MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Pregnancy & Parenting
  • ప్రెగ్నెన్సీ టైంలో టీ, కాఫీలు తాగితే ఏమౌతుందో తెలుసా?

ప్రెగ్నెన్సీ టైంలో టీ, కాఫీలు తాగితే ఏమౌతుందో తెలుసా?

ప్రెగ్నెన్సీ టైంలో టీ, కాఫీలను తాగే అలవాటు చాలా మందికి ఉంటుంది. అసలు ఈ సమయంలో టీ, కాఫీలు తాగొచ్చా? తాగితే ఏమౌతుంది? అసలు గర్భిణులు రోజుకు ఎంత కెఫిన్ తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 

2 Min read
Author : Shivaleela Rajamoni
Published : Jan 28 2024, 11:58 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

ప్రెగ్నెన్సీ సమయంలో ఆడవాళ్లు ఫుడ్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. శారీరక శ్రమ నుంచి జీవనశైలి వరకు రోజువారీ కార్యకలాపాలలో చేసే చిన్న చిన్న పొరపాట్లు కూడా గర్భధారణ సమయంలో తల్లి, బిడ్డ ఆరోగ్యానికి ప్రమాదకరం. మరి ప్రెగ్నెన్సీ సమయంలో టీ, కాఫీలు తాగొచ్చా? తాగితే ఎంత మొత్తం సురక్షితమో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 

26

ప్రెగ్నెన్సీ టైంలో కెఫిన్ ను ఎక్కువ ఎందుకు తీసుకోకూడదు?

పబ్మెడ్ సెంట్రల్ ప్రచురించిన అధ్యయనం ప్రకారం.. కెఫిన్ శరీరంలో.. ముఖ్యంగా మహిళల్లో చాలా నెమ్మదిగా జీవక్రియ అవుతుంది. గర్భిణుల గురించి మాట్లాడితే కెఫిన్ శరీరం నుంయి బయటకు రావడానికి ఒకటిన్నర నుంచి మూడు రెట్లు ఎక్కువ సమయం పడుతుంది. మీరు ప్రెగ్నెన్సీ టైంలో కెఫిన్ ఎక్కువ తీసుకుంటే అది మీ శరీరంలో ఎక్కువ కాలం ఉంటుంది. దీని వల్ల ఇది మావిలో చేరి బిడకడ రక్తప్రవాహంలోకి చేరుతుంది. ఇది రక్తప్రవాహంలోకి చేరితే పిల్లల ఆరోగ్యంపై చాలా ప్రతికూల ప్రభావం పడుతుంది. 
 

36

నేషనల్ లైబ్రరీ ప్రచురించిన ఒక అధ్యయనం ప్రకారం.. ప్రెగ్నెన్సీ టైంలో కెఫిన్ మహిళల్లో రక్తపోటు, హృదయ స్పందన రేటును పెంచుతుంది. అంతేకాదు శరీరంలో మూత్రం పరిమాణం కూడా పెరుగుతుంది. కెఫిన్ మహిళల్లో చంచలతను పెంచుతుంది. నిద్ర సమస్యలను కూడా కలిగిస్తుంది. చాలా మంది మహిళలు గర్భధారణ సమయంలో కెఫిన్-సున్నితంగా మారుతారు. ఎందుకంటే అవి రక్తం నుంచి శుభ్రపడటానికి ఎక్కువ సమయం పడుతుంది. దీనివల్ల తలనొప్పి, నీరసం, వికారం వంటి సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆడవారి ఆరోగ్యానికి సంబంధించిన ఈ పరిస్థితి ప్రభావం పిల్లల ఆరోగ్యంపై కూడా  పడుతుంది. 

46
pregnancy

pregnancy

గర్భస్రావం 

పలు పరిశోధనల ప్రకారం.. ఎక్కువ మొత్తంలో కెఫిన్ తీసుకోవడం వల్ల గర్భస్రావం అయ్యే ప్రమాదం పెరుగుతుంది. అంతేకాదు ఇది వంధ్యత్వంతో ముడిపడి ఉంటుంది కూడా. ఇది ఇంకా పూర్తిగా రుజువు కాలేదు. అందుకే ప్రెగ్నెన్సీలో ఎలాంటి రిస్క్ తీసుకోకుండా టీ, కాఫీలను నివారించడం మంచిది. 
 

56

నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ ప్రచురించిన ఒక అధ్యయనం ప్రకారం.. ఒక మహిళ ప్రతిరోజూ 200 మి.గ్రా కంటే ఎక్కువ కెఫిన్ తీసుకుంటే.. గర్భస్రావం ప్రమాదం పెరుగుతుంది. అందుకే మీరు కెఫిన్ ను సాధ్యమైనంత వరకు పరిమితం చేయండి.

66
Pregnancy diet

Pregnancy diet

గర్భధారణలో కెఫిన్ సురక్షితమైన మొత్తం ఎంత? 

నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్ ప్రచురించిన అధ్యయనం ప్రకారం.. గర్భిణీ స్త్రీలు లేదా గర్భధారణను ప్లాన్ చేసే ఆడవారు వారి ఆహారంలో తక్కువ మొత్తంలో కెఫిన్ ను చేర్చాలి. రోజుకు 200 మి.గ్రా కంటే తక్కువ కెఫిన్ ను తీసుకోవడానికి ప్రయత్నించండి. దీనివల్ల మీకు ఎలాంటి ప్రమాదం ఉండదు. 
 

About the Author

SR
Shivaleela Rajamoni
శివలీలకు ప్రింట్, డిజిటల్ జర్నలిజం రంగాల్లో 8 సంవత్సరాల అనుభవం ఉంది. నవతెలంగాణ తెలుగు న్యూస్ పేపర్ తో తన కెరీర్ ను ప్రారంభించారు. పలు సంస్థల్లో పని చేసిన విశిష్ట అనుభవంతో పాటు మంచిపేరు సంపాదించారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ ను, నవతెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి డిప్లొమాను పొందారు. 2021వ సంవత్సరం నుంచి ఏషియానెట్ న్యూస్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. లైఫ్ స్టైల్ కేటగిరీ లో భక్తి, ఆరోగ్యం, ఉమెన్, ఫుడ్, పేరెంటింగ్ మొదలైన వాటిపై కథనాలు రాస్తుంటారు.
ఆరోగ్యం

Latest Videos
Recommended Stories
Recommended image1
Parenting Psychology: పేరెంట్స్ స్ట్రెస్ పిల్లలపై ఎలాంటి ప్రభావం చూపిస్తుందో తెలుసా?
Recommended image2
Child Psychology: పిల్లల్ని పదే పదే చెంపపై కొడుతున్నారా? వాళ్లు ఎలా మారిపోతారో తెలుసా?
Recommended image3
Modern Parenting : 9 ఏళ్లు దాటిన పిల్లలకు తల్లి ఎలాంటి విషయాలు నేర్పించాలో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved