Parenting Tips: పిల్లల పెంపకం గురించి సద్గురు ఏమన్నారో తెలుసా?
పిల్లలను గొప్పగా పెంచాలని చాలా మంది పేరెంట్స్ కి ఉంటుంది. అయితే, ఆ పెంపకం సరిగా ఉండాలన్నా, పిల్లల భవిష్యత్తు బాగుండాలన్నా సద్గురు చెప్పిన కొన్ని నియమాలు పాటించాల్సిందే.

తమ పిల్లల భవిష్యత్తు బాగుండాలని ప్రతి పేరెంట్స్ కోరుకుంటారు. అయితే పిల్లలను బాగుండాలంటే, మన పెంపకం సరిగా ఉండాలి. అలా ఉండాలంటే సద్గురు చెప్పిన నియమాలు కచ్చితంగా పాటించాలి. పిల్లలకు సరైన జీవితం కోసం స్వేచ్ఛ, మార్గదర్శకత్వం అవసరం అని సద్గురు చెప్పారు. తల్లిదండ్రులు పిల్లల అవసరాలు, ఆలోచనలు అర్థం చేసుకోవాలి. ఆదేశాలు ఇవ్వకూడదు అని సద్గురు చెబుతున్నారు.
పిల్లల ఆలోచనలకు విలువివ్వండి
పిల్లలను అర్థం చేసుకోండి, వారి మాట వినండి
పిల్లలు తమ ఆలోచనలు తల్లిదండ్రులతో పంచుకున్నప్పుడు, వారి మాట శ్రద్ధగా వినండి. వారి ఆలోచనలు, భావాలను గౌరవించండి. దీనివల్ల వారి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది, వారి ఆలోచనలు ముఖ్యమైనవని భావిస్తారు. పిల్లలు మాట్లాడుతుంటే మీరు వినకుండా ఏదో పని చేసుకోవడం, వాళ్లను ఇగ్నోర్ చేయడం లాంటివి చేయకూడదు. ఓపికగా వినడం అలవాటు చేసుకోవాలి.
అనుభవాలతో పిల్లలకు నేర్పండి
విద్యతో పాటు అనుభవం ముఖ్యం
పిల్లలకు కేవలం పుస్తక జ్ఞానం ఇవ్వడం కంటే, అనుభవాల ద్వారా నేర్పించడం ముఖ్యమని సద్గురు అంటారు. జీవితంలోని వాస్తవాలను వారికి తెలియజేయండి. పుస్తకాలు చదివితే చదువు వస్తుంది. కానీ.. అనుభవ పాఠాలు తెలుసుకుంటే జీవితంలో ముందుకు వెళతారు.
ప్రేమ, క్రమశిక్షణల సమతుల్యత
ప్రేమ, క్రమశిక్షణల సమతుల్యత
తల్లిదండ్రులు పిల్లలకు క్రమశిక్షణ నేర్పుతున్నప్పుడు ప్రేమ, ఓర్పు చూపించాలి. కఠినంగా ప్రవర్తిస్తే పిల్లలు భయపడతారు. తరచూ తిట్టడం, కొట్టడం వల్ల పిల్లలు భయపడతారు.. బాధపడతారు. ఓపికగా నేర్పించాలి. మీరు క్రమశిక్షణ ఫాలో అయితే, మీ పిల్లలు కూడా మీ నుంచి నేర్చుకునే అవకాశం ఉంటుంది. అలా అని, అతిగా ప్రేమ చూపించి గారాభం చేయకూడదు.
పిల్లల వ్యక్తిత్వాన్ని గౌరవించండి
వారి వ్యక్తిత్వాన్ని వారే నిర్మించుకోనివ్వండి
ప్రతి పిల్లవాడు ప్రత్యేకమైనవాడని సద్గురు అంటారు. తల్లిదండ్రులు తమ కోరికలు పిల్లలపై రుద్దకూడదు. వారి ఇష్టాయిష్టాలు తెలుసుకోవాలి. వారికి ఆసక్తి ఉన్న రంగం ఎంచుకుంటేనే వారు జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగగలరు.
పిల్లలతో స్నేహంగా ఉండండి
స్నేహపూర్వక సంబంధం
తల్లిదండ్రులు పిల్లలతో స్నేహితుల్లా ప్రవర్తిస్తే, పిల్లలు తమ సమస్యలు చెప్పుకుంటారు. కోపంగా, ఎప్పుడూ అరుస్తూ ఉంటే.. పిల్లలు తాము చెప్పాలి అనుకునే విషయాన్ని వారితో స్నేహంగా చెప్పాలి.