MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Venu Swamy: పవన్ కళ్యాణ్, జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల మధ్య చిచ్చు పెట్టిన వేణు స్వామి, సీఎం పోస్ట్ పై సంచలన జోస్యం

Venu Swamy: పవన్ కళ్యాణ్, జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల మధ్య చిచ్చు పెట్టిన వేణు స్వామి, సీఎం పోస్ట్ పై సంచలన జోస్యం

Venu Swamy: ఈమధ్య సినిమావాళ్ల జాతకాలు చెప్పడం మానేశాడు వేణు స్వామి. స్టార్స్ పర్సనల్ లైఫ్ పై వాఖ్యలు చేసి కేసలు ఫేస్ చేసిన ఆయన  కామ్ అయ్యాడు. తాజాగా మరోసారి సంచలనంగా మారాడు వేణు స్వామి. పవన్ కళ్యాణ్ , ఎన్టీఆర్ అభిమానుల మధ్య చిచ్చు పెట్టాడు. 

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Jul 08 2026, 02:58 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
సినిమా జ్యోతిష్యుడిగా పేరు..
Image Credit : facebook / venu swamy

సినిమా జ్యోతిష్యుడిగా పేరు..

తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలు, సినిమా ముచ్చట్లకు ఎంత క్రేజ్ ఉందో.. సెలబ్రిటీల జాతకాలపై వచ్చే వార్తలకు కూడా అంతే ఆదరణ ఉంటుంది. ముఖ్యంగా ప్రముఖ జ్యోతిషుడు వేణు స్వామి చెప్పే జోస్యాలు నిత్యం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారుతుంటాయి. గతంలో ఆయన చెప్పిన కొన్ని జాతకాలు నిజం కావడంతో, ఈయన చేసే వ్యాఖ్యలపై అందరిలోనూ ఆసక్తి నెలకొంటుంది. తాజాగా వేణు స్వామి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై, ముఖ్యంగా పవన్ కళ్యాణ్, జూనియర్ ఎన్టీఆర్ భవిష్యత్తుపై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతున్నాయి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
పవన్ కళ్యాణ్ కాదు.. జూనియర్ ఎన్టీఆర్!
Image Credit : Asianet News

పవన్ కళ్యాణ్ కాదు.. జూనియర్ ఎన్టీఆర్!

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కళ్యాణ్ క్రేజ్ మామూలుగా లేదు. రాబోయే రోజుల్లో ఆయనే ముఖ్యమంత్రి అవుతారని జనసైనికులు, అభిమానులు బలంగా నమ్ముతున్నారు. అయితే, వేణు స్వామి మాత్రం ఇందుకు భిన్నమైన జోస్యం చెప్పారు. "ఆంధ్రప్రదేశ్ తదుపరి ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కాదు.. భవిష్యత్తులో జూనియర్ ఎన్టీఆర్ ఆ పీఠాన్ని అధిరోహిస్తారు" అని వేణు స్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు.

35
గ్రహాల అనకూలతపై కామెంట్స్
Image Credit : facebook / venu swamy

గ్రహాల అనకూలతపై కామెంట్స్

గ్రహాల అనుకూలత, జాతక చక్రాల ప్రకారం పవన్ కళ్యాణ్‌కు కంటే జూనియర్ ఎన్టీఆర్‌కే రాజకీయంగా అత్యున్నత పదవిని చేపట్టే యోగం బలంగా ఉందని ఆయన విశ్లేషించారు. ఎన్టీఆర్ జాతకంలో రాజయోగం చాలా స్పష్టంగా కనిపిస్తోందని వేణు స్వామి అన్నారు.

45
అభిమానుల మధ్య చిచ్చు పెట్టిన వేణుస్వామి..
Image Credit : Asianet News

అభిమానుల మధ్య చిచ్చు పెట్టిన వేణుస్వామి..

వేణు స్వామి చేసిన ఈ వ్యాఖ్యలపై అటు సినీ వర్గాల్లో, ఇటు రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. పవన్ కళ్యాణ్ అభిమానులు ఈ జోస్యాన్ని కొట్టిపారేస్తుండగా, జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు మాత్రం ఈ వార్తను సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ చేస్తున్నారు. కొన్ని సందర్భాల్లో ఇద్దరు హీరోల అభిమానుల మధ్య వాగ్వాదాలు కూడా జరుగుతున్నాయి. ఎన్టీఆర్ ప్రస్తుతం సినిమాలతో బిజీగా ఉన్నప్పటికీ, భవిష్యత్తులో ఆయన రాజకీయాల్లోకి రావడం ఖాయమని, తాతకు తగ్గ మనవడిగా సీఎం కుర్చీని అధిరోహిస్తారని నందమూరి అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

55
వేణు స్వామిపై మండిపడుతున్న అభిమానులు..
Image Credit : others

వేణు స్వామిపై మండిపడుతున్న అభిమానులు..

జ్యోతిషం అనేది నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది. గతంలో వేణు స్వామి చెప్పిన కొన్ని విషయాలు తప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి. కాబట్టి, ఈ జోస్యం ఎంతవరకు నిజమవుతుందో.. భవిష్యత్తులో జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ రంగప్రవేశం చేసి ఆ స్థాయికి చేరుకుంటారో లేదో చూడాలి. ఈ విషయాన్ని మాత్రం పవన్ కళ్యాణ్ అభిమానులు ఖండిస్తున్నారు. వేణు స్వామి మళ్లీ వివాదాలు తెరపైకి తీసుకురావడంతో.. ఆయనపై కూడా ఏదైనా యాక్షన్ తీసుకుంటారా లేదా అనేది చూడాలి.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
పవన్ కళ్యాణ్
ఏషియానెట్ న్యూస్
వినోదం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Richest Bollywood Actresses: రూ.8 వేల కోట్ల ఆస్తితో టాప్‌లో జూహీ చావ్లా.. అత్యంత ధనిక హీరోయిన్లు వీళ్లే!
Recommended image2
Brahmanandam: బ్రహ్మానందం త్రిమూర్తులుగా భావించే లెజెండ్స్, ఒకరు చిరు..ఆ కమెడియన్ వల్లే బ్రహ్మి దశ తిరిగింది
Recommended image3
Bhogi Teaser: భోగి టీజర్ రివ్యూ, శర్వానంద్ మాస్ ట్రాన్స్ఫర్మేషన్..కెరీర్‌లో తొలిసారి వణుకు పుట్టించేలా
Related Stories
Recommended image1
Bigg Boss Telugu 10 : బిగ్ బాస్ టీమ్ కు షాక్ ఇచ్చిన నాగార్జున, కింగ్ మైండ్ బ్లోయింగ్ రెమ్యునరేషన్ డిమాండ్, నిజమెంత?
Recommended image2
Facts: ఎడారిలో పాత్రలను ఎలా శుభ్రం చేస్తారో తెలుసా? నీళ్లు లేకుండానే అంట్లు ఎలా క్లీన్ అవుతాయి?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved