Relationship: మీ పార్టనర్ కి ఈ విషయాలు కూడా చెబుతున్నారా.. అయితే సమస్యలు తప్పవు?
Relashionship: మీ జీవితం భాగస్వామ్ని నమ్మి అన్ని విషయాలు చెప్తున్నారా.. కానీ అలా చేయకండి గోప్యత అవసరం అని గుర్తించండి. ఏ విషయాల్లో గోప్యత పాటించాలో చూద్దాం రండి.
నిజానికి ఒక బంధం నిలబడాలి అంటే నిజాయితీ చాలా అవసరం. కానీ అన్ని విషయాల్లోనే నిజాయితీగా ఉండడం ఒక్కొక్కసారి బంధాన్ని ముక్కలు చేస్తాయి అంటుంది టైమ్స్ ఆఫ్ ఇండియా. నిజమేనండి అది ఎలాగో చూద్దాం రండి.
మీ గత జీవితం గురించి అందులో ఉన్న చీకటి కోణం గురించి మీ భాగస్వామికి తెలుపటం అంత తెలివైన పని కాదు. అలా తెలుసుకున్న మీ పార్ట్నర్ మీకు ఇంతకుముందు ఇచ్చినంత విలువ ఇవ్వకపోవచ్చు అలాగే నమ్మకం కూడా కోల్పోవచ్చు.
కాబట్టి బంధాన్ని నిలబెట్టడం కోసం కొన్ని విషయాలు గుట్టుగా ఉంచడమే మంచిది. అలాగే ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ తోనో, లేకపోతే ఎదుటి వ్యక్తిని మోసం చేస్తున్నాను అని భావనతోనో కానీ అతనికి చెప్పకూడని విషయాలను, పుట్టింటి గుట్టును మీ భాగస్వామి చేతిలో పెట్టకండి.
ఎందుకంటే కొన్ని రోజుల తర్వాత అదే మీ భాగస్వామికి ఆయుధం కావచ్చు. ఇలా జరిగిన సంఘటనలను కొన్ని టైమ్స్ ఆఫ్ ఇండియా పేర్లు మార్చి మరి తమ వ్యాసాల్లో రాసింది. అలాగే ఆర్థిక లావాదేవీల విషయంలో కూడా జాగ్రత్త వహించండి నీ పుట్టింటి ఆస్తి వివరాలు కానీ మీ సంపాదన, బ్యాంక్ అకౌంట్ల విషయంలో కానీ పూర్తిగా బహిర్గతం చేయకండి.
మీ దగ్గర ఆస్తి ఏమీ లేదని గాని, అతిగా ఉందని గాని అవతలి వ్యక్తికి తెలిస్తే అతని ఆలోచన విధానంలో మార్పు రావచ్చు అది మీ బంధాన్ని ముక్కలు చేయవచ్చు. అలా అని ప్రతి విషయాన్ని దాయటం వల్ల కూడా బంధానికి బీటలు వారుతుంది కాబట్టి జాగ్రత్తగా ఆలోచించి అడుగులు వేయండి.
ఏ విషయం చెప్తే బంధం బలపడుతుందో ఏ విషయం చెప్తే అవతలి వ్యక్తి మనల్ని ఎక్కువగా నమ్ముతాడో అలాంటి విషయాలు చెప్పటంలో తప్పులేదు కానీ అది నమ్మకంతో అన్ని విషయాలు చెప్తే మొదటికే మోసం వస్తుంది.