Relationship: వివాహ బంధం సంతోషంగా ఉండాలంటే.. ఫెంగ్ షుయ్ టెక్నిక్స్ బెస్ట్ ఆప్షన్!
Relationship: వివాహ బంధం సంతోషంగా ఉండటం కోసం ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అయితే ఫెంగ్ షుయ్ శాస్త్రం ఇల్లు ఎంత బాగుంటే నీ వివాహ జీవితం కూడా అంత బాగుంటుంది అని నమ్ముతుంది. అందుకోసం కొన్ని చిట్కాలను కూడా చెప్తుంది అవి ఏమిటో చూద్దాం.
ఇద్దరు వ్యక్తులు వివాహం చేసుకున్నప్పుడు ఒకరికి ఒకరు సానుకూల శక్తిని కలిగి ఉండడం అనేది చాలా అవసరం. ఎందుకంటే ప్రతికూలత కచ్చితంగా మరొకరిని ప్రభావితం చేస్తుంది. ఫెంగ్ షుయ్ నిబంధన ల ప్రకారం ఇల్లు మంచి సంబంధాన్ని మరియు వివాహ స్థితిని ప్రతిబింబిస్తుంది.
ఇల్లు ఎంత బాగుంటే వివాహ జీవితం అంత సంతోషంగా ఉంటుంది. అందుకే ఇల్లు బాగోవటం కోసం కొన్ని చిట్కాలను సూచించింది అవేంటంటే పడక గదిలో మంచం సరి అయిన దిశలో ఉండాలి. మంచాన్ని మూలకు దగ్గరగా ఉంచవద్దు. అన్ని దిశల నుండి సులభంగా అందుబాటులో ఉండే ఒక పడక గదిలో సానుకూల శక్తి ఉంటుంది.
అలాగే మంచం యొక్క పాదాలు తలుపుకు ఎదురుగా ఉంచకుండా చూసుకోండి. అంటే మీరు మీ పాదాలను తలుపు వైపు చూపిస్తూ నిద్రించకూడదు. అలాగే భార్యాభర్తలు ఇద్దరు అనురాగంగా ఉండటం కోసం పడకగదిలో ఫౌంటెన్ లేదా అక్వేరియం వంటివి పెట్టవద్దు.
బెడ్ రూమ్ లో నీరు పెట్టడం ఫెంగ్ షుయ్ ప్రకారం అంత మంచిది కాదు. అలాగే కింగ్ సైడ్ బెడ్, బెడ్ రూమ్ లో మంచిది కాదు. ఇది భార్యాభర్తలని వేరుగా ఉంచగలదు. అలాగే రాత్రి మీరు పడుకునేటప్పుడు ఖచ్చితంగా బెడ్ రూమ్ తలుపులు వేసుకోవడం చాలా అవసరం.
లేదంటే బాహ్య ప్రభావానికి గురికావాల్సి ఉంటుంది. బెడ్రూంలో టెలివిజన్ లేదా రేడియో ఉంచవద్దు. కొన్ని ఫెంగ్సి షుయ్ సిద్ధాంతాలు మీ బెడ్ రూమ్ లో టెలివిజన్ కలిగి ఉండటం మంచిది కాదని చెప్తుంది.
పడకగది నైరుతి మూలలో పువ్వులు ఉంచండి. మొక్కలు కొనుగోలు చేసేటప్పుడు పెద్ద ఆకులు ఉన్న మొక్కను కొనండి. అలా అని కలబంద లేదా వేరే ఇతర ముళ్ళ మొక్కలను బెడ్రూంలో ఉంచకండి.