MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Business
  • ATM PIN : ఏటీఎం పిన్ 4 అంకెలే ఎందుకు ఉంటుందో తెలుసా? దీని వెనుక ఉన్న ఆసక్తికరమైన స్టోరీ ఇదే

ATM PIN : ఏటీఎం పిన్ 4 అంకెలే ఎందుకు ఉంటుందో తెలుసా? దీని వెనుక ఉన్న ఆసక్తికరమైన స్టోరీ ఇదే

Why ATM PIN Has Only 4 Digits : ఏటీఎం పిన్ 4 అంకెలే ఎందుకు ఉంటాయో మీకు తెలుసా? దీని వెనుక ఒక భార్య సలహా, సైన్స్ ఉన్నాయి. ఈ ఆసక్తికరమైన చరిత్ర, సెక్యూరిటీ ఫీచర్ల వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Jun 28 2026, 02:10 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
భార్య మాట విన్నాడు.. ప్రపంచాన్నే మార్చేశాడు.. ఏటీఎం పిన్ 4 అంకెల స్టోరీ
Image Credit : Gemini

భార్య మాట విన్నాడు.. ప్రపంచాన్నే మార్చేశాడు.. ఏటీఎం పిన్ 4 అంకెల స్టోరీ

మనం ప్రతిరోజూ డబ్బుల కోసం ఏటీఎం సెంటర్లకు వెళ్తుంటాం. కార్డు పెట్టి, మనకు మాత్రమే తెలిసిన 4 అంకెల సీక్రెట్ పిన్ ఎంటర్ చేసి క్యాష్ విత్‌డ్రా చేసుకుంటాం. కానీ, మీరెప్పుడైనా ఆలోచించారా? ఏటీఎం పిన్ ఎప్పుడూ 4 అంకెలే ఎందుకు ఉంటుంది? 5 లేదా 6 అంకెలు ఎందుకు ఉండకూడదు? దీని వెనుక చాలా పెద్ద హిస్టరీ ఉంది. ఒక భార్య ఇచ్చిన సింపుల్ సలహా, హ్యూమన్ మెమొరీకి సంబంధించిన సైన్స్ దీని వెనుక ఉన్నాయి. ఆ ఆసక్తికరమైన విషయాలు గమనిస్తే..

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
ఏటీఎం కార్డు ఆసక్తికరమైన చరిత్ర ఇది
Image Credit : INSTAGRAM

ఏటీఎం కార్డు ఆసక్తికరమైన చరిత్ర ఇది

ఏటీఎం ను కనుగొన్న ఘనత స్కాట్లాండ్‌కు చెందిన జాన్ షెపర్డ్ బారన్ కు దక్కుతుంది. ఆయన 1967 జూన్ 27న లండన్‌లోని బార్క్లేస్ బ్యాంక్‌లో ప్రపంచంలోనే మొట్టమొదటి ఏటీఎంను ఇన్‌స్టాల్ చేశారు. అయితే మొదట్లో షెపర్డ్ బారన్ ఏటీఎం నుంచి డబ్బులు డ్రా చేయడానికి 6 అంకెల పిన్ సిస్టమ్‌ను ప్రవేశపెట్టాలని ప్లాన్ చేశారు. 6 అంకెలు ఉంటే సెక్యూరిటీ చాలా బలంగా ఉంటుందని ఆయన భావించారు.

Related Articles

Related image1
ITR Filing: ఐటీఆర్ అలర్ట్.. కొత్త పన్ను విధానంలో దాగున్న ఆ 5 సీక్రెట్ బెనిఫిట్స్ ఇవే
Related image2
Naga Durga Song: ఆ ఊపు.. ఆ స్టెప్పులు వేరే లెవెల్ ! డీజేలను ఊపేస్తోన్న నాగదుర్గ పల్లె పాట !
35
6 అంకెల పిన్ 4 అంకెలుగా ఎందుకు మారింది?
Image Credit : Chatgpt

6 అంకెల పిన్ 4 అంకెలుగా ఎందుకు మారింది?

జాన్ షెపర్డ్ బారన్ తాను అనుకున్న 6 అంకెల పిన్ సిస్టమ్‌ను మొదట తన భార్య కారోలిన్ పై టెస్ట్ చేశారు. కానీ, ఆమెకు ఆరు అంకెలను గుర్తుపెట్టుకోవడం చాలా కష్టంగా అనిపించింది. కారోలిన్ తన భర్తతో "నాకు కేవలం నాలుగు అంకెలు మాత్రమే ఈజీగా గుర్తుంటున్నాయి. అంతకంటే ఎక్కువ ఉంటే నేను మర్చిపోతున్నాను" అని చెప్పారు. భార్య ఇచ్చిన ఈ ప్రాక్టికల్ ఫీడ్‌బ్యాక్‌ను ఆయన అంగీకరించారు. వెంటనే పిన్ సైజును ఆరు అంకెల నుండి నాలుగు అంకెలకు తగ్గించేశారు. సాధారణ ప్రజలకు కూడా ఇది చాలా సులభంగా ఉంటుందని ఆయన గ్రహించారు. ఆ తర్వాత ఇదే ప్రపంచవ్యాప్తంగా ఒక స్టాండర్డ్‌గా మారిపోయింది.

45
మెమొరీ వెనుక ఉన్న సైన్స్ ఏంటి?
Image Credit : Chatgpt

మెమొరీ వెనుక ఉన్న సైన్స్ ఏంటి?

భార్య చెప్పిన మాటను పక్కన పెడితే, ఈ నిర్ణయం వెనుక ఒక సైంటిఫిక్ రీజన్ కూడా ఉంది. హ్యూమన్ షార్ట్-టర్మ్ మెమొరీ పై ప్రముఖ సైకాలజిస్ట్ జార్జ్ ఎ. మిల్లర్ ఒక రీసెర్చ్ చేశారు. ఈ రీసెర్చ్ ప్రకారం ఒక సాధారణ మనిషి తన మైండ్‌లో ఒకేసారి 5 నుండి 9 విషయాలను మాత్రమే గుర్తుంచుకోగలడు. 4 అంకెల నంబర్ అయితే ఈ లిమిట్‌కు పర్‌ఫెక్ట్‌గా సరిపోతుంది. దీనివల్ల ప్రజలు పిన్ నంబర్‌ను డైరీలోనో, పేపర్ల మీదో రాసి పెట్టుకోకుండా ఈజీగా మైండ్‌లోనే గుర్తుంచుకుంటారు. పేపర్ల మీద రాస్తే ఇతరులు చూసే సెక్యూరిటీ రిస్క్ ఉంటుంది కాబట్టి, ఆ రిస్క్ లేకుండా ఉండటానికే ఈ సింపుల్ మెథడ్‌ను అడాప్ట్ చేసుకున్నారు.

55
4 అంకెల పిన్ నిజంగానే సేఫా?
Image Credit : Chatgpt

4 అంకెల పిన్ నిజంగానే సేఫా?

4 అంకెల పిన్ ఉంటే 0000 నుండి 9999 వరకు దాదాపు 10,000 కాంబినేషన్స్ తయారు చేయవచ్చు. అంటే ఒక దొంగ మీ పిన్‌ను గెస్ చేయాలని చూస్తే, అది కరెక్ట్ అయ్యే ఛాన్స్ 10,000లో కేవలం ఒక్కటి మాత్రమే ఉంటుంది. దీనికి తోడు, ఇప్పటి మోడ్రన్ బ్యాంకులు వరుసగా మూడు సార్లు తప్పు పిన్ ఎంటర్ చేస్తే కార్డును బ్లాక్ చేస్తున్నాయి. దీనివల్ల దొంగలు బ్రూట్ ఫోర్స్ అంటే వరుసగా ట్రై చేయడం వంటి అటాక్స్ చేయలేరు. అందుకే సెక్యూరిటీ, కన్వీనియన్స్ ల మధ్య 4 అంకెల పిన్ ఒక పర్‌ఫెక్ట్ బ్యాలెన్స్‌గా నిలిచింది.

ప్రస్తుతం టెక్నాలజీ ఎంతో అడ్వాన్స్ అయింది. ఎక్కువ సెక్యూరిటీ కోసం కొన్ని ఇంటర్నేషనల్ బ్యాంకులు 6 అంకెల పిన్‌ను తప్పనిసరి చేశాయి. అయినప్పటికీ, కారోలిన్ ఇచ్చిన ఒక చిన్న సలహా నుండి పుట్టిన 4 అంకెల పిన్ సిస్టమే ఇప్పటికీ ప్రపంచంలోని మెజారిటీ దేశాల్లో ఏటీఎం రాజ్యాన్ని ఏలుతోంది.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
వ్యాపారం
పర్సనల్ పైనాన్స్
బ్యాంకింగ్ మరియు ఫైనాన్స్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Gold ETF: గోల్డ్ ఈటీఎఫ్ అంటే ఏమిటి? అందులోనే పెట్టుబడులు పెట్టడం లాభమేనా?
Recommended image2
New Financial Rules: జూలై 1 నుంచి కొత్త రూల్స్.. అలర్ట్ అవ్వకపోతే మీరు మనీ లాస్ అవ్వడం ఖాయం !
Recommended image3
ల‌క్ష పెడితే 2 ల‌క్ష‌లు.. 5 ల‌క్ష‌లు పెడితే రూ. 10 ల‌క్ష‌లు.. పైస‌ల‌ను డ‌బుల్ చేసే సూప‌ర్ స్కీమ్
Related Stories
Recommended image1
ITR Filing: ఐటీఆర్ అలర్ట్.. కొత్త పన్ను విధానంలో దాగున్న ఆ 5 సీక్రెట్ బెనిఫిట్స్ ఇవే
Recommended image2
Naga Durga Song: ఆ ఊపు.. ఆ స్టెప్పులు వేరే లెవెల్ ! డీజేలను ఊపేస్తోన్న నాగదుర్గ పల్లె పాట !
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved