరంతో మొదలయ్యే పురుషులు తమ భార్యలతో విధేయులుగా ఉంటారు. వీరికి సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఎక్కువగా ఉంటుంది. భార్యను సంతోషంగా ఉండేందుకు ప్రయత్నిస్తారు.
'R' అక్షరంతో:
R అక్షరంతో మొదలయ్యే వారు తమ భార్యను అమితంగా ప్రేమిస్తారు. అయితే ఈ విషయాన్ని బహిరంగా ప్రదర్శించారు. కేవలం ఇద్దరు ఏకాంతంగా ఉన్న సమయంలోనే తమ కేరింగ్‌ను చూపిస్తారు.
'S' అక్షరంతో మొదలైతే:
'S' అక్షరంతో మొదలయ్యే అబ్బాయిలు జీవితంలోకి వచ్చే మహిళలకు పండగే అని చెప్పాలి. వీరు తమ జీవిత భాగస్వామితో నిజాయితీగా ఉంటారు. భార్య సంతోషం కోసం ఏది చేయడానికి అయినా వెనుకాడరు.
నోట్: పైన తెలిపిన విషయాలు కేవలం పలు శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని రీడర్స్ గమనించాలి.