- Home
- Life
- Pregnancy & Parenting
- Parenting Tips: చలికాలంలో పిల్లల జబ్బుల బారిన పడకుండా ఉండాలంటే ఏం చేయాలి?
Parenting Tips: చలికాలంలో పిల్లల జబ్బుల బారిన పడకుండా ఉండాలంటే ఏం చేయాలి?
Parenting Tips: పిల్లల్లో రోగనిరోధక శక్తి తక్కువగా ఉంటే.. ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశాలు మరింత ఎక్కువగా ఉంటాయి. దగ్గు, జలుబు, వైరల్ ఫీవర్, డయేరియా, టైఫాయిడ్ , కాలరా వంటి వ్యాధుల దాడి ఈ సీజన్ లో చాలా ఎక్కువ అని చెప్పొచ్చు.

Parenting Tips
చలికాలం అందరికీ ఆనందాన్ని ఇస్తుంది. కానీ, ఈ సీజన్ లో తొందరగా జబ్బుల బారిన పడుతూ ఉంటాం. ముఖ్యంగా పిల్లలు... పేరెంట్స్ మాట వినకుండా.. చల్లని గాలులకు బయట తిరుగుతూ ఉంటారు. దీని వల్ల వారికి చాలా తొందరగా ఆరోగ్య సమస్యలు వచ్చేస్తూ ఉంటాయి. ఇక.. పిల్లల్లో రోగనిరోధక శక్తి తక్కువగా ఉంటే.. ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశాలు మరింత ఎక్కువగా ఉంటాయి. దగ్గు, జలుబు, వైరల్ ఫీవర్, డయేరియా, టైఫాయిడ్ , కాలరా వంటి వ్యాధుల దాడి ఈ సీజన్ లో చాలా ఎక్కువ అని చెప్పొచ్చు. ఇలాంటి వ్యాధుల నుంచి పిల్లలను కాపాడాలి అంటే... తల్లిదండ్రులు కొన్ని జాగ్రత్తలు కచ్చితంగా ఫాలో అవ్వాలి. మరి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు చూద్దాం...
బయట తినడం పూర్తిగా మానుకోండి
ఈ సీజన్ లో బయట ఆహారం తినడం చాలా ప్రమాదకరం. వాతావరణం తడి ఉండటం వల్ల బ్యాక్టీరియా వేగంగా పెరుగుతాయి. రోడ్డు పక్క దుకాణాల్లో ఉండే జంక్ ఫుడ్, పకోడీలు, చాట్ వంటి పదార్థాలు పిల్లల జీర్ణ వ్యవస్థను తీవ్రంగా ప్రభావితం చేస్తాయి. ఇవి ఫుడ్ పొయిజనింగ్, డయేరియా, కడుపు నొప్పి వంటి సమస్యలకు దారితీస్తాయి. కాబట్టి ఈ సీజన్‌లో పిల్లలకు తప్పనిసరిగా ఇంట్లో వండిన తాజా ఆహారమే ఇవ్వాలి.
ఎల్లప్పుడూ వేడి , తాజాగా వండిన ఆహారం ఇవ్వండి
పిల్లలకు ఫ్రిజ్ లో ఉంచిన ఆహారాన్ని పిల్లలకు ఇవ్వకూడదు. మిగిలిన ఆహారాన్ని ఫ్రిజ్‌లో ఉంచినా కూడా బ్యాక్టీరియా పెరిగే అవకాశం ఉంటుంది. పిల్లలకు మిగిలిన ఆహారం ఇవ్వడం వల్ల ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి తల్లిదండ్రులు రోజులో తినాల్సినంత మాత్రమే వండి, ఎల్లప్పుడూ వేడి , తాజాగా వండిన ఆహారాన్ని అందించడం మంచిది.
పండ్లను శుభ్రంగా కడిగి ఇవ్వండి
పండ్లు ఆరోగ్యానికి మంచివే కానీ అవి శుభ్రంగా లేకపోతే సమస్యలు వస్తాయి. ముఖ్యంగా ఈ సీజన్ లో పండ్లపై దుమ్ము, సూక్ష్మ క్రిములు, పురుగుమందుల అవశేషాలు ఉండే అవకాశాలు ఎక్కువ. పిల్లలకు పండ్లు ఇచ్చే ముందు వాటిని శుభ్రమైన నీటితో 2–3 సార్లు కడిగి ఇవ్వాలి. అవసరమైతే కొంచెం ఉప్పు నీటిలో లేదా వెనిగర్ నీటిలో కొద్దిసేపు నానబెట్టడం ఇంకా మంచిది.
శుభ్రమైన తాగునీరు తప్పనిసరి
పిల్లలకు కలుషితమైన నీరు తాగించడం వల్ల కాలరా, టైఫాయిడ్, అతి తీవ్రమైన డయేరియా వంటి వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది. అందువల్ల ఇంట్లో తాగునీటిని బాగా మరిగించి చల్లబరచి ఇవ్వండి. వీలైతే వాటర్ ఫిల్టర్ లేదా RO నీటిని ఉపయోగించండి.
రోగనిరోధక శక్తిని పెంచే ఆహారం ఇవ్వండి
పిల్లల రోగనిరోధక శక్తి మంచి స్థాయిలో ఉంటే ఇన్ఫెక్షన్లు దూరంగా ఉంటాయి. ప్రత్యేకంగా విటమిన్ C అధికంగా ఉండే ఆహారాలను చేర్చాలి. ఉదాహరణకు:
నారింజ
నిమ్మ
ఉసిరికాయ
పెరుగు
టమాట
తాజా కూరగాయలు
వీటితో పాటు, పిల్లలు ప్రతిరోజూ వేడి పాలు, డ్రై ఫ్రూట్స్, గుడ్లు తీసుకోవడం వల్ల శరీరానికి కావాల్సిన శక్తి పెరుగుతుంది.
వ్యక్తిగత పరిశుభ్రతపై దృష్టి పెట్టండి
పిల్లలకు చేతులు శుభ్రంగా కడుక్కోవడం అలవాటు చేయండి. బయట ఆడుకున్న తర్వాత, భోజనం ముందు, తర్వాత చేతులు కడగడం తప్పనిసరి. వారు తడి దుస్తులు ధరించకుండా వెంటనే మార్చాలి. తడి షూస్, సాక్స్ బ్యాక్టీరియా పెరిగే ముఖ్య ప్రాంతాలు కావడంతో వాటిని ఎండబెట్టి ఉపయోగించాలి.
ఈ సూచనలను పాటిస్తే పిల్లలు ఈ సీజన్‌ను సంతోషంగా, ఆరోగ్యంగా గడపడమే కాకుండా, వారి రోగనిరోధక శక్తి కూడా బలపడుతుంది.