Uttarkashi Floods: ఉత్తరకాశీలో మెరుపు వరదలు.. 10 మంది జవాన్లు గల్లంతు
Uttarkashi Floods: ఉత్తరాఖండ్‌లో క్లౌడ్ బరస్ట్ తర్వాత భారీ వరదలు వచ్చాయి. దీంతో ధరాలి గ్రామం మునిగిపోయింది. చాలా మంది గల్లంతయ్యారు. వారిలో 10 మంది ఆర్మీ జవాన్లు కూడా ఉన్నారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

ఉత్తరకాశీలో క్లౌడ్ బరస్ట్.. నీటమునిగిన ధరాలి గ్రామం
ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని ఉత్తరకాశీ జిల్లాలోని ధరాలి గ్రామాన్ని మంగళవారం (ఆగస్టు 5న) ఉదయం భారీ వరదలు ముంచెత్తాయి. దీనికి ప్రధాన కారణం క్లౌడ్ బరస్ట్ (Cloudburst).. దీంతో తీవ్రంగా నష్టపోయింది. కీర్ గంగా నదీ ప్రవాహం అనూహ్యంగా పెరిగి, భారీ వరదలుగా మారింది.
వరద ప్రవాహంతో గ్రామం మొత్తాన్ని మట్టితో కూడిన బురద నీరు ముంచెత్తింది. హోటళ్ళు, రహదారులు, ఇండ్లు కొట్టుకుపోయాయి. ఎన్నో ఇళ్లు కుప్పకూలిపోయాయి. శిథిలాల కింద చిక్కుకున్నవారిని బయటికి తీయడానికి సహాయక బృందాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి.
Uttarkashi Cloudburst Raw Visuals: ఉత్తరకాశీ జిల్లాలో ఆకస్మిక వరదలతో విరిగిపడిన కొండచరియలు
దాదాపు 50 మంది గల్లంతు
సహాయక చర్యలు చేపట్టిన NDRF, SDRF బృందాలు | Asianet News Telugu#uttarakhand#cloudburst#uttarakashi#floods#heavyrain#AsianetNewsTelugupic.twitter.com/qrwEjEOqHF— Asianetnews Telugu (@AsianetNewsTL) August 5, 2025
KNOW
ఉత్తరకాశీలో ఆర్మీ క్యాంప్ ధ్వంసం.. 10 మంది జవాన్లు గల్లంతు
ధరాలి సమీపంలోని హర్షిల్ ప్రాంతంలో ఉన్న ఇండియన్ ఆర్మీ క్యాంప్ కూడా వరదల ధాటికి పూర్తిగా ధ్వంసమైంది. ఈ ఘటనలో జేసీవో (JCO) సహా మొత్తం 10 మంది ఆర్మీ సిబ్బంది గల్లంతయ్యారు. ఈ విషయాన్ని అధికారులు ధృవీకరించారు. వారికి సంబంధించి వెతుకులాట కొనసాగుతోంది. కొన్ని నివేదికల ప్రకారం, ఆర్మీ బేస్‌లో ఉన్న సామగ్రి కూడా పూర్తిగా దెబ్బతిన్నది.
🛑 धराली बाढ़- अपडेट🛑
अतिवृष्टि के कारण उत्तरकाशी जनपद के हर्षिल क्षेत्रान्तर्गत खीर गाड़ का जलस्तर अचानक बढ़ जाने से धराली में नुकसान की सूचना।
पुलिस, एसडीआरएफ, आर्मी सहित समस्त आपदा प्रबंधन टीमें घटनास्थल हेतु त्वरित राहत एवं बचाव कार्य हेतु रवाना। pic.twitter.com/SjlYYbo7ok— SDRF Uttarakhand Police (@uksdrf) August 5, 2025
యుద్ధప్రాతిపదికన కొనసాగుతున్న సహాయక చర్యలు
వరదల సమాచారం అందిన వెంటనే రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర హోంశాఖ, ఆర్మీ, NDRF, SDRF, ITBP బృందాలు రంగంలోకి దిగాయి. SDRF బృందాలు ముందుగా 60 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించాయి.
ఇండియన్ ఎయిర్ ఫోర్స్ (Indian Air Force) హెలికాప్టర్లను స్టాండ్ బై లో ఉంచారు. ఐటీబీపీ ప్రత్యేక బృందాలు కూడా 50 మందిని రక్షించాయి. సహాయక చర్యలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి.
20 మందిని కాపాడిన ఆర్మీ
14 Raj Rif బెటాలియన్‌కి చెందిన ఆర్మీ జవాన్లు తమ ప్రాణాలను పణంగా పెట్టి దాదాపు 20 మందిని రక్షించారు. తీవ్రమైన వర్షపు మధ్య, కొట్టుకుపోతున్న ప్రజలను భద్రతా ప్రాంతాలకు చేర్చడంలో వీరు ప్రాణాలకు తెగించి పని చేశారు. దీనికి సంబంధించిన దృశ్యాలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
#MudslideReliefOperations#HADR
Update: 📍 Landslide at Dharali, Uttarakhand
05 August 2025
A landslide struck near Dharali village, approximately 4 km from the Indian Army Camp at Harshil, at around 1:45 PM today.
Responding with urgency, the #IndianArmy swiftly mobilised… pic.twitter.com/e8QajmsvFr— ADG PI - INDIAN ARMY (@adgpi) August 5, 2025
ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి ఏమన్నారంటే?
ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ.. అన్ని సహాయక బృందాలూ యుద్ధ స్థాయిలో పనిచేస్తున్నాయని తెలిపారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా, పరిస్థితిపై ప్రత్యక్ష సమాచారం తీసుకొని, వెంటనే అదనపు బృందాల్ని మోహరించారు.
उत्तराखंड के धराली (उत्तरकाशी) में फ्लैश फ्लड की घटना को लेकर उत्तराखंड के मुख्यमंत्री से बात कर घटना की जानकारी ली। ITBP की निकटतम 3 टीमों को वहाँ भेज दिया गया है, साथ ही NDRF की 4 टीमें भी घटनास्थल के लिए रवाना कर दी गई हैं, जो शीघ्र पहुँच कर बचाव कार्य में लगेंगी।
— Amit Shah (@AmitShah) August 5, 2025
ప్రధాని మోడీ ఈ ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేసి, అవసరమైన సహాయాన్ని ప్రకటించారు. హర్షిల్‌లోని ఆర్మీ ఆసుపత్రిలో గాయపడిన బాధితులకు చికిత్స అందిస్తున్నారు. ధరాలి గ్రామంలో క్లౌడ్ బరస్ట్ తీసుకొచ్చిన వరద విధ్వంసం.. అక్కడి ప్రజల జీవితాలను ఒక్కసారిగా శూన్యంలోకి నెట్టేసింది. ఈ ఘోర విపత్తు దృశ్యాలు వైరల్ గా మారాయి.
उत्तराखंड में जल प्रलय 😭🙏
भगवान रहम करो, तरस खाओ सृष्टि पर 🙏#Uttrakhand#uttarakashipic.twitter.com/8Y1YQIUQVi— Pooran singh (@Bharangar320) August 5, 2025