Relationship Tips: చిన్న విషయానికే మీ భర్తతో గొడవా..? మీరు చేయాల్సింది ఇదే..!
Relationship Tips: గొడవలు పడని భార్యభర్తలు ఎవరైనా ఉంటారా? ప్రతి ఇంట్లో జరిగేదే ఇది. కానీ.. ఆ గొడవలను పెంచుకుంటూ పోతే ఇద్దరి మధ్య మనస్పర్థలు పెరిగే అవకాశం ఉంది. అందుకే, వీలైనంత వరకు వాటిని తగ్గించుకునే ప్రయత్నం చేయాలి.

Relationship Tips
ఒకరితో మరొకరు కలిసి జీవించడానికే పెళ్లి అనే బంధంలోకి అడుగుపెడతాం. విడిపోవాలని, గొడవలు పడాలి అనే కోరికతో ఎవరూ పెళ్లి చేసుకోరు. కానీ వివాహం తర్వాత... చాలా మంది దంపతుల మధ్య ప్రతిరోజూ గొడవలు జరుగుతూనే ఉంటాయి. కొందరు అయితే.. గొడవల కారణంగా ఏకంగా విడాకుల బాట పడుతుంటారు. కొందరు విడిపోరు.. కానీ, రోజూ గొడవలు పడుతూ.. ఇష్టం లేని జీవితాన్ని జీవిస్తూ ఉంటారు. మీరు కూడా ప్రతిరోజూ... చిన్న చిన్న విషయాలకే మీ భార్య/భర్త తో గొడవ పడుతున్నారా? అసలు.. దేని కోసం గొడవ పడుతున్నామో కూడా తెలీదు. కానీ.... గంటల తరపడి వాదించుకుంటున్నారా? అయితే... అలాంటి సమస్యలు రాకుండా ఉండాలంటే, సంతోషంగా ఉండాలి అనుకుంటే.. కొన్ని సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.
గొడవలను ఎలా పరిష్కరించాలి..?
మీకు మీ భార్య/ భర్తతో గొడవ జరిగితే వెంటనే కోపం తెచ్చుకోకండి. కొంత మంది మహిళలు తమ కోపం కారణంగా వారి సంబంధాలను నాశనం చేసుకుంటూ ఉంటారు. అలాంటి సమయంలో.. మీరు మీ భాగస్వామిపై కోపం తెచ్చుకోకుండా.... సహనంగా చర్చించడానికి ప్రయత్నించాలి. విడిపోవాలి అనుకుంటే... ఎలాంటి చర్చలు అవసరం లేదు. కానీ.... మీరు మీ సంబంధాన్ని కాపాడుకోవాలి అనుకుంటే... మీ భాగస్వామి మాట వినడం నేర్చుకోవాలి. వారు చెప్పేది పూర్తి విన్న తర్వాతే.. మీ అభిప్రాయాలను చెప్పాలి.
చెప్పేది వినాలి...
ఎవరి సొంత అభిప్రాయాలకు విలువ ఇవ్వడం అనేది చాలా మంచి విషయమే. కానీ, ఇతరులు చెప్పేది వినడం నేర్చుకోవడం కూడా అలవాటు చేసుకోవాలి. అప్పుడే... మీ జీవితం సవ్యంగా సాగుతుంది. మీ జీవిత భాగస్వామితో ఏదైనా గొడవ జరిగినప్పుడు అందులో నిజంగా మీ తప్పు ఉంటే... వెంటనే క్షమాపణ అడగాలి. దీని వల్ల గొడవ సద్దుమణిగి... మళ్లీ సంతోషంగా జీవిస్తారు. అంతేకాదు.. చిన్న క్షమాపణ మీ బంధాన్ని మరింత బలోపేతం చేస్తుంది.
చిన్న క్షమాపణ....
లేదు.. ఆ తప్పు మీ భాగస్వామిది అయితే...వారు క్షమాపణలు చెప్పకపోయినా... వారిని క్షమించేయండి. పదే పదే తప్పు చేశారు అని మాటలతో గుచ్చకూడదు. నిజంగా వారితో కలిసి ఉండాలి అనుకుంటే.. వారిని మనస్ఫూర్తిగా క్షమిస్తే సరిపోతుంది. చాలా మంది పదే పదే పార్ట్నర్ చేసిన తప్పులను ఎత్తి చూపుతూ ఉంటారు. అలా చేయకూడదు. ఇలా చేయడం వల్ల ఇద్దరూ విడిపోవడానికి కారణం అవుతుంది. గడిచిపోయిన తప్పులను ఎప్పుడూ గుర్తు చేసుకోకూడదు. ఏదైనా సమస్య వస్తే.. ఒకరిని మరొకరు విమర్శించుకోవడానికి బదులు... ఆ సమస్యను ఎలా పరిష్కరించాలో ఆలోచించాలి.
ఒకరితో మరొకరు సమయం గడపడం....
మీ భాగస్వామితో వీలైనంత ఎక్కువ సమయం గడపడం వల్ల భావోద్వేగ సంబంధం పెరుగడమే కాకుండా మీ సంబంధాన్ని బలోపేతం చేస్తుంది. గొడవలు కూడా సద్దుమణుగుతాయి. దాంపత్య జీవితం అంటే నేను కాదు.. మనం అని తెలుసుకోవాలి. అప్పుడే... మీ జీవితం ఆనందం గా సాగుతుంది. భార్యభర్తల మధ్య అహం అనేది రాకూడదు. అది వస్తే.... ఎప్పటికీ సంతోషంగా జీవించలేరు. విభేదాలు పెరుగుతూనే ఉంటాయి.