MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • National
  • భార‌త్‌లో బ‌య‌ట‌ప‌డ్డ రెండో ప్ర‌పంచ యుద్ధం నాటి బాంబులు.. 80 ఏళ్ల నుంచి పేల‌కుండా ఉన్నాయి.

భార‌త్‌లో బ‌య‌ట‌ప‌డ్డ రెండో ప్ర‌పంచ యుద్ధం నాటి బాంబులు.. 80 ఏళ్ల నుంచి పేల‌కుండా ఉన్నాయి.

World War: ప్ర‌స్తుతం ప్ర‌పంచ‌మంతా యుద్ధ వాతావ‌ర‌ణంలో ఉంది. ఇరాన్, ఇజ్రాయెల్‌-అమెరికాల మ‌ధ్య ఉన్న ప‌రిస్థితులు అంద‌రినీ ఆందోళ‌న‌కు గురి చేస్తోంది. ఈ నేప‌థ్యంలో తాజాగా భార‌త్‌లో రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యానికి చెందిన రెంబు బాంబులు బ‌య‌ట‌ప‌డ్డాయి. 

2 Min read
Author : Narender Vaitla
Published : Mar 26 2026, 08:20 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
స్వర్ణరేఖ నదిలో బయటపడిన రెండు భారీ బాంబులు
Image Credit : Lok Shakti News 24x7's post/FB

స్వర్ణరేఖ నదిలో బయటపడిన రెండు భారీ బాంబులు

ఝార్ఖండ్ రాష్ట్రంలోని తూర్పు సింగ్‌భూమ్ జిల్లాలో ఉన్న బహరాగోరా ప్రాంతంలో సంచలన ఘటన వెలుగులోకి వచ్చింది. స్వర్ణరేఖ నది ఒడ్డున ఇసుక తవ్వకాల సమయంలో భారీ ఇనుప వస్తువులు బయటపడ్డాయి. మొదట ఇవి సాధారణ స్క్రాప్ అనుకున్నారు. అయితే దగ్గరగా పరిశీలించగా అవి రెండో ప్రపంచ యుద్ధ కాలానికి చెందిన భారీ బాంబులని గుర్తించారు. ఒక్కో బాంబు సుమారు 227 కిలోల బరువు కలిగి ఉంది. దాదాపు 80 సంవత్సరాలుగా ఇసుకలో పాతుకుపోయి ఉన్నప్పటికీ అవి ఇంకా పేలని స్థితిలోనే ఉండటం అధికారులు ఆందోళనకు గురిచేసింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
బాంబుల‌ను డిఫ్యూస్ చేసిన భార‌త సైన్యం
Image Credit : Lok Shakti News 24x7's post/FB

బాంబుల‌ను డిఫ్యూస్ చేసిన భార‌త సైన్యం

ఈ విషయం తెలిసిన వెంటనే అధికారులు ఆ ప్రాంతాన్ని ఖాళీ చేయించారు. ప్రమాదం తలెత్తకుండా ప్రజలను దూరంగా తరలించారు. అనంతరం భారత సైన్యానికి చెందిన బాంబు నిర్వీర్య దళాన్ని అక్కడికి పిలిచారు. ప్రత్యేక జాగ్రత్తలతో సైనికులు ఆ రెండు బాంబులను పరిశీలించి సురక్షితంగా డిఫ్యూస్ (నిర్వీర్యం) చేశారు. నిపుణుల ప్రకారం ఆ బాంబులు పేలితే చుట్టుపక్కల ప్రాంతాల్లో తీవ్ర నష్టం క‌లిగేది.

35
అమెరికా తయారీ ‘AN-M64’ బాంబులుగా గుర్తింపు
Image Credit : Asianet News

అమెరికా తయారీ ‘AN-M64’ బాంబులుగా గుర్తింపు

బాంబులపై ఉన్న గుర్తులను పరిశీలించిన నిపుణులు వాటిని AN-M64 మోడల్ గా గుర్తించారు. ఇవి అమెరికాలో తయారైన వైమానిక బాంబులు. రెండో ప్రపంచ యుద్ధం సమయంలో యుద్ధ విమానాల ద్వారా లక్ష్య ప్రాంతాలపై విసిరేలా వీటిని తయారు చేశారు. బాంబులపై “Made in USA” అనే గుర్తులు కూడా కనిపించాయి. ఏదో కారణంతో అవి అప్పట్లో పేలకుండా నదిలో పడిపోయి ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు.

45
ఝార్ఖండ్ వరకు ఈ బాంబులు ఎలా వచ్చాయి?
Image Credit : Getty

ఝార్ఖండ్ వరకు ఈ బాంబులు ఎలా వచ్చాయి?

ఈ బాంబులు అక్కడికి ఎలా చేరాయనే ప్రశ్న ప్రస్తుతం అందరిలోనూ చర్చనీయాంశంగా మారింది. అధికారిక పత్రాలు ఇప్పటివరకు లభించకపోయినా ఒక అంచనా మాత్రం ఉంది. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో అమెరికా, బ్రిటన్ దేశాల విమానాలు భారత్ తూర్పు ప్రాంతాల్లోని ఎయిర్‌బేస్‌లను ఉపయోగించేవి. అక్కడి నుంచి బర్మా (ప్రస్తుత మయన్మార్), చైనా ప్రాంతాలకు వెళ్లేవి. ఆ సమయంలో ఏదైనా విమానం ప్రమాదానికి గురై ఉండవచ్చు లేదా సాంకేతిక లోపంతో బాంబులు పడిపోయి ఉండవచ్చు. కాలక్రమంలో అవి నది ఇసుకలో పాతుకుపోయి ఇప్పుడు బయటపడ్డాయి.

55
రెండో ప్రపంచ యుద్ధం జరిగిన ప్రధాన ప్రాంతాలు
Image Credit : Freepik

రెండో ప్రపంచ యుద్ధం జరిగిన ప్రధాన ప్రాంతాలు

1939 నుంచి 1945 వరకు సాగిన రెండో ప్రపంచ యుద్ధం మానవ చరిత్రలో అత్యంత విధ్వంసకరమైన యుద్ధంగా గుర్తింపు పొందింది. ఈ యుద్ధం ప్రధానంగా యూరప్, ఆసియా, ఆఫ్రికా, అట్లాంటిక్, పసిఫిక్ మహాసముద్ర ప్రాంతాల్లో జరిగింది. జర్మనీ, ఇటలీ, జపాన్ దేశాలు ఒకవైపు ఉండగా బ్రిటన్, అమెరికా, సోవియట్ యూనియన్ వంటి దేశాలు మరోవైపు పోరాడాయి. ఆసియా ప్రాంతంలో ముఖ్యంగా చైనా, ఫిలిప్పీన్స్, జపాన్, బర్మా ప్రాంతాలు యుద్ధ ప్రభావాన్ని తీవ్రంగా ప్ర‌భావిత‌మ‌య్యాయి. ఆ సమయంలో భారత తూర్పు ప్రాంతాలు మిత్రదేశాల సైనిక కార్యకలాపాలకు ముఖ్య కేంద్రాలుగా పనిచేశాయి. అందుకే ఇప్పటికీ ఒడిశా, ఝార్ఖండ్, ఈశాన్య రాష్ట్రాల అడవుల్లో అప్పటి యుద్ధానికి సంబంధించిన పేలని బాంబులు లేదా విమాన అవశేషాలు అప్పుడప్పుడు బయటపడుతుంటాయి.

About the Author

NV
Narender Vaitla
Narender Vaitla has over eight years of experience in print and digital media. He is currently working as a Senior Sub Editor at Asianet News. He began his journalism career in 2015 with the Sakshi newspaper. Later, in 2019, he worked as a Sub Editor in the digital division of Eenadu, and in 2020, he joined TV9 Telugu (Digital) as a Senior Sub Editor. He regularly writes news stories across sections such as lifestyle, technology, human interest, and related beats.
భారత దేశం
యుద్ధం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
BRICS Summit : బ్రిక్స్ అతిథులకు వెండి పాత్రల్లో భోజనం... వీటిని చూస్తే వావ్ అనాల్సిందే!
Recommended image2
Now Playing
మోదీని చూడగానే పుతిన్ ఇచ్చే రెస్పెక్ట్ చూడండి దట్ఈస్ మోదీ | PM Modi-Putin Meeting in Delhi
Recommended image3
Modi-Putin : 2030 నాటికి 100 బిలియన్ డాలర్ల ట్రేడ్... పుతిన్-మోదీ భేటీలో కీలక చర్చ
Related Stories
Recommended image1
Rain Alert: వ‌చ్చే 3 రోజులు ద‌బిడి దిబిడే.. ఈ ప్రాంతాల్లో భారీ వ‌ర్షాలు. ఎల్లో అల‌ర్ట్ జారీ
Recommended image2
Portable Neck Fan: ఎండ‌ను త‌రిమి కొట్టే నెక్ ఫ్యాన్‌.. ఎలా ప‌నిచేస్తుంది, ధ‌ర ఎంతంటే.?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved