MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Forecast
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Smriti Mandhana
Sahaa Movie Review
Bigg Boss Telugu
Chiranjeevi's Mother
Romanchakam Movie Review
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
  • Home
  • National
  • CJP Protest : కాక్రోచ్ జనతా పార్టీకి బుధాదిత్య రాజయోగం... భవిష్యత్ లో ఏం జరగబోతోందో చెప్పేసిన వేణుస్వామి

CJP Protest : కాక్రోచ్ జనతా పార్టీకి బుధాదిత్య రాజయోగం... భవిష్యత్ లో ఏం జరగబోతోందో చెప్పేసిన వేణుస్వామి

సినిమాలు, సినీనటుల జాతకాల గురించి చెబుతూ బాగా ఫేమస్ అయ్యారు జ్యోతిష్కులు వేణుస్వామి. ఇప్పుడు రాజకీయ జాతకాలు చెబుతున్నారు… ప్రస్తుతం బాగా ట్రెండ్ అవుతున్న సిజెపి ఉద్యమం గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు.

3 Min read
Author : Arun Kumar P
Published : Jul 25 2026, 12:03 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
కాక్రోచ్ జనతా పార్టీ జాతకం చెప్పిన వేణుస్వామి
Image Credit : Facebook/Venu Swamy

కాక్రోచ్ జనతా పార్టీ జాతకం చెప్పిన వేణుస్వామి

ప్రస్తుతం దేశవ్యాప్తంగా గట్టిగా వినిపిస్తున్న పేరు కాక్రోచ్ జనతా పార్టీ (CJP). మెడికల్ ఎంట్రన్స్ టెస్ట్ నీట్ (NEET) పేపర్ లీక్ వ్యవహారంపై సిజెపి నిరసనలకు పిలుపునివ్వగా యువతీయువకులు భారీగా పాల్గొన్నారు.. దీంతో దేశ రాజధాని డిల్లీలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. పార్లమెంట్ సమీపంలోని జంతర్ మంతర్ వద్ద సిజెపి ఆందోళనలు తీవ్రరూపం దాల్చాయి. చివరికి కేంద్ర ప్రభుత్వమే దిగివచ్చి వీరితో చర్చలు జరుపుతోంది... డిమాండ్లపై సానుకూలంగా స్పందిస్తోంది.

ఇలా ఉద్ధృతంగా సాగుతున్న సిజెపి ఉద్యమంపై ప్రముఖ తెలుగు జ్యోతిష్కులు వేణుస్వామి స్పందించారు. 'కాక్రోచ్ జనతా పార్టీ' (సిజెపి) జాతకాన్ని విశ్లేషిస్తూ ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో తీవ్ర సంచలనం సృష్టిస్తున్నాయి. సిజెపి భవిష్యత్తు, రాజకీయాల్లో దాని ప్రభావం ఎలా ఉండబోతోందనే అంశాలపై ఆయన అనేక ఆసక్తికర విషయాలను వెల్లడించారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
సిజెపిది మహజ్జాతకం..
Image Credit : Facebook/Venu Swamy

సిజెపిది మహజ్జాతకం..

వేణు స్వామి తెలిపిన వివరాల ప్రకారం... సిజెపి జాతకం సింహ లగ్నంలో ఉండి అత్యంత విశిష్టమైన గ్రహ కూటమిని కలిగి ఉంది. లగ్న కుండలి, రాశి చక్రం ప్రకారం చూస్తే రాహువు 7వ ఇంట.. శని 8వ ఇంట.. కుజుడు 9వ ఇంట.. 10వ ఇంట్లో రవి, బుధ, చంద్రుడు.. 11వ ఇంట్లో శుక్ర, గురుడు ఉన్నారు. అయితే 10వ ఇంట్లో రవి, బుధుడు,చంద్రుడు కలిసి ఉండటంతో శక్తివంతమైన 'బుధాదిత్య యోగం' ఏర్పడింది... దీనికి తోడు కాలసర్ప సహిత రాజయోగం కూడా తోడవడంతో సిజెపికి ఊహించని రీతిలో పబ్లిసిటీ, అటెన్షన్, ప్రజాదరణ దక్కుతున్నాయి. ఈ క్రేజ్ రాబోయే అక్టోబర్ 21 వరకు కొనసాగుతుందని, ఆ తర్వాత పొలిటికల్ స్పేస్‌లో కొత్త రకమైన హడావుడి, వేరొక స్థాయి క్రేజ్ ప్రారంభమవుతుందని వేణుస్వామి స్పష్టం చేశారు.

Related Articles

Related image1
Venu Swamy: విజయ్, త్రిష విషయంలో వేణు స్వామి చెప్పిందే జరిగింది.. రెండేళ్ల ముందే బయటపెట్టాడుగా..!
Related image2
Venu Swamy: పవన్ కళ్యాణ్, జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల మధ్య చిచ్చు పెట్టిన వేణు స్వామి, సీఎం పోస్ట్ పై సంచలన జోస్యం
35
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా తప్పదా?
Image Credit : Facebook/Venu Swamy

ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా తప్పదా?

ప్రస్తుతం దేశాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్న నీట్ పేపర్ లీకేజీ వివాదాన్ని ప్రస్తావిస్తూ వేణు స్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశవ్యాప్తంగా విద్యార్థులు, ప్రతిపక్షాలు ఈ అంశంపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు డిమాండ్ చేస్తున్న సమయంలో, ఆయన పదవిని వీడటం ఖాయమని జోస్యం చెప్పారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడానికి 100కు 100 శాతం అవకాశాలు ఉన్నాయని, అయితే ఇది నీట్ పేపర్ లీక్ వ్యవహారం వల్ల జరుగుతుందా లేక ఇతర రాజకీయ పరిణామాల వల్లనా అనేది రానున్న రోజుల్లో తేలాల్సి ఉందన్నారు.

45
సిజెపి సపోర్ట్ తోనే అధికారమా..!
Image Credit : Facebook/Venu Swamy

సిజెపి సపోర్ట్ తోనే అధికారమా..!

మరొక ముఖ్యమైన విషయమేమిటంటే ఈ సిజెపి పార్టీ వల్ల భవిష్యత్తులో భారతీయ జనతా పార్టీకి (బిజెపి) 100 శాతం నష్టం చేకూరే అవకాశం ఉందని వేణు స్వామి పేర్కొన్నారు. సిజెపి రాశి చక్రమైనా, లగ్న చక్రమైనా ప్రధాని నరేంద్ర మోదీ, బిజెపి జాతకంతో 'శష్టకం' అయ్యిందని వివరించారు. 

రాశి చక్రంలో 10వ ఇంట్లో రాహువు ఉండటం రాజయోగాన్ని సూచిస్తోందని, అందువల్ల ఈ సిజెెపి ఉద్యమాన్ని అణచివేయాలని చూస్తే ప్రత్యర్థులకే రివర్స్ అవుతుందని హెచ్చరించారు. వీరితో అగ్రెసివ్‌గా వ్యవహరించడం శ్రేయస్కరం కాదని సూచించారు. అయితే కుజుడు 12వ ఇంట్లో ఉండటం వల్ల ఈ పార్టీ నిర్ణయాల్లో కొంత తొందరపాటు తనం కూడా ఉంటుందని తెలిపారు.

రాబోయే రోజుల్లో సిజెపి ఎవరూ ఊహించని అత్యున్నత స్థాయికి చేరుకుంటుందని వేణు స్వామి ధీమా వ్యక్తం చేశారు. రాబోయే ఎన్నికల్లో గానీ, రాజకీయంలో గానీ ఒక పార్టీని అధికారంలోకి తీసుకురావాలన్నా లేదా గద్దె దించాలన్నా సిజెపి కనీసం 60 శాతం ప్రభావాన్ని చూపిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదని ఆయన వ్యాఖ్యానించారు.

55
సిజెపి నాయకులు జైలుకు..
Image Credit : Facebook/Venu Swamy

సిజెపి నాయకులు జైలుకు..

భవిష్యత్ లో సిజెపి అనేక కీలక పరిణామాలను ఎదుర్కోబోతోందని, ఈ పార్టీకి చెందిన ముగ్గురు కీలక నాయకులు జైలుకు వెళ్లే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని వేణు స్వామి అంచనా వేశారు. అలాగే ఈ పార్టీ మున్ముందు తీసుకునే కొన్ని నిర్ణయాలు లేదా నడిచే విధానాలు హిందూ ధర్మానికి వ్యతిరేకంగా వెళ్లే సూచనలు ఉన్నాయని వ్యాఖ్యానించారు. విభిన్న గ్రహ స్థితుల నడుమ పార్టీలో అనేక ఊహించని మార్పులు చోటుచేసుకుంటాయని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం సాగుతున్న నీట్ ఆందోళనల పరిణామాలు, ఈ జాతక విశ్లేషణ రెండూ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతూ చర్చనీయాంశంగా మారాయి.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
భారత దేశం
ఏషియానెట్ న్యూస్
జ్యోతిష్యం

Latest Videos
Recommended Stories
Recommended image1
Encounter: కొన‌సాగుతోన్న ఉగ్ర‌వాదుల ఏరివేత‌.. ల‌ష్క‌రే తోయిబా పాక్ క‌మాండ‌ర్ యాసిర్ హ‌తం
Recommended image2
ఇంద్రభవనాన్ని తలపించే నిర్మాణం.. నితా ముకేశ్ అంబానీ కల్చరల్ సెంటర్‌లో ఎన్ని అద్భుతాలో
Recommended image3
Government Scheme : 8వ తరగతి పాసైతే చాలు, ఫ్రీగా రూ.48000 పొందండి.. ఇందుకోసం ఏం చేయాలో తెలుసా?
Related Stories
Recommended image1
Venu Swamy: విజయ్, త్రిష విషయంలో వేణు స్వామి చెప్పిందే జరిగింది.. రెండేళ్ల ముందే బయటపెట్టాడుగా..!
Recommended image2
Venu Swamy: పవన్ కళ్యాణ్, జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల మధ్య చిచ్చు పెట్టిన వేణు స్వామి, సీఎం పోస్ట్ పై సంచలన జోస్యం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved