Relationship: భర్త మీకు అనుకూలంగా మారాలా? భార్య చేయాల్సింది ఇదే
చాలా మంది పురుషులు పెళ్లి తర్వాత భార్యను, భార్య కుటుంబాన్ని గౌరవించరు. వారి పట్ల చులకన భావనతో ఉంటారు. తమ తల్లిదండ్రులను భర్త ఇలా అగౌరపరచడం ఏ అమ్మాయికి అయినా బాధగానే ఉంటుంది. అలా కాకుండా.. మీ భర్త, మీకు నచ్చినట్లుగా మారాలి అనేది మీ చేతుల్లోనే ఉంటుంది.

Relationship: పెళ్లి అనేది ఇద్దరు వ్యక్తుల మధ్య బంధం మాత్రమే కాదు, ఇది రెండు కుటుంబాలను కలుపుతుంది. ఒక అమ్మాయి పెళ్లి చేసుకుని అత్తారింటికి వెళ్ళినప్పుడు, ఆమెకు భర్తతో పాటు చాలా ఇతర బంధాలు కూడా వస్తాయి. ఆమె కోడలు, మరదలు, అత్త, పిన్ని అవుతుంది. ఆమె ప్రతి బంధాన్ని ప్రేమగా చూసుకోవాలని ఆశిస్తారు. ఒక వ్యక్తి తన భార్య నుండి ఎలా ఇవన్నీ ఆశిస్తాడో.. భార్య కూడా తన భర్త నుండి కొన్ని ఆశిస్తుంది. ఆమె తనను, తన కుటుంబాన్ని అతను గౌరవించాలని కోరుకుంటుంది. ఆమె తన అత్తమామలతో ఎలా ఉంటుందో, అదే విధంగా తన తల్లిదండ్రులను కూడా గౌరవించాలని కోరుకుంటుంది. అయితే, చాలా మంది జంటల మధ్య ఇది జరగదు. చాలా మంది భర్తలు తమ భార్య పుట్టింటికి ఆ గౌరవం ఇవ్వరు. మీ భర్త కూడా మీ తల్లిదండ్రులను పట్టించుకోకపోతే, కొన్ని సులభమైన చిట్కాలు పాటించి మీ భర్తకు మీకు తగినట్లు మార్చుకోవచ్చు. మరి, ఆ చిట్కాలేంటో తెలుసుకుందామా..
గెట్-టుగెదర్ ఏర్పాటు చేయండి
ఎవరినైనా తెలుసుకోవడానికి, అర్థం చేసుకోవడానికి సమయం పడుతుంది. కాబట్టి మీ కుటుంబానికి, మీ భర్తకు మధ్య బాండింగ్ సరిగా లేదని మీరు భావిస్తే, మీరు ఎప్పటికప్పుడు చిన్న గెట్-టుగెదర్ ప్లాన్ చేయాలి. ఇలా చేయడం వల్ల అందరికీ కలిసి సమయం గడిపే అవకాశం వచ్చినప్పుడు, వారి ఆలోచనలలో చాలా మార్పు వస్తుంది. ఇది సంబంధాలలో మాధుర్యాన్ని, బలాన్ని ఇస్తుంది.
రోజూ పుట్టింటికి వెళ్లకండి
కొన్నిసార్లు భర్త తన భార్య పుట్టింటి వాళ్ళని గౌరవించడు, ఎందుకంటే భార్య ప్రతి రెండు రోజులకు ఒకసారి పుట్టింటికి వెళ్తుంది. మీ పుట్టిల్లు దగ్గరగా ఉన్నా, దూరంగా ఉన్నా, మీరు ప్రతిరోజూ అక్కడికి వెళ్లడం మానుకోవాలి. అలా చేయడం వల్ల భార్య తన గురించి లేదా తన కుటుంబం గురించి పట్టించుకోవడం లేదని భర్త అనుకుంటాడు. ఆమె తన పుట్టింటి గురించి మాత్రమే ఆలోచిస్తుందని భావిస్తాడు. ఇది భర్తకు తన అత్తమామల పట్ల గౌరవం తగ్గించడమే కాకుండా, భార్యాభర్తల సంబంధంలో కూడా ఒత్తిడిని కలిగిస్తుంది.
ఎప్పుడూ పోల్చకండి
కొంతమంది అమ్మాయిలు పెళ్లి తర్వాత కొత్త ఇంటికి వెళ్ళినప్పుడు, అక్కడి వాతావరణం వారికి నచ్చదు. అలాంటి పరిస్థితుల్లో చిన్న చిన్న విషయాలకే తమ కొత్త కుటుంబాన్ని తమ తల్లిదండ్రుల ఇంటితో పోల్చడం మొదలు పెడతారు. మీ భర్త ముందు మీరు పదే పదే అలా చేసినప్పుడు, అతనికి చాలా బాధగా ఉంటుంది. నెమ్మదిగా తన భార్య తల్లిదండ్రుల పట్ల, ఆమె కుటుంబం పట్ల కొంత చిరాకు కలుగుతుంది. దాంతో అతను వారితో దూరంగా ఉండటానికి ఇష్టపడతాడు. అంతేకాదు, ఏ సందర్భంలోనైనా వెళ్లకుండా ఉండేందుకు రకరకాల సాకులు కూడా చెబుతాడు.
ఆయన కుటుంబాన్ని పూర్తిగా గౌరవించండి
మనం ఏది ఇస్తామో, మనకు అదే తిరిగి లభిస్తుంది. మీరు మీ భర్త కుటుంబాన్ని గౌరవాన్ని ఇస్తే, మీకు కూడా అదే గౌరవం లభిస్తుంది.మీ భర్త మీ పేరెంట్స్ ని గౌరవించాలి అంటే, మీరు అతని తల్లిదండ్రులను గౌరవించడం నేర్చుకోవాలి. మీరు అలా చేయడం చూసినప్పుడు, నా భార్య నా కుటుంబాన్ని ఎంత బాగా చూసుకుంటుందో, నేను కూడా ఆమె కుటుంబాన్ని గౌరవించాలని అతను భావిస్తాడు. దీనివల్ల రెండు కుటుంబాల మధ్య సంబంధాలు చాలా బాగుంటాయి.