MalayalamNewsableKannadaTeluguTamilBanglaHindiMarathimynation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • KEA 2025
  • Home
  • Life
  • Pregnancy & Parenting
  • Parenting Tips:ఇలా చేస్తేనే మీరు మంచి తల్లిదండ్రులౌతారు..!

Parenting Tips:ఇలా చేస్తేనే మీరు మంచి తల్లిదండ్రులౌతారు..!

పిల్లలు బాగుండాలనే ప్రతి పేరెంట్స్ కోరుకుంటారు. దాని కోసం కొందరు పేరెంట్స్ అమితమైన ప్రేమ చూపిస్తే, మరి కొందరు మాత్రం చాలా కఠినంగా వ్యవహరిస్తారు. కానీ, ఎలా ఉంటే మంచి పేరెంట్స్ అవుతారో మీకు తెలుసా?

ramya Sridhar | Published : Apr 29 2025, 10:24 AM
2 Min read
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • Google NewsFollow Us
15
Asianet Image

తల్లిదండ్రులు అందరికీ పిల్లలపై అమితమైన ప్రేమ ఉంటుంది. అందులో ఎలాంటి సందేహం లేదు. దాదాపు పేరెంట్స్ అందరూ తమ పిల్లల పెంపకం విషయంలో చాలా బాధ్యతగా ఉంటారు. వారు అడిగినవే కాదు.. అడగనివి కూడా ఇస్తూ.. వారిపై ప్రేమ చూపిస్తారు. అయితే.. పిల్లలు అడిగినవ్నీ కొనిచ్చినంత మాత్రాన మీరు మంచి పేరెంట్ అయినట్లు కాదు. మరి, మీరు మంచి తల్లిదండ్రులు అవ్వాలంటే పేరెంట్స్ ఏం చేయాలి? ఈ విషయంలో నిపుణులు ఏమంటున్నారో తెలుసుకుందాం..

25
Asianet Image

మనసువిప్పి మాట్లాడటం...

పిల్లలు ఎలాంటి భయం లేకుండా  పేరెంట్స్ తో మనసు విప్పి మాట్లాడగలగాలి.పేరెంట్స్ ఏదైనా ప్రశ్నలు అడిగినప్పుడు లేదా, మాట్లాడినప్పుడు మొదలుపెట్టినప్పుడు పిల్లలు తమ మనసులోని నిజాన్ని చెప్పగలగాలి.నిజం చెప్పే ధైర్యం పిల్లలకు ఉంది అంటే.. పేరెంట్స్ మీద ప్రేమ ఉన్నట్లే. పిల్లలు తమ మనసులోని నిజాన్ని చెబితే పేరెంట్స్ గా మీరు సరైన మార్గంలో వెళ్తున్నారని అర్థం. సాధారణంగా పిల్లలు తమ కలలు, భయాలు, నమ్మకాల గురించి చెబితే మానసికంగా పేరెంట్స్ దగ్గర సురక్షితంగా ఉంటున్నట్లు అర్థం. 

35
Asianet Image

సంతోషం: 

ఇంట్లో ఎన్ని సమస్యలు, బాధలు ఉన్నా వాటి మధ్యలో కొంచెం సంతోషం కూడా ఉండాలి. ఎంత కష్టమైన రోజులో కూడా దాన్ని చిరునవ్వుతో ఎదుర్కొనే పేరెంట్స్ పిల్లలను సురక్షితంగా ఉంచుతారు. ఇది ఆరోగ్యకరమైన విషయం. పూర్తిగా బాధపడకుండా సంతోషం కూడా అవసరం. 

తప్పులకు స్థానం ఏది? 

పిల్లలు తమ తప్పుల గురించి సిగ్గుపడకుండా, భయపడకుండా మాట్లాడే వాతావరణాన్ని పేరెంట్స్ కల్పించాలి. పేరెంట్స్ తమ తప్పును సరిదిద్దుకోవడానికి కూడా సిద్ధంగా ఉండాలి. పిల్లలు పేరెంట్స్ దగ్గరికి వచ్చి తాము చేసిన తప్పు ఒప్పుకుంటే అది వారి భావోద్వేగ తెలివితేటలను చూపిస్తుంది. ఇది పిల్లలను మీరు సురక్షితంగా ఉంచారు అనడానికి నిదర్శనం. వారి తప్పును ఎత్తి చూపి సరిదిద్దుతారని వారు అర్థం చేసుకుంటారు. కేవలం విధేయతనే కాకుండా బాధ్యతను కూడా పిల్లలకు నేర్పించడం చాలా ముఖ్యం. 
 

45
Asianet Image

క్షమించడం అవసరం.. 

క్షమాపణ అనేది ఇరువైపులా నుంచి రావాలి. పిల్లలు క్షమాపణ చెప్పినట్లే పేరెంట్స్ కూడా తమ బాధను వ్యక్తపరచాలి. పేరెంట్స్ బలంగా, సరైన వ్యక్తులుగా ఉండటం ముఖ్యం. అదే సమయంలో క్షమాపణ చెప్పడానికి వెనుకాడని వ్యక్తులుగా కూడా ఉండటం ముఖ్యం. ఇది పిల్లలలో గౌరవం అనేది ఏకపక్షం అనే భావనను తొలగిస్తుంది. పిల్లలు కూడా దయ, కరుణతో ప్రవర్తిస్తారు. 

55
Asianet Image

పోల్చడం..

మార్కులు, రూపం, ప్రతిభ వంటి ఏ విషయంలోనూ మీ పిల్లలను ఇతర పిల్లలతో పోల్చని పేరెంట్స్ అయితే మీరు ఖచ్చితంగా సరైన మార్గంలో ఉన్నట్లే అర్థం. పిల్లల ఎదుగుదల ప్రత్యేకమైనది. వారు మంచి వ్యక్తులుగా ఎదగడానికి ఇతరులతో పోల్చకూడదు. 

ప్రేమించడం: 

మీరు పిల్లలతో చాలా కఠినంగా మాత్రమే ప్రవర్తించడం మంచిది  కాదు. ఒక చిన్న తప్పు తర్వాత పేరెంట్స్ గా మీరు కచ్చితంగా కఠినంగా వ్యవహరిస్తారు. ఆ తర్వాత పిల్లలు మీ దగ్గరికి వచ్చి పక్కన కూర్చుంటే, మాట్లాడటానికి ప్రయత్నిస్తే వారిని ఆపకుండా వారితో మాట్లాడండి. ఇది పిల్లల ఆత్మగౌరవాన్ని పెంచే మార్గం.

ramya Sridhar
About the Author
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు. Read More...
జీవనశైలి
ఏషియానెట్ న్యూస్
చిన్నారుల సంరక్షణ
మహిళలు
 
Recommended Stories
Top Stories
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Andriod_icon
  • IOS_icon
  • About Us
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved