అన్యోన్యమైన దాంపత్యజీవితం కోసం దంపతులిద్దరూ ఈ నియమాలను పాటించాల్సిందే?
ఎన్నో ఆశలతో దంపతులిద్దరూ కొత్త జీవితాన్ని ఆరంభిస్తారు. కానీ దాంపత్య జీవితం (Marital life) పెళ్లయిన కొత్తలో సంతోషంగా ఉన్నా రానురానూ వారి మధ్య ఏర్పడ్డ చిన్న గొడవలు అపార్ధాలకు దారితీసి దూరాన్ని పెంచుతాయి.
ఈ సమస్యలన్నింటినీ అధిగమించి అన్యోన్యమైన (Reciprocal) దాంపత్యజీవితాన్ని గడపాలంటే దంపతులిద్దరూ తమ వంతు ప్రయత్నం చేయాలి. అప్పుడే వారి మధ్య ఏర్పడే సమస్యలు తొలగిపోయి దాంపత్య జీవితం సంతోషంగా ఉంటుంది. మరి ఇంకెందుకు దంపతులిద్దరూ అనుసరించవలసిన నియమాలు ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
దంపతులిద్దరూ వారి ఇష్టాయిష్టాలను (Preferences) ఒకరికొకరు తెలుసుకోవాలి. భాగస్వామి ఇష్టానుసారంగా నడుచుకుంటూ ఒకరి అభిప్రాయాలను (Views) మరొకరు గౌరవించాలి. అలాగే మీ మనసులోని ప్రేమను ఎప్పటికప్పుడు తెలియపరచుకుంటూ దాంపత్య జీవితాన్ని అందంగా మలుచుకోవాలి.
దాంపత్య జీవితంలో భార్యాభర్తలిద్దరూ సమానమే. కనుక అహంకారంతో (Pride) ఒకరికొకరు చులకనగా చూసుకోకుండా భాగస్వామి గౌరవమే తన గౌరవంగా (Respectfully) భావించి మీ జీవిత భాగస్వామిని గౌరవించాలి. దంపతులిద్దరూ కష్టసుఖాలను సంతోషంగా పంచుకోవాలి.
భాగస్వామి చేసే ఏ చిన్న పనినైన చులకనగా చూడకుండా వారు మంచి స్థాయికి వెళ్లేందుకు ప్రోత్సహించాలి. భాగస్వామి ఆరోగ్య పరిస్థితులను తెలుసుకుంటూ వారి ఆరోగ్యం (Health) పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపించాలి. దంపతులిద్దరి మధ్య అన్ని విషయాలను పంచుకునే మంచి స్నేహబంధం (Friendship) ఉండాలి.
దాంపత్య జీవితంలో సమస్యలు (Problems) ఏర్పడినప్పుడు వాటిని వెంటనే పరిష్కరించుకోవాలి. లేదంటే ఈ సమస్యలు మీ మధ్య దూరాన్ని పెంచుతాయి. అలాగే మీ మధ్య మూడో వ్యక్తి వచ్చే అవకాశం ఉంటుంది. కనుక అహాన్ని, కోపాన్ని (Anger) తగ్గించుకుని సమస్యలను సామరస్యంగా పరిష్కరించుకుంటే మీ బంధం బలపడుతుంది.
ఉద్యోగ పని ఒత్తిడితో అలసిపోయి (Tired) ఇంటికి వచ్చిన భర్తని విసిగించకుండా భార్య ఇంటిలో ప్రశాంత వాతావరణాన్ని కల్పించాలి. అలాగే భర్త కూడా బయటి సమస్యలను, పని ఒత్తిడిని భాగస్వామిపై చూపించి ఆమెను ఇబ్బంది (Trouble) పెట్టకూడదు. అలాగే దంపతులిద్దరూ సరదాగా గడపడానికి రోజులో కొద్ది సమయాన్ని తమకంటూ కేటాయించుకోవాలి.
ముఖ్యంగా దాంపత్య జీవితంలో వారి బంధాన్ని (Bonding) మరింత బలోపేతం చేసే ఆయుధం శృంగారం (Romance). భార్యాభర్తల మధ్య ఎన్ని సమస్యలు ఉన్న ప్రతిరోజూ ఒకే మంచం మీద నిద్రించాలి. ఇది మీ మధ్య ఉన్న సమస్యలను పరిష్కరించే చక్కటి పరిష్కారం. కనుక మీకు ఎన్ని సమస్యలు ఉన్న శృంగార జీవితాన్ని సంతృప్తిగా ఆస్వాదించండి.
అలాగే దాంపత్య జీవితంలో ఒకరిపై ఒకరికి నమ్మకం (Believe) ఉండాలి. నమ్మకంతో, బాధ్యతతో (Responsibility), ప్రేమతో కూడిన దాంపత్య బంధం కలకాలం సంతోషంగా ఉంటుంది. అంతేకాకుండా ఎప్పటికప్పుడు భార్య భర్తలు ఒకరిపై ఒకరికి ఉన్న ప్రేమని వ్యక్తపరచుకోవాలి. దంపతులిద్దరూ ఈ నియమాలను పాటిస్తే దాంపత్య జీవితం ఎంతో అన్యోన్యంగా, అందంగా, మీరు కోరుకున్న విధంగా ఉంటుంది.