MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • National
  • జింజర్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా గా గుర్తింపుపొందిన రాష్ట్రమేది..? ఇక్కడి అల్లం ఎంత స్పెషలో తెెలుసా..?

జింజర్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా గా గుర్తింపుపొందిన రాష్ట్రమేది..? ఇక్కడి అల్లం ఎంత స్పెషలో తెెలుసా..?

Ginger Capital of India : ఇండియాలో నాణ్యమైన అల్లం ఎక్కడ పండుతుందో తెలుసా..? ఇటీవలే నీతి ఆయోగ్ ఆ రాష్ట్రాన్ని జింజర్ క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా కూడా గుర్తించింది. 

2 Min read
Author : Arun Kumar P
Published : Mar 26 2026, 03:57 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
జింజర్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా ఏది..?
Image Credit : Gemini AI

జింజర్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా ఏది..?

Ginger Capital of India : భారతదేశం ప్రధానంగా వ్యవసాయ ఆధారిత దేశం. ఇక్కడి జనాభాలో 70-80 శాతంమంది వ్యవసాయం, దాని అనుబంధ రంగాలపై ఆదారపడి జీవించేవారే. దేశ ఆర్థిక వ్యవస్ధలో కూడా వ్యవసాయమే కీలక పాత్ర పోషిస్తోంది.

అయితే దేశంలో ఒక్కోరాష్ట్రం ఒక్కో పంటకు ప్రసిద్ది. తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల్లో వరి ఎక్కువగా పండిస్తారు కాబట్టి వీటిని 'రైస్ బౌల్ ఆఫ్ ఇండియా' అని... ఉత్తర ప్రదేశ్ లో చెరకు ఎక్కువ కాబట్టి ''షుగర్ బౌల్ ఆఫ్ ఇండియా'' అని...పంజాబ్ లో గోదుమలు ఎక్కువగా పండిస్తారు కాబట్టి ''వీట్ బౌల్ ఆఫ్ ఇండియా'' అని పిలుస్తారు.

అయితే ఇటీవల నీతి ఆయోగ్ ఓ రాష్ట్రాన్ని'జింజర్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా' గా గుర్తించింది. అయితే ఎక్కువ ఉత్పత్తి ఆధారంగా కాకుండా మంచి నాణ్యత కలిగిన అల్లం పండించడం ఆధారంగా ఈ గుర్తింపు లభించింది. ఇలా భారతీయులు వంటల్లో ఎక్కువగా ఉపయోగించే అల్లంను చాలా రాష్ట్రాలు పండిస్తాయి... కానీ నాణ్యమైన అల్లం పండిస్తూ ఈ రాష్ట్రం ప్రత్యేక గుర్తింపు పొందింది. ఈ జింజర్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా గురించి ఆసక్తికర విషయాలు ఇక్కడ తెలుసుకుందాం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
జింజర్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా ఏది..?
Image Credit : Getty

జింజర్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా ఏది..?

ప్రపంచంలో అల్లం అత్యధికంగా పండించే దేశం ఇండియానే. ప్రపంచవ్యాప్తంగా ఉత్పత్తిచేసే అల్లంలో 40 శాతం కేవలం ఇండియాదే. ఇలా దేశంలో పండించే అల్లం స్థానిక అవసరాలకు ఉపయోగించడమే కాదు ఇతర దేశాలకు కూడా ఎగుమతి చేస్తారు. ఇండియన్ అల్లంకు చాలాదేశాల్లో డిమాండ్ ఉంది. అందుకే ప్రభుత్వాలు కూడా ఈ పంటను ఎక్కువగా పండించేలా ప్రోత్సహిస్తోంది. అందులో భాగంగానే నీతి ఆయోగ్ ఈశాన్య రాష్ట్రం మిజోరాంను జింజర్ క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా ప్రకటించింది.

35
మిజోరాంకే ఎందుకు ఈ గుర్తింపు..?
Image Credit : AI Generated

మిజోరాంకే ఎందుకు ఈ గుర్తింపు..?

ఇండియాలో అత్యధికంగా అల్లం పండించే రాష్ట్ర మధ్యప్రదేశ్. మరి మిజోరాంను ఎందుకు జింజర్ క్యాపిటల్ గా ప్రకటించారు అనేగా మీ డౌట్..? అయితే అన్ని పంటల విషయంలో ఎక్కువ ఉత్పత్తి చేసిన రాష్ట్రాలకే ప్రత్యేక గుర్తింపు లభించింది... కానీ అల్లం విషయంలోనే నాణ్యత ప్రామాణికంగా తీసుకున్నారు. ప్రపంచంలో ఎక్కుడాలేని విధంగా మిజోరాంలో పండే అల్లం చాలా ప్రత్యేకమైనది... దీని ఆరోమా గానీ, టేస్ట్ గాని అద్భుతం. ఇది వేరే ఎక్కడ పండే అల్లంలో ఉండదు... అందుకే దీనికింత ప్రత్యేక గుర్తింపు.

45
మిజోరాం అల్లం ఇంత స్పెషల్ ఎందుకు..?
Image Credit : Gemini AI

మిజోరాం అల్లం ఇంత స్పెషల్ ఎందుకు..?

మిజోరాం రాష్ట్రం కొండకోనలతో కూడిన ప్రాంతం. ఇక్కడి రైతులు ఎక్కువగా కొండ అంచులు, ఎత్తుపల్లాలు కలిగిన భూముల్లో వ్యవసాయం చేస్తుంటారు. ఇలాంటి భూములు అల్లం పంటకు చాలా అనుకూలంగా ఉంటాయి. అల్లం పంటకు నీరు నిల్వ ఉండకూడదు, కానీ తేమ ఉండాలి... మిజోరాం కొండ అంచుల్లో ఇలాంటి పరిస్థితులే ఉంటాయి... కాబట్టి నాణ్యమైన అల్లం పండుతుంది.

మిజోరాంలో వర్షాలు కూడా అల్లం పంటకు అనుకూలంగా ఉంటాయి. ఇక్కడి భూములు, వ్యవసాయ పద్దతులు, వాతావరణ పరిస్థితులన్నీ నాణ్యమైన అల్లం పండించేందుకు ఉపయోగపడుతున్నాయి. అందుకే అల్లం ఉత్పత్తి కూడా ఇక్కడ ఎక్కువగా ఉంటుంది. ఇలా మిజోరాం అల్లం కేవలం జాతీయస్థాయిలోనే కాదు ప్రపంచస్థాయిలో ప్రత్యేకంగా నిలిచింది... నాణ్యతలో టాప్ ప్లేస్ సాధించింది.

55
వెల్లుల్లి అత్యధికంగా పండించే రాష్ట్రమేది..?
Image Credit : Getty

వెల్లుల్లి అత్యధికంగా పండించే రాష్ట్రమేది..?

అల్లం, వెల్లుల్లి కలిస్తేనే భారతీయ వంటకాలకు రుచి వచ్చేది. ఇండియాలో ఈ రెండింటిని అత్యధికంగా పండిస్తున్న రాష్ట్రం మధ్య ప్రదేశ్. దేశవ్యాప్తంగా ఉత్పత్తయ్యే వెల్లుల్లిలో 60-65 శాతం కేవలం మధ్య ప్రదేశ్ లోనే పండుతుంది. ఇక రాజస్థాన్, ఉత్తర ప్రదేశ్, గుజరాత్ లో కూడా వెల్లుల్లిని ఎక్కువగా పండిస్తారు. ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే చైనా తర్వాత అత్యధికంగా వెల్లుల్లిని ఉత్పత్తిచేసే దేశం ఇండియానే.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
వ్యవసాయం (Vyavasayam)
భారత దేశం
ఆహారం
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Delhi: మ‌రోసారి ర‌ణ‌రంగంగా మారిన జంత‌ర్‌మంత‌ర్‌.. రాహుల్, ప్రియాంక సహా విపక్ష ఎంపీల అరెస్ట్
Recommended image2
ఢిల్లీలో అసలేం జరుగుతోంది? మళ్లీ కుప్పకూలిన నాలుగంతస్తుల భవనం
Recommended image3
Rahul Gandhi: మరోసారి దద్దరిల్లిన దేశ రాజధాని.. అసలు ఢిల్లీలో ఏం జరుగుతోంది.?
Related Stories
Recommended image1
Ginger: మట్టి కూడా అవసరం లేకుండా ఇంట్లోనే అల్లం పెంచొచ్చు.. ఎలానో తెలుసా?
Recommended image2
Ginger: ఇంట్లో కుండీలోనే అల్లం పెంచొచ్చు, ఈ స్టెప్స్ ఫాలో అయితే చాలు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved