MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • National
  • Viral Video: బతికున్న కూతురుకు అంత్య‌క్రియ‌లు చేసిన తండ్రి.. వైర‌ల్ అవుతోన్న వీడియో

Viral Video: బతికున్న కూతురుకు అంత్య‌క్రియ‌లు చేసిన తండ్రి.. వైర‌ల్ అవుతోన్న వీడియో

Viral Video: స‌మాజంలో ఎన్ని మార్పులు వ‌చ్చినా కొన్ని మాత్రం ఇప్ప‌టికీ అలాగే ఉంటున్నాయి. ప్రేమ వివాహాల‌పై సొసైటీలో నిషేధం కొన‌సాగుతూనే ఉంది. కొంద‌రు త‌ల్లిదండ్రులు త‌మ పిల్ల‌ల ఇష్టం కంటే, క‌ట్టుబాట్ల‌కే విలువ ఇస్తున్నారు. 

2 Min read
Narender Vaitla
Published : Dec 23 2025, 02:09 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
ఇంటి నుంచి వెళ్లిపోయిన యువతి
Image Credit : Hate Detector/X

ఇంటి నుంచి వెళ్లిపోయిన యువతి

మధ్యప్రదేశ్‌లోని విదిషా పట్టణం చునావాలి గలి ప్రాంతంలో జ‌రిగిన షాకింగ్ సంఘ‌ట‌న యావ‌త్ దేశం దృష్టిని ఆక‌ర్షించింది. కుష్వాహ కుటుంబానికి చెందిన 23 ఏళ్ల కవిత అనే ఓ యువ‌తి ఇంటి నుంచి వెళ్లిపోయింది. కొన్ని ఆ త‌ర్వాత ప్రేమించిన యువకుడితో గోప్యంగా పెళ్లి చేసుకున్నట్టు కుటుంబానికి తెలిసింది. ఈ నిర్ణయాన్ని కుటుంబ సభ్యులు అంగీకరించలేకపోయారు.

25
కుటుంబాన్ని కుదిపేసిన వార్త
Image Credit : Hate Detector/X

కుటుంబాన్ని కుదిపేసిన వార్త

కవిత కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు చుట్టుపక్కల ప్రాంతాల్లో వెతికారు. బంధువులను కూడా సంప్రదించారు. ఎలాంటి సమాచారం దొరకలేదు. కొద్ది రోజుల తరువాత ఆమె ప్రేమికుడితో వెళ్లిపోయి వివాహం చేసుకున్నట్టు తెలిసింది. ఈ వార్త కుటుంబాన్ని తీవ్రంగా కలచివేసింది. ఇంట్లోనే ఉండి బాధలో మునిగిపోయారు.

Related Articles

Related image1
Zodiac sign: ఈ రాశి వారికి ఈ వారం కీల‌కం.. తొంద‌ర‌పాటు నిర్ణ‌యాలు అస్స‌లు తీసుకోకండి
Related image2
హైద‌రాబాద్‌లో కొత్త‌గా ఎలివేటెడ్ కారిడార్లు.. ఈ ప్రాంతాల్లో భూముల ధ‌ర‌లు పెర‌గ‌డం ఖాయం
35
భావోద్వేగ నిర్ణయం
Image Credit : Hate Detector/X

భావోద్వేగ నిర్ణయం

బంధువులు వచ్చి కుటుంబానికి ధైర్యం చెప్పారు. అయినా ఆ షాక్ నుంచి వారు బయటపడలేకపోయారు. చివరకు కవితను ఇక తమ కుమార్తెగా భావించలేమని నిర్ణయించారు. ఆమెను మృతురాలిగా ప‌రిగ‌ణించి అంత్యక్రియలు చేయాలని భావించారు.

In a deeply emotional incident from #Vidisha, #MadhyaPradesh, a family declared their daughter dead after she eloped with her lover and married him secretly.

Unable to accept her decision, the family made an effigy, took out a funeral procession through the city, and performed… pic.twitter.com/bpu5MymqGd

— Hate Detector 🔍 (@HateDetectors) December 22, 2025

45
ఊరేగింపు, అంత్యక్రియలు
Image Credit : Hate Detector/X

ఊరేగింపు, అంత్యక్రియలు

అనుకున్న‌దే త‌డ‌వుగా.. శుక్రవారం రోజున బంధువులు, పరిచయస్తులను పిలిచారు. పిండితో కవితను పోలిన‌ట్లు ఒక ప్ర‌తిమ‌ను త‌యారు చేశారు. అనంత‌రం ఆ ప్రత‌మ‌ను అలంకరించిన పల్లకీలో ఉంచి ఊరేగింపుగా పట్టణ వీధుల్లో తీసుకెళ్లారు. స్థానిక యువకులు పల్లకీ మోశారు. అనంతరం శ్మశానవాటికకు చేరుకుని సంప్రదాయాల ప్రకారం అంత్యక్రియలు నిర్వహించారు. చివరకు ప్రతిమను దహనం చేశారు.

55
కుటుంబ సభ్యుల ఆవేదన
Image Credit : Hate Detector/X

కుటుంబ సభ్యుల ఆవేదన

కవిత అన్న రాజేష్ కుష్వాహ మాట్లాడుతూ తమ కుటుంబం ఆమెను ఎంతో ప్రేమతో పెంచిందని చెప్పారు. మంచి చదువు చెప్పించామని, ఆశలన్నీ పెట్టుకున్నామని తెలిపారు. ఆమె వెళ్లిపోవడం తమ కలలన్నింటినీ చెదరగొట్టిందన్నారు. తండ్రి రాంబాబు కుష్వాహ కన్నీళ్లతో మాట్లాడుతూ ఇది తన జీవితంలో ఎదురైన అత్యంత బాధాకరమైన క్షణమని చెప్పారు. కుమార్తె తీసుకున్న నిర్ణయం కుటుంబాన్ని పూర్తిగా కుంగదీసిందని ఆవేద‌న‌తో చెప్పుకొచ్చాడు. ఇప్పుడీ సంఘ‌ట‌న సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. ఈ సంఘ‌ట‌న‌కు సంబంధించి కొంద‌రు తండ్రి చేసిన ప‌నికి మ‌ద్ధ‌తు తెలుపుతుంటే మ‌రికొంద‌రు మాత్రం బ‌తికున్న కూతురు అంత్య‌క్రియ‌లు చేయ‌డం దారుణ‌మంటూ కామెంట్లు చేస్తున్నారు.

About the Author

NV
Narender Vaitla
నరేందర్ వైట్లకు ప్రింట్‌, డిజిటల్ మీడియాలో 8 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం ఏసియా నెట్ న్యూస్ తెలుగులో సీనియర్ సబ్ ఎడిటర్‌గా సేవందిస్తున్నారు. 2015లో సాక్షి దినపత్రిక ద్వారా జర్నలిజంలోకి అడుగుపెట్టారు. అనంతరం 2019లో ఈనాడు డిజిటల్‌ విభాగంలో సబ్‌ ఎడిటర్‌గా, 2020లో టీవీ9 తెలుగులో (డిజిటల్‌) సీనియర్‌ సబ్‌ ఎడిటర్‌గా పని చేశారు. లైఫ్‌స్టైల్‌, టెక్నాలజీ, హ్యుమన్‌ ఇంట్రెస్ట్‌ వంటి తదితర విభాగాలకు చెందిన వార్తలు రాస్తుంటారు.
వైరల్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Success Story : పట్టువదలని విక్రమార్కులు.. ఈ ఐదుగురూ లాస్ట్ అటెంప్ట్స్ లోనే IAS సాధించారుగా
Recommended image2
Condom Sale: ఒకే వ్య‌క్తి ల‌క్ష రూపాయ‌ల కండోమ్స్ కొనుగోలు.. 2025 ఇయ‌ర్ ఎండ్ రిపోర్ట్‌లో ఆస‌క్తిక‌ర విష‌యాలు
Recommended image3
IMD Rain Alert : ఇక మంచు తుపాను బీభత్సం... ఆ ప్రాంతాల్లో అల్లకల్లోలమే..!
Related Stories
Recommended image1
Zodiac sign: ఈ రాశి వారికి ఈ వారం కీల‌కం.. తొంద‌ర‌పాటు నిర్ణ‌యాలు అస్స‌లు తీసుకోకండి
Recommended image2
హైద‌రాబాద్‌లో కొత్త‌గా ఎలివేటెడ్ కారిడార్లు.. ఈ ప్రాంతాల్లో భూముల ధ‌ర‌లు పెర‌గ‌డం ఖాయం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved