- Home
- Life
- Pregnancy & Parenting
- Parenting Tips: పిల్లలకు ప్రతిరోజూ కచ్చితంగా ఈ మూడు మాటలు చెప్పాల్సిందే..!
Parenting Tips: పిల్లలకు ప్రతిరోజూ కచ్చితంగా ఈ మూడు మాటలు చెప్పాల్సిందే..!
Parenting Tips:చాలా మంది పేరెంట్స్ కి తమ పిల్లలపై ప్రేమ చాలా ఉంటుంది. కానీ, దానిని మాటల్లో వ్యక్తపరచరు. దీని వల్ల పిల్లలు.. పేరెంట్స్ కి తమ మీద ప్రేమ లేదనే భ్రమలో ఉంటారు. అందుకే, ప్రతిరోజూ కొన్ని మాటలు వారికి చెప్పాలి.

parenting Tips
తల్లిదండ్రులు తమ పిల్లలు ఆనందంగా, సంతోషంగా ఉండాలనే కోరుకుంటారు. పిల్లల సంతోషం కోసం పేరెంట్సే ఎక్కువగా కష్టపడుతూ ఉంటారు. వారు అడిగినవి మాత్రమే కాకుండా... అడగనివి కూడా కొనిస్తూ ఉంటారు. అయితే, పేరెంటింగ్ అంటే కేవలం వారికి అసవరం అయినవి కొనివ్వడం మాత్రమే కాదు... పిల్లలు భయపడినప్పుడు, ఆందోళన చెందినప్పుడు, బాధ పడినప్పుడు.. వారిని ఎలా శాంతపరచాలో తెలుసుకోవడం చాలా ముఖ్యం. చిన్న వయసులోనే పిల్లల మెదడు, నాడీ వ్యవస్థ చాలా సున్నితంగా ఉంటుంది. అందుకే వారు భద్రత, ప్రేమను తమ పేరెంట్స్ దగ్గర నుంచి కోరుకుంటారు. అందుకే.. అలాంటి సమయంలో పేరెంట్స్ కూడా పిల్లలకు అన్ని వేళలా అండగా ఉండాలి. మరీ ముఖ్యంగా వారితో ప్రతిరోజూ కొన్ని పదాలు చెబుతూ ఉండాలంట. మరి, తల్లిదండ్రులు ప్రతిరోజూ పిల్లలకు చెప్పాల్సిన విషయాలేంటో చూద్దాం....
నేను నిన్ను ప్రేమిస్తున్నాను....
పిల్లలపై ప్రేమ ఉంటే సరిపోదు. ఆ విషయాన్ని మీరు వారికి చెప్పాలి. పిల్లలు ఏవైనా చిన్న చిన్న తప్పులు చేసినా, భయపడినా, తల్లిదండ్రుల ప్రేమ మాత్రం మారదు అనే బలమైన భరోసా వారికి మీరు తెలియజేయాలి. రెగ్యులర్ గా మీరు మీ ప్రేమను తెలియజేయాలి. అప్పుడు.. వారి నాడీ వ్యవస్థ ప్రశాంతంగా ఉంటుంది. ఆందోళన లాంటివి ఏమైనా ఉంటే అవి తగ్గుతాయి.
నీకు ఏం భయం లేదు....
పిల్లల్లో భయం లేదా ఆందోళన కలిగినప్పుడు వారి మెదడులోని ‘ఫైట్ ఆర్ ఫ్లైట్’ ప్రతిస్పందన యాక్టివ్ అవుతుంది. “మీరు సురక్షితంగా ఉన్నారు” అని చెప్పడం ద్వారా, పిల్లల మెదడుకు ఇది సిగ్నల్ ఇస్తుంది. నీకు ఎలాంటి భయం లేదు..నువ్వు చాలా సేఫ్ ప్లేస్ లో ఉన్నావు అనే మాట పిల్లలకు ధైర్యాన్ని ఇస్తుంది. వారి నాడీ వ్యవస్థ మెరుగుపడుతుంది.
నీకు నేను ఉన్నాను....
చిన్న పిల్లలు ముఖ్యంగా తల్లిదండ్రుల ఉనికిపై ఎక్కువగా ఆధారపడతారు. నీ కోసం నేను ఉన్నాను అని చెప్పే చిన్న మాట పిల్లల్లో ధైర్యాన్ని పెంచుతుంది. భావోద్వేగ భద్రతను పెంచుతుంది. ఈ మాట మీరు వారికి చెప్పడం వల్ల... పిల్లలు తాము ఒంటరి అనే భావన నుంచి బయటపడతారు.
ఈ మాటలు పిల్లలకు ఎలా చెప్పాలి...?
ఈ మాటలను పిల్లలకు నార్మల్ గా నోటితో చెప్పడం కాదు... మీ గొంతు శాంతంగా ఉండాలి. చాలా కూల్ గా వారి కళ్లల్లోకి చూస్తూ.. ప్రేమగా చెప్పాలి. అప్పుడు ఆ మాటల ప్రభావం పిల్లలపై చాలా ఎక్కువగా ఉంటుంది.