MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
September OTT Releases
Yash Mother vs Allu Aravind
New Rules in Schools
Nepal Flash Flood
  • Home
  • Life
  • Pregnancy & Parenting
  • Diabetes Risk: తల్లిదండ్రులకు షుగర్ ఉంటే పిల్లలకు వస్తుందా?

Diabetes Risk: తల్లిదండ్రులకు షుగర్ ఉంటే పిల్లలకు వస్తుందా?

షుగర్ వ్యాధి ప్రస్తుతం చాలా సాధారణం అయిపోయింది. వయసుతో సంబంధం లేకుండా అందరూ షుగర్ వ్యాధి బారిన పడుతున్నారు. లైఫ్ స్టైల్, ఫుడ్ హ్యాబిట్స్ ఇందుకు ప్రధాన కారణాలుగా చెప్పుకోవచ్చు. ఒత్తిడి, నిద్రలేమి, వ్యాయామం లేకపోవడం కూడా షుగర్ రావడానికి దారితీస్తాయి. దీంతో పాటు చాలామందికి ఉన్న డౌట్ ఏంటంటే... తల్లిదండ్రులకు షుగర్ ఉంటే పిల్లలకు వస్తుందా అని? దీనిపై నిపుణులు ఏమంటున్నారు? షుగర్ రాకుండా ముందే ఎలా జాగ్రత్త పడాలో ఇక్కడ చూద్దాం.

2 Min read
Author : Kavitha G
Published : Apr 10 2025, 07:39 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

షుగర్ పేషెంట్ల సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతోంది. కొన్ని సంవత్సరాల క్రితం 45 ఏళ్లు దాటిన వారిని మాత్రమే షుగర్ టెస్ట్ చేయించుకోమని సలహా ఇచ్చేవారు. కానీ ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు. వయసుతో సంబంధం లేకుండా అందరు షుగర్ వ్యాధి బారిన పడుతున్నారు. దీనికి మొదటి కారణం లైఫ్ స్టైల్, ఫుడ్ హ్యాబిట్స్.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
జీవన విధానం

జీవన విధానం

ఒకప్పుడు ఆరోగ్యకరమైన ఆహారం మాత్రమే తినేవారు. ఎక్కువశాతం ఇంటి ఫుడ్ ఇష్టపడేవారు. తిన్న ఆహారానికి తగ్గుట్టుగా శారీరక శ్రమ ఉండేది. కానీ ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు. జీవన విధానం మారిపోయింది. తినే ఫుడ్ ఎక్కువైంది. శ్రమ తక్కువైంది. దీంతో తినే ఆహారమంతా కొవ్వుగా మారి శరీరంలో పేరుకుపోతోంది. 

35
అధిక కొవ్వు

అధిక కొవ్వు

3 పూటల ఆహారం తినడంతో పాటు స్నాక్స్ ఇతర పదార్థాలు కూడా తినడం సాధారణం అయిపోయింది. ఆకలి అయినా కాకపోయినా.. తింటున్నాం. దీని వల్ల శరీరంలో కొవ్వుశాతం పెరిగిపోతోంది. దీనికితోడు శారీరక శ్రమ లేకపోవడం, కనీస వ్యాయామాలు చేయకపోవడం, కూర్చొని చేసే ఉద్యోగాల కారణంగా షుగర్ వ్యాధి వచ్చే అవకాశాలు పెరిగిపోతున్నాయి.

 

45
పేరెంట్స్ కి షుగర్ ఉంటే పిల్లలకు వస్తుందా?

పేరెంట్స్ కి షుగర్ ఉంటే పిల్లలకు వస్తుందా?

తల్లిదండ్రుల్లో ఒకరికి మధుమేహం వచ్చినా పిల్లలకు వచ్చే అవకాశం 60 శాతం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. తల్లికి, తండ్రికి ఇద్దరికీ షుగర్ వ్యాధి ఉంటే వారి పిల్లలకు 90శాతం ఈ వ్యాధి వచ్చే అవకాశం ఉందంటున్నారు.

 

55
మధుమేహాన్ని ఎలా నివారించాలి?

మధుమేహాన్ని ఎలా నివారించాలి?

- కూర్చొని పని చేయడం వల్ల శరీర కదలికలు ఆగిపోతాయి. దీనివల్ల బరువు పెరుగుతారు. ఇది కూడా మధుమేహానికి కారణం అవుతుంది. కాబట్టి ప్రతి గంటకు లేచి నడవడం మంచిది. 

- కడుపు నిండిన తర్వాత ఎక్కువగా తినడం మానుకోవాలి. రాత్రి 7 నుంచి 8 గంటలలోపు తినడం మంచిది. ఉదయం పూట ఆహారాన్ని విస్మరించకూడదు. 

- రాత్రి బాగా నిద్రపోవాలి. రాత్రి మేల్కొని ఉంటే రక్తంలో చక్కెర స్థాయి పెరుగుతుంది. 

- మానసిక ఒత్తిడి కూడా షుగర్ వ్యాధికి కారణం. కాబట్టి మానసిక ఒత్తిడిని తగ్గించే యోగా, ధ్యానం, వ్యాయామం చేయవచ్చు.  

- తిన్న తర్వాత 10 నిమిషాలు నడవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయి అదుపులో ఉంటుంది.

About the Author

KG
Kavitha G
8 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2016లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియానెట్‌లో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు.
ఆరోగ్యం
జీవనశైలి
చిన్నారుల సంరక్షణ
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Parenting: మగ పిల్లలకు తల్లి చెప్పాల్సిన 7 లైఫ్ లెసెన్స్.. జీవితాన్నే మార్చేస్తాయి..!
Recommended image2
Pregnancy Symptoms: కిట్ లేకుండానే ప్రెగ్నెన్సీ వచ్చిందో లేదో ఈ 5 లక్షణాల బట్టి చెప్పేయొచ్చు
Recommended image3
Parenting Tips: మీ పిల్లలు బూతులు మాట్లాడితే లైట్ తీసుకుంటున్నారా? ఇవి కచ్చితంగా తెలుసుకోండి
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved