MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
September OTT Releases
Yash Mother vs Allu Aravind
New Rules in Schools
Nepal Flash Flood
  • Home
  • Life
  • Pregnancy & Parenting
  • Breastfeeding Moms: పాలిచ్చే తల్లులు ఈ 6 పండ్లు తినాల్సిందే! ఎందుకో తెలుసా?

Breastfeeding Moms: పాలిచ్చే తల్లులు ఈ 6 పండ్లు తినాల్సిందే! ఎందుకో తెలుసా?

Breastfeeding Moms: పాలిచ్చే తల్లుల సాధారణంగా కొన్ని పండ్లు తినడానికి ఇష్టపడరు. దీనికి అనేక కారణాలుంటాయి. కాని బిడ్డలకు సరైన పోషకాలు అందాలంటే తల్లలు కచ్చితంగా కొన్ని పండ్లు తినాాలని డాక్టర్లు చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. 

2 Min read
Author : Naga Surya Phani Kumar
Published : Mar 20 2025, 08:21 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

పిల్లల్ని కన్న తల్లుల లైఫ్ స్టైల్ పూర్తిగా మారుతుంది. పూర్వం పెద్ద వాళ్లు అలాంటి ఆహారపు అలవాట్లు చేసేవారు. పిల్లలకు సరిపడా పాల ఇచ్చేందుకు వాళ్ళు తినే ఆహారంలో ఎక్కువ పోషకాలు ఉండేలా చూసేవారు. ఎందుకంటే పిల్లలకు ఒక వయస్సు వచ్చే వరకు పాలు మాత్రమే ఇవ్వాలి. అందుకే తల్లిపాలు ఎక్కువగా ఉత్పత్తి అయ్యే ఆహారాలను ఎక్కువగా ఇచ్చే వారు. అయితే ఇప్పుడున్న బిజీ లైఫ్ లో చాలా మందికి ఎలాంటి ఆహారం తింటే తల్లికి పాలు ఎక్కువ ఉత్పత్తి అవుతాయో తెలియదు. తల్లులు ఎలాంటి ఆహారం.. ముఖ్యంగా ఎలాంటి పండ్లు తీసుకోవాలో ఇప్పుడు చూద్దాం. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

మన చుట్టూనే ఎన్నో రకాల పోషకాహారం ఉంటుంది. కాని వాటి విలువ తెలియక చాలా మంది తినరు. ముఖ్యంగా గర్భిణులు, బాలింతలు ఎలాంటి ఆహారం తీసుకోవాలో ఈ కాలం యువతులకు పెద్దగా తెలియదు. కేవలం కొన్ని రకాల పండ్లు తింటే పిల్లలకు కావాల్సిన పోషకాలు తల్లి పాలల్లోనే ఉత్పత్తి అవుతాయి. కొన్ని పండ్లు పాలిచ్చే తల్లులకు కావాల్సిన శక్తిని కూడా ఇస్తాయి. కాబట్టి పోషకాలు తక్కువగా ఉన్న తల్లులు, మంచి ఆరోగ్యకరమైన పాలు ఉత్పత్తి చేయడానికి ఇక్కడ చెప్పిన పండ్లు కచ్చితంగా తినాలి. 

దీన్ని కూడా చదవండి:  పిల్లల గదిలో ఇవన్నీ ఉంటే వాళ్లు చాలా హ్యాపీగా ఉంటారు

35

సపోటా

తల్లిపాలు ఇచ్చేటప్పుడు కొందరికి వాంతులు, కళ్ళు తిరగడం, వికారం వస్తాయి. వీటిని ఎదుర్కోవడానికి శరీరానికి ఎక్కువ శక్తి అవసరం అవుతుంది. సపోటా తినడం వల్ల కావాల్సిన శక్తి దొరుకుతుంది. 

స్ట్రాబెర్రీ

స్ట్రాబెర్రీలో విటమిన్ సి ఎక్కువ మొత్తంలో ఉంటుంది. అందుకే డాక్టర్లు ఈ పండు తినమని చెప్తారు. ఇంకా ఇందులో నీటి శాతం కూడా ఎక్కువగా ఉండడం వల్ల శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచుతుంది. దీనివల్ల తల్లిపాలు కూడా ఎక్కువగా ఉత్పత్తి అవుతాయి. 

దీన్ని కూడా చదవండి:  గర్భిణులు మొదటి మూడు నెలలు ఈ జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలి

45

బ్లూబెర్రీ

బ్లూబెర్రీలో సిట్రస్ యాసిడ్, యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి తల్లిపాలలో ఎక్కువగా ఉండే యాంటీ ఆక్సిడెంట్లు తల్లిపాల ద్వారా బిడ్డకు అందుతాయి.

అరటిపండు

అరటిపండులో పొటాషియం ఎక్కువగా ఉండడం వల్ల ఇది పాలిచ్చే తల్లులకు చాలా మంచిదని డాక్టర్లు చెప్తారు. ఇది శరీరంలో లిక్విడ్ బ్యాలెన్సింగ్ చేయడానికి సహాయపడుతుంది. 

55

పచ్చి బొప్పాయి

తల్లిపాల ఉత్పత్తిని పెంచడానికి ఈ పండు బాగా సహాయపడుతుంది. అదే సమయంలో ఈ పండులో ఉండే విటమిన్ ఏ, బి, సి, ఈ పాలిచ్చే తల్లులకు చాలా మంచిది. 

అవకాడో

తల్లుల శరీరంలో తగినంత పోషకాలు ఉంటేనే వాళ్ళు పిల్లలకు పాలు ఇవ్వగలరు. కాబట్టి పోషకాలు నిండిన తల్లిపాలు ఇవ్వాలంటే అవకాడో తినండి. ఎందుకంటే ఈ పండులో ఒమేగా-3, ఒమేగా-9 అవసరమైన అమినో ఆమ్లాలు వంటి పోషకాలు ఉన్నాయి. ఇది బిడ్డకు కావాల్సిన పోషకాలను అందిస్తుంది.

About the Author

NS
Naga Surya Phani Kumar
ఫణి కుమార్ తొమ్మిదేళ్లకు పైగా జర్నలిజంలో ఉన్నారు. అనేక సంస్థల్లో పొలిటికల్, బిజినెస్, లైఫ్ స్టైల్ విభాగాల్లో పనిచేశారు. ‘ఈనాడు’ సంస్థలో తొమ్మిదేళ్లుగా రాజకీయ వార్తలను కవర్ చేశారు. ప్రస్తుతం ‘ఆసియా నెట్ న్యూస్ తెలుగు’లో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. బిజినెస్, లైఫ్ స్టైల్ వార్తలను రాస్తున్నారు. ఈయనకు జ్యోతిష్యం, జాతకం, ఆధ్యాత్మికం తదితర రంగాల్లోనూ ప్రావీణ్యం ఉంది.
చిన్నారుల సంరక్షణ
మహిళలు

Latest Videos
Recommended Stories
Recommended image1
Parenting: మగ పిల్లలకు తల్లి చెప్పాల్సిన 7 లైఫ్ లెసెన్స్.. జీవితాన్నే మార్చేస్తాయి..!
Recommended image2
Pregnancy Symptoms: కిట్ లేకుండానే ప్రెగ్నెన్సీ వచ్చిందో లేదో ఈ 5 లక్షణాల బట్టి చెప్పేయొచ్చు
Recommended image3
Parenting Tips: మీ పిల్లలు బూతులు మాట్లాడితే లైట్ తీసుకుంటున్నారా? ఇవి కచ్చితంగా తెలుసుకోండి
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved