Parenting Tips: ఆడ పిల్లలు బ్రా ఏ వయసు నుంచి వేసుకోవడం మొదలుపెట్టాలి?
బ్రా ధరించడం ఎప్పుడు ప్రారంభించాలి అనేది పిల్లల రొమ్ములు ఎలా పెరుగుతున్నాయి అనే దానిపై ఆధారపడి ఉంటుంది.

girl child
ఇంట్లో ఆడపిల్ల ఉంది అంటే.. ఆ సందడి ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్కరూ తమ ఇంట్లో ఒక ఆడపిల్ల ఉండాలని అనుకుంటారు. అయితే.. ఇంట్లో అమ్మాయి ఉంది అంటే.. వారికి ఎప్పుడు ఏది అవసరం అవుతుంది అనే విషయం కచ్చితంగా పేరెంట్స్ తెలుసుకొని ఉండాలి. ఏ అమ్మాయి అయినా బాల్యం నుంచి కౌమారదశలోకి ప్రవేశించినప్పుడు, ఆమె శరీరంలో అనేక మార్పులు సంభవిస్తాయి. ఈ సమయంలో ఏ అమ్మాయికైనా నిజమైన స్నేహితురాలు ఆమె తల్లి గా మారాలి. శరీరంలో ఎలాంటి మార్పులు జరుగుతాయి. దాని కోసం ఏం చేయాలి అనే విషయాన్ని ఓపికగా వివరించాలి. మరి.. ఆడపిల్లలకు బ్రా ని ఏ వయసు నుంచి పరిచయం చేయాలి? దీని గురించి నిపుణులు ఏమంటున్నారో తెలుసుకుందాం...
బ్రా ధరించడానికి సరైన వయసు...
బ్రా అనేది మహిళలకు అవసరమైన లో దుస్తులు. యుక్త వయసు ప్రారంభమైన తర్వాత, అది స్త్రీ జీవితంలో ఒక ముఖ్యమైన భాగం అవుతుంది. కాగా, బ్రా ఏ వయసు నుంచి ధరించాలి అని చాలా మందికి చాలా అనుమానాలు ఉంటాయి. అయితే.. బ్రా ధరించాల్సిన అవసరం అందరికీ ఒకే ఏజ్ లో రాకపోవచ్చు. ప్రతి అమ్మాయి శరీరం వేర్వేరు సమయాల్లో అభివృద్ధి చెందుతుంది. కాబట్టి.. దానిని బట్టి మీరు వారికి పరిచయం చేయాలి.
ఎలా గుర్తించాలి?
బ్రా ధరించడం ఎప్పుడు ప్రారంభించాలి అనేది పిల్లల రొమ్ములు ఎలా పెరుగుతున్నాయి అనే దానిపై ఆధారపడి ఉంటుంది. చాలా మంది అమ్మాయిలకు, వారి వక్షోజాలు 8-9 సంవత్సరాల వయస్సులో పెరగడం ప్రారంభిస్తాయి. చాలా మంది అమ్మాయిలకు, ఇది 13-14 సంవత్సరాల వయస్సులో జరుగుతుంది.ఏ తల్లి అయినా తన కుమార్తెకు వక్షోజాల ఆకారం కనిపించడం ప్రారంభించినప్పుడు లేదా పరిగెత్తేటప్పుడు ,ఆడుకునేటప్పుడు అసౌకర్యంగా అనిపించినప్పుడు.. బ్రా ధరించమని చెప్పడం ప్రారంభించాలి.
ఎలాంటివి ఎంచుకోవాలి?
ఇక.. పిల్లలకు మొదటిసారి బ్రాని పరిచయం చేసేటప్పుడు వారికి టీ షర్ట్ బ్రా ని మొదట పరిచయం చేయాలి. ఇది వక్షోజాలకు సరైన మద్దుతు ఇస్తుంది. దీనితో పాటు స్పోర్ట్స్ బ్రా కూడా సెలక్ట్ చేయవచ్చు.హుక్స్ లేదా ఇతర ఫ్యాన్సీ ఎలిమెంట్స్ లేకుండా మృదువైన ఫాబ్రిక్‌తో తయారు చేసిన సాధారణ బ్రాతో ప్రారంభించాలి. మొదటిసారే పిల్లలకు ప్యాడెడ్ బ్రా ని సెలక్ట్ చేయకూడదు. కాస్త వయసు పెరిగిన తర్వాత ప్యాడెడ్ బ్రా లు ఎంచుకోవాలి. అంతేకాదు.. పిల్లలకు చాలా బిగుతుగా ఉండేవి సెలక్ట్ చేయకూడదు. వారికి మంచి కంఫర్ట్ ఉన్నవి మాత్రమే సెలక్ట్ చేయాలి.
ఇక.. పిల్లలకు మొదటిసారి బ్రా ధరించడం వల్ల అసౌకర్యంగా అనిపించొచ్చు. అలాంటి సమయంలో... వారికి అవి వేసుకోవడం ఎంత అవసరమో అర్థమయ్యేలా చెప్పడం చాలా అవసరం.