- Home
- Life
- Pregnancy & Parenting
- Parenting Tips: మీ పిల్లల్లో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా? వారు మేధావులు కావడం ఖాయం
Parenting Tips: మీ పిల్లల్లో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా? వారు మేధావులు కావడం ఖాయం
ప్రతి తల్లిదండ్రి తమ పిల్లలు తెలివైనవారు కావాలని ఆశిస్తారు. కానీ కొన్నిసార్లు వారి ప్రవర్తనలో కనిపించే చిన్న చిన్న అలవాట్లు, భవిష్యత్తులో వారిని ప్రతిభావంతులుగా చూపించే సూచనలుగా మారతాయి.

ప్రశ్నలు అడిగే అలవాటు
పిల్లవాడు ప్రతి విషయాన్నీ ఎందుకు? ఎలా? అని అడిగితే కోపగించుకోకండి. ఇది అతని జిజ్ఞాసకు సంకేతం. ఇలాంటి పిల్లలు కొత్త విషయాలను త్వరగా అర్థం చేసుకుంటారు. ఎక్కువ ప్రశ్నలు అడిగే పిల్లల్లో సృజనాత్మకత, సమస్య పరిష్కార నైపుణ్యం ఎక్కువగా ఉంటాయని పలు అధ్యయనాల్లో తేలింది.
భిన్నంగా ఆలోచించే తీరు
ప్రతిభావంతులైన పిల్లల్లో కనిపించే మరో ప్రధాన లక్షణం.. ఏ సమస్యనైనా వేరే కోణంలో చూడగలగటం. సాధారణంగా పిల్లలు బొమ్మలను ఆట సాధనంగా ఉపయోగిస్తారు. కానీ ప్రతిభావంతుడు వాటిని కొత్త ప్రయోగాలకు వాడతాడు. ఇది అతని అసాధారణ తెలివితేటలను చూపిస్తుంది.
లోతుగా గుర్తుంచుకునే సామర్థ్యం
కొంతమంది పిల్లలు చిన్న చిన్న వివరాలను కూడా మరచిపోరు. సరైన సమయంలో వాటిని గుర్తించి ఉపయోగిస్తారు. ఇది వారి పదునైన జ్ఞాపకశక్తి, లోతైన అవగాహనకు నిదర్శనం. ఇలాంటి లక్షణం భవిష్యత్తులో విద్య, ఉద్యోగం, జీవితం అన్ని రంగాల్లో వారికి ఉపయోగపడుతుంది.
తల్లిదండ్రుల బాధ్యత
మీ బిడ్డలో ఈ లక్షణాలు ఉంటే, మీరు అతని ప్రతిభను సరైన దిశగా మలచాలి. అతని ఆలోచనలను తెలియజేసేందుకు స్వేచ్ఛ ఇవ్వాలి. మెదడును ఉత్తేజపరిచే ఆట వస్తువులు, పుస్తకాలు ఇవ్వాలి. అతని ప్రశ్నలకు సహనం తో సమాధానం చెప్పాలి.
కొత్త అవకాశాలు కల్పించాలి
పిల్లవాడు కొత్త విషయాలను నేర్చుకోవడానికి ప్రోత్సాహం ఇవ్వాలి. క్రీడలు, కళలు, శాస్త్రం వంటి విభాగాలలో ఆసక్తి పెంచేలా చూడాలి. కొత్త పనులు చేయడానికి అవకాశమిస్తే అతని ప్రతిభ మరింత మెరుగుపడుతుంది.