Viral Video: ఇందేదిరా మామా.! కాకి మాట్లాడుతోంది. వైరల్ వీడియో
సోషల్ మీడియా విస్తృతి పెరిగిన తర్వాత ప్రపంచంలో ఏ మూలన ఏం జరిగినా క్షణాల్లో వైరల్ అవుతోంది. అర క్షణంలో అరచేతిలో కనిపిస్తోంది. స్మార్ట్ ఫోన్ ఓపెన్ చేస్తే చాలు ఇలాంటి వీడియోలు ఎన్నో. తాజాగా ఇలాంటి ఓ ఆసక్తికరమైన వీడియో అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఇంతకీ ఏంటా వీడియో.? అందులో ఏముందో తెలియాలంటే ఈ స్టోరీలోకి వెళ్లాల్సిందే..
- FB
- TW
- Linkdin
Follow Us
)
Crow talking viral video
సాధారణంగా కొన్ని రకాల పక్షులను మనుషుల గొంతును అనుకరిస్తాయని తెలిసిందే. మనుషుల్లా మాట్లాడే రామ చిలుక గురించి విని ఉంటాం, మనుషుల్లా అరిచే కోకిలను చూసి ఉంటాం. మరి కాకి అచ్చంగా మనిషిలా మాట్లాడితే ఎలా ఉంటుందో ఎప్పుడైనా చూశారా.? కాకి మనిషిలా మాట్లాడడం ఏంటని ఆశ్చర్యపోతున్నారా. ఈ సంఘటన నిజంగా జరిగింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇందుకు సంబంధించిన వీడియో తెగ వైరల్ అవుతోంది.
talking-crow
వివరాల్లోకి వెళితే.. మహారాష్ట్ర పాల్ఘర్ జిల్లా షాపూర్ తాలూకాలో గర్గావ్ గ్రామంలో మాట్లాడుతోన్న కాకి అందరి దృష్టిని ఆకర్షించింది. స్థానికంగా నివాసం ఉంటున్న తనుజా ముఖ్నే అని మహిళ ఈ కాకిని పెంచుకుంటోంది. మూడు సంవత్సరాల క్రితం తన తోటలో గాయపడిన ఈ కాకిని చూసిన ఆమె పదిహేను రోజులపాటు సంరక్షించారు.
అయితే ఆ కాకి పూర్తిగా కోలుకున్న తర్వాత తమ వద్దే ఉంచుకొని దానిని పెంచుకోవడం ప్రారంభించారు. కాకిని పెంచుకోవడమే విచిత్రం అంటే అది ఆ కుటుంబ సభ్యుల్లో ఒకటిగా మారిపోవడం మరో విచిత్రం. ఎంతలా అంటే ఆ కుటుంబ సభ్యులు మాట్లాడుకునే మాటలను ప్రతీ రోజూ విని ఆ మాటలను స్పష్టంగా అనుకరించేలా. "కాకా," "బాబా," "మమ్మీ" లాంటి మరిన్ని పదాలను కూడా పలుకుతూ అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.