- Home
- Life
- Pregnancy & Parenting
- Pregnancy Age: గర్భం దాల్చడానికి సరైన వయసెంత? ఈ ఏజ్ దాటితే రిస్క్ అంటున్న నిపుణులు
Pregnancy Age: గర్భం దాల్చడానికి సరైన వయసెంత? ఈ ఏజ్ దాటితే రిస్క్ అంటున్న నిపుణులు
Pregnancy Age: చదువు, కెరీర్, ఆర్థిక స్వాతంత్ర్యం వంటి కారణాలతో చాలామంది మహిళలు ఆలస్యంగా పెళ్లి చేసుకుంటున్నారు. లేదా తల్లి కావాలనే నిర్ణయాన్ని వాయిదా వేస్తున్నారు. కానీ, వయసు పెరిగే కొద్దీ గర్భధారణలో కొన్ని సమస్యలు ఎదురయ్యే ప్రమాదం ఉంది.
15

Image Credit : Getty
గర్భధారణకు సరైన వయస్సు ఏది?
వైద్య నిపుణుల ప్రకారం, మహిళలు గర్భం దాల్చడానికి 20 నుంచి 30 ఏళ్ల మధ్య వయసు చాలా సురక్షితమైనది. ఈ సమయంలో మహిళల్లో సంతానోత్పత్తి సామర్థ్యం (Fertility) ఎక్కువగా ఉంటుంది. ఆరోగ్యకరమైన బిడ్డకు జన్మనిచ్చే అవకాశాలు కూడా మెరుగ్గా ఉంటాయి.
25
Image Credit : Getty
35 సంవత్సరాల తర్వాత ఎదురయ్యే ప్రమాదాలు ఏమిటి?
30 ఏళ్లు దాటాక సంతానోత్పత్తి సామర్థ్యం క్రమంగా తగ్గుతూ వస్తుంది. ముఖ్యంగా 35 ఏళ్లు దాటిన తర్వాత గర్భం దాల్చడాన్ని 'అడ్వాన్స్‌డ్ మెటర్నల్ ఏజ్' (Advanced Maternal Age) అంటారు. దీనివల్ల కొన్ని ఆరోగ్య సమస్యలు తలెత్తవచ్చు.
35
Image Credit : Getty
తల్లికి ఆరోగ్య సమస్యలు
అధిక రక్తపోటు (BP), మధుమేహం (షుగర్), ప్రసవ సమయంలో లేదా తర్వాత అధిక రక్తస్రావం అయ్యే ప్రమాదం ఉంటుంది. సిజేరియన్ (C-Section) చేయాల్సిన అవసరం పెరగొచ్చు. ఇక బిడ్డ విషయానికొస్తే.. తక్కువ బరువుతో పుట్టడం, నెలలు నిండకముందే ప్రసవం, కొన్ని జన్యుపరమైన లోపాలు తలెత్తే అవకాశం ఉంది.
45
Image Credit : Getty
సంతానోత్పత్తి సామర్థ్యం ఎందుకు తగ్గుతుంది?
మహిళల శరీరంలో అండాల (Eggs) సంఖ్య పుట్టుకతోనే నిర్ణయించబడుతుంది. వయసు పెరిగే కొద్దీ ఈ అండాల సంఖ్యతో పాటు వాటి నాణ్యత (Quality) కూడా తగ్గుతుంది. అందుకే 35 ఏళ్ల తర్వాత గర్భం దాల్చడానికి చాలాసార్లు వైద్య సహాయం అవసరం కావచ్చు.
55
Image Credit : Getty
తీసుకోవాల్సిన జాగ్రత్తలు
వయసుతో సంబంధం లేకుండా, గర్భధారణ సమయంలో సరైన జాగ్రత్తలు తీసుకుంటే తల్లీబిడ్డ ఇద్దరూ సురక్షితంగా ఉండొచ్చు. క్రమం తప్పని వైద్య పరీక్షలు చేయించుకోవాలి. డాక్టర్లు సూచించినప్పుడు స్కానింగ్, రక్త పరీక్షలు తప్పనిసరి. పౌష్టికాహారం, ఫోలిక్ యాసిడ్ వంటి విటమిన్లు తీసుకోవాలి. ఏ చిన్న ఆరోగ్య సమస్య వచ్చినా వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి.
Latest Videos

