- Home
- Life
- Pregnancy & Parenting
- Parenting Tips: మీ పిల్లలకు ఇవి అలవాటు చేశారా? భవిష్యత్తులో వారు ఎందరూ పనికిరారంటున్న డాక్టర్లు
Parenting Tips: మీ పిల్లలకు ఇవి అలవాటు చేశారా? భవిష్యత్తులో వారు ఎందరూ పనికిరారంటున్న డాక్టర్లు
Parenting Tips: పిల్లల ఎదుగుదల కేవలం శారీరకమే కాదు, మానసిక ఎదుగుదల కూడా అంతే ముఖ్యం. ప్రస్తుత కాలంలో కొన్ని రకాల అలవాట్లు పిల్లల మెదడు పనితీరును దెబ్బతీస్తున్నాయి. దీని వల్ల పిల్లలకు కనీస తెలివితేటలు, ఏకాగ్రత కూడా ఉండట్లేదు.

Parenting Tips
ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లల భవిష్యత్తు అద్భుతంగా ఉండాలనే కోరుకుంటారు. వారు బాగా చదివి మంచి స్థాయికి వెళ్లాలని అనుకుంటారు. అందుకోసమే వారి చదువు కోసం లక్షల రూపాయలు కూడా ఖర్చు చేయడంలో ఏ మాత్రం వెనకాడరు. కానీ.. పిల్లల భవిష్యత్తు వారు చదివే చదువుపైనే కాదు.. వారి మెదడు ఆరోగ్యంగా ఉండటంపై కూడా ఆధారపడి ఉంటుంది. కానీ, ఈ రోజుల్లో చాలా మంది పిల్లలు ఫోకస్ కోల్పోవడం, చదువులో వెనకపడటం, సరిగా ఏదీ నేర్చుకోకపోవడం వంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు. దీనికి ప్రధాన కారణం పేరెంట్స్ నేర్పుతున్న అలవాట్లే అంటే నమ్మగలరా? అవును.. పిల్లల మీద అతి ప్రేమతో వారికి నేర్పుతున్న కొన్ని రకాల అలవాట్లు.. వారిని మరింత ఎక్కువగా డ్యామేజ్ చేసేస్తున్నాయి. ఫలితంగా అన్నింట్లోనూ వెనకపడిపోతున్నారు. ఇలా జరగకుండా ఉండాలంటే.. ఎలాంటి అలవాట్లకు పిల్లలను దూరంగా ఉంచాలో ఈ రోజు తెలుసుకుందాం...
1.కూల్ డ్రింక్స్, టీ, కాఫీలు ఇవ్వడం...
పిల్లలు కూల్ డ్రింక్స్ కి చాలా ఎక్కువగా ఆకర్షితులౌతారు. పిల్లలు అడిగారు కదా అని పెద్దలు కూడా ఇచ్చేస్తూ ఉంటారు. అసలు... ప్రతి ఇంట్లో పేరెంట్సే ఎక్కువగా ఈ కూల్ డ్రింక్స్ తాగుతూ ఉంటారు. వారిని చూసి పిల్లలు కూడా నేర్చుకుంటారు. ఇవే కాదు.. టీ, కాఫీలను కూడా పిల్లలకు చాలా చిన్న వయసులోనే నేర్పుతూ ఉంటారు. కానీ.. ఇవి మీ పిల్లల మెదడును స్లో పాయిజన్ లా పాడు చేస్తాయి.
వీటిలో ఉండే కెఫీన్, అధిక చక్కెర మెదడులోని నరాలను అతిగా ఉత్తేజపరుస్తాయి. దీనివల్ల పిల్లలు హైపర్ యాక్టివ్‌గా మారి, ఆ తర్వాత వెంటనే నీరసపడిపోతారు. ఇది వారి ఏకాగ్రతను (Focus) దెబ్బతీస్తుంది.
2. చాక్లెట్లు, బిస్కెట్లు (ప్రాసెస్డ్ ఫుడ్)
పిల్లలు ఇష్టంగా తింటారు కదా అని చాక్లెట్లు, బిస్కెట్లు, చిప్స్ వంటివి ఎక్కువగా ఇవ్వకండి. వీటిలో ఉండే ప్రిజర్వేటివ్స్ , అనారోగ్యకరమైన కొవ్వులు మెదడులోని కణాల మధ్య సమాచార మార్పిడిని నెమ్మదిస్తాయి. ఇది పిల్లల జ్ఞాపకశక్తిని (Memory) తగ్గిస్తుంది.
3. అధిక స్క్రీన్ టైమ్, మొబైల్ గేమ్స్
మొబైల్ ఫోన్లు, టాబ్లెట్లు లేదా టీవీల ముందు గంటల కొద్దీ గడపడం మెదడుకు "స్లో పాయిజన్" లాంటిది. మొబైల్ గేమ్స్ ఆడటం వల్ల మెదడులో 'డోపమైన్' అనే హార్మోన్ విడుదలవుతుంది, దీనివల్ల పిల్లలు వాటికి బానిసలవుతారు. ఇది వారి ఆలోచనా శక్తిని తగ్గించి, సహనం (Patience) లేకుండా చేస్తుంది. కళ్ళు , మెదడు రెండూ తీవ్రమైన ఒత్తిడికి లోనవుతాయి.
4. సరైన నిద్ర లేకపోవడం
మెదడు తనను తాను రీఛార్జ్ చేసుకునే సమయం నిద్రలోనే. అందుకే.. పిల్లలకు సరైన నిద్ర కచ్చితంగా అందించాలి.
పిల్లలకు రోజుకు కనీసం 8 నుండి 10 గంటల గాఢనిద్ర లేకపోతే, మెదడు కణాలు అలసటకు గురవుతాయి. దీనివల్ల చదివిన విషయాలు గుర్తుండవు, మెదడు చురుగ్గా పని చేయదు. నిద్రలేమి వల్ల పిల్లల్లో చిరాకు, కోపం పెరుగుతాయి.
5. శారీరక శ్రమ లేకపోవడం
కేవలం ఇంట్లోనే కూర్చుని ఆడుకోవడం వల్ల మెదడుకు అందాల్సిన ఆక్సిజన్ స్థాయిలు తగ్గుతాయి. వ్యాయామం లేదా ఆటలు లేకపోవడం వల్ల మెదడు మొద్దుబారిపోతుంది (Brain Fog). శారీరక శ్రమ ఉన్నప్పుడే మెదడుకు రక్తప్రసరణ బాగా జరిగి, కొత్త విషయాలను నేర్చుకునే సామర్థ్యం పెరుగుతుంది.
తల్లిదండ్రులు ఏం చేయాలి?
పిల్లలకు పండ్ల రసాలు, కొబ్బరి నీళ్లు అలవాటు చేయండి.
స్క్రీన్ టైమ్ రోజుకు ఒక గంట కంటే తక్కువ ఉండేలా చూసుకోండి.
రాత్రి త్వరగా పడుకుని, ఉదయం త్వరగా లేచే అలవాటు చేయండి.
జంక్ ఫుడ్ బదులు డ్రై ఫ్రూట్స్, నట్స్ వంటి పోషకాహారం ఇవ్వండి.
ఫైనల్ గా చెప్పేది ఏమిటంటే... పిల్లల మెదడు ఒక మట్టి ముద్ద లాంటిది. మనం ఇచ్చే అలవాట్లే దానికి ఒక రూపం ఇస్తాయి. పైన చెప్పిన అలవాట్లను మాన్పించి, వారిని ఆరోగ్యవంతమైన భవిష్యత్తు వైపు నడిపించండి.

