- Home
- Life
- Pregnancy & Parenting
- Pregnancy: గర్భిణులు ఎలాంటి ఇంటి పనులు ఏం చేయాలి? ఎలాంటి పనులు చేయకూడదు?
Pregnancy: గర్భిణులు ఎలాంటి ఇంటి పనులు ఏం చేయాలి? ఎలాంటి పనులు చేయకూడదు?
Pregnancy: ప్రగ్నెన్సీ టైంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏ చిన్న పొరపాటు జరిగినా.. తల్లీబిడ్డ ఆరోగ్యానికి ప్రమాదం ఏర్పడుతుంది. అందుకు ప్రెగ్నెన్సీ టైంలో ఎలాంటి ఇంటి పనులు చేయొచ్చు? ఎలాంటి ఇంటి పనులు చేయకూడదో ఇప్పుడు తెలుసుకుందాం..

ప్రగ్నెన్సీ టైంలో ఇంటి పనులు చేయొచ్చా?
ప్రెగ్నెన్సీ టైంలో ఆడవారు బరువు చాలా పెరుగుతారు. ఇలాంటి సమయంలో వారి శరీర కదలికలు చాలా వరకు తగ్గుతాయి. అయితే ఇవేవీ పట్టించుకోకుండా చాలా మంది ఆడవారు ఈ టైంలో కూడా ఎన్నో రకాల ఇంటి పనులను చేస్తుంటారు. కానీ మీరు చేసే చిన్న పొరపాటు తల్లీబిడ్డ ఇద్దరి ఆరోగ్యాన్ని రిస్క్ లో పడేస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అందుకే ప్రెగ్నెన్సీ టైంలో ఆడవారు ఎలాంటి ఇంటి పనులు చేయాలి? ఎలాంటి పనులు చేయకూడదో ఇప్పుడు చూద్దాం.
ప్రగ్నెన్సీ టైంలో ఇంటి పనులు చేయొచ్చా?
నిజం చెప్పాలంటే ప్రగ్నెన్సీ టైంలో ఆడవారికి ఒత్తిడి ఉండకూడదు. అలాగే ఖచ్చితంగా విశ్రాంతి ఉండాలి. అలాగనీ ఏ పనులూ చేయకుండా ఉండటం కూడా మంచిది కాదు. గర్భంతో ఉన్నప్పుడు ఒకేదగ్గర ఉండటం గర్భంపై నెగిటీవ్ ఎఫెక్ట్ ను చూపిస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. చిన్న చిన్న ఇంటి పనులు చేస్తే ఎలాంటి సమస్యలు రావని నిపుణులు అంటున్నారు. అయితే గర్భం దాల్చిన మూడు నెలలలు మాత్రం ఇంటి పనులు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి.
ప్రెగ్నెన్సీ టైంలో చేయగలిగే ఇంటి పనులు
ఇళ్లు ఊడ్చడం, తుడవడం
ప్రెగ్నెన్సీ టైంలో మీరు ఇల్లుని శుభ్రం చేసుకోవచ్చు. అంటే ఇంటిని ఊడ్చి నీట్ గా తుడుచుకోవచ్చు. కానీ తుడిచేటప్పుడు కాలు జారకుండా జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఈ పనులకు మీరు వంగకూడదు. పొడుగాటి హ్యాండిల్ ఉన్న చీపుర్లను, మాప్ లను వాడండి. దీనివల్ల మీ గర్భంపై ఎలాంటి ఎఫెక్ట్ పడదు. అయితే ఈ సమయంలో ఎక్కువ సేపు నిలబడటం, వంగి చేసే పనులను చేయకూదు. ఇవి మిమ్మల్ని తొందరగా అలసిపోయేలా చేస్తాయి. ఏ పని చేసినా వెంటనే విశ్రాంతి తీసుకోవాలి.
కూరగాయలను కట్ చేయడం
ప్రగ్నెన్సీ సమయంలో మీరు కూరగాయల్ని కడిగి కట్ చేయడం లాంటి చిన్న చిన్న ఇంటి పనులను చేయొచ్చు. అయితే ఈ పనులు చేసేటప్పుడు ఎక్కువ సేపు నిలబడకండి. కూర్చీలో కూర్చొని చేయడం మంచిది. ఇది మీ శరీరాన్ని ఒత్తిడికి గురికాకుండా చేస్తుంది.
గిన్నెలు తోమొచ్చు
కెమికల్స్ లేని క్లీనర్లను ఉపయోగించి మీరు ఇంట్లో గిన్నెలను కడగొచ్చు. కాకపోతే ఎక్కువ సేపు నిలబడకుండా ఉండాలి. దీనివల్ల మీ శరీరం ఒత్తిడికి, అసౌకర్యానికి గురవుతుంది. అందుకే మీరు ఒకేసారి 15 నిమిషాలకు మించి నిలబడకుండా ఉండాలి. అలాగని మీరు ఎక్కువగా పనిచేస్తే శరీరం అలసటకు గురవుతుంది. అందుకే మధ్యలో విరామం తీసుకుని తర్వాత చేయొచ్చు.
ప్రెగ్నెన్సీ టైంలో ఎలాంటి ఇంటి పనులు చేయకూడదు?
ప్రెగ్నెన్సీ టైంలో పనులు చేస్తేనే నార్మల్ డెలివరీ అవుతుందని చాలా మంది నమ్ముతుంటారు. కానీ ఈ సమయంలో మీరు ఎక్కువ పని చేయకూడదు. అలాగే అన్ని రకాల పనులను చేయడం సేఫ్ కాదు. ఎందుకంటే దీనివల్ల మీ శరీరంపై ఒత్తిడి పడుతుంది. దీంతో మీ బిడ్డ ఆరోగ్యం ప్రమాదంలో పడుతుంది. అలాగే మీలో స్ట్రెస్ హార్మోన్లు పెరుగుతాయి. ఇది తల్లి ఆరోగ్యానికి మంచిది కాదు. అందుకే ఈ సమయంలో ఎలాంటి ఇంటి పనులు చేయకూడదో ఇప్పుడు తెలుసుకుందాం..
బరువులు ఎత్తడం, ఫర్నీచర్ ను మార్చడం చేయొద్దు
ప్రెగ్నెన్సీ సమయంలో ఆడవారు పొరపాటున కూడా బరువులు అస్సలు ఎత్తకూడదు. అలాగే ఇంట్లో ఫర్నీచర్ ను మార్చడం లాంటివి చేయకూడదు. ఎందుకంటే దీనివల్ల అధిక రక్తపోటు సమస్య వస్తుంది. అలాగే డెలివరీ డేట్ కంటే ముందే ప్రసవం కావొచ్చు. అందుకే ఇలాంటి పనులను చేయకూడదు.
మెట్లు ఎక్కే పనులు చేయడం
ఫ్యాన్లను తుడవడం, చైర్ ఎక్కి ఏదో అందుకోవడం, మెట్లను తరచుగా ఎక్కడం, దిగడం వంటి పనులను మాత్రం చేయకూడదు. ఎందుకంటే ఈ సమయంలో శరీర బరువు విపరీతంగా పెరిగి ఉంటుంది. దీనివల్ల కిందపడే అవకాశం ఉంది. అందుకే కర్టెన్లను మార్చడం, సీలింగ్ ఫ్యాన్లను క్లీన్ చేయడం లాంటి పనులను మీరు చేయకుండా ఉండటమే మంచిది.
బాత్ రూంని క్లీన్ చేయొద్దు
ప్రెగ్నెన్సీ టైం లో బాత్ రూంని క్లీన్ చేయడం లాంటి పనులు అసలే చేయకూడదు. ముఖ్యంగా గర్భం చివరి నెలల్లో. ఎందుకంటే బాత్ రూం ఎప్పుడూ తడిగా ఉంటుంది. అలాగే సబ్బు ఆనవాళ్లు కూడా ఉంటాయి. దీనివల్ల జారిపడే ప్రమాదం ఉంది. ముందు ప్రెగ్నెన్సీ టైంలో శరీర బరువు, బేబీ బంప్ బాగా పెరుగుతాయి. ఇలాంటి సమయంలో శరీరాన్ని కింద పడకుండా అదుపు చేయలేం. అందుకే బాత్ రూంని క్లీన్ చేసే పనులు మాత్రం పెట్టుకోకూడదు.
ఇంట్లో చీమలు, బొద్దింకలను తరిమికొట్టడం
ప్రెగ్నెన్సీ టైంలో చీమలను, బొద్దింకలను ఇంట్లో లేకుండా చేయడానికి లక్ష్మణరేక, కెమికల్ స్ప్రేలను వాడుతుంటారు. కానీ వీటిలో మీకు, మీ బిడ్డకు హాని చేసే కెమికల్స్ ఉంటాయి. అలాగే ఇవి హానికరమైన పొగను రిలీజ్ చేస్తాయి. అందుకే ఇలాంటి వాటిని అస్సలు ఉపయోగించకూడదు. ఈ పనులే చేయకూడదు.