MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • National
  • ఈ రోజు మీరు తప్పకుండా తెలుసుకోవాల్సిన విషయాలు ఇవి

ఈ రోజు మీరు తప్పకుండా తెలుసుకోవాల్సిన విషయాలు ఇవి

Today Top 5 News : మీరు ఇవాళ్టి టాప్ న్యూస్ ఒకేచోట తెలుసుకోవాలని అనుకుంటున్నారా? మీకోసమే తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్, నేషనల్ , ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ లో టాప్ 5 వార్తలు ఇక్కడ అందిస్తున్నాం.

2 Min read
Mahesh Rajamoni
Published : Sep 19 2025, 06:52 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
తెలంగాణ రైజింగ్ 2047 లక్ష్యం వైపు దూసుకెళ్తోంది: సీఎం రేవంత్
Image Credit : Asianet News

తెలంగాణ రైజింగ్ 2047 లక్ష్యం వైపు దూసుకెళ్తోంది: సీఎం రేవంత్

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో జరిగిన పబ్లిక్ ఎఫైర్స్ ఫోరం ఆఫ్ ఇండియా (PAFI) 12వ వార్షిక సమావేశంలో మాట్లాడుతూ..  రాష్ట్ర అభివృద్ధి దిశగా ‘తెలంగాణ రైజింగ్ 2047’ లక్ష్యాన్ని వివరించారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఒక కోటి జనాభా ఉన్నందున మౌలిక సదుపాయాలు పెంపుదల అవసరమని చెప్పారు. మెట్రో రైలును 70 నుంచి 150 కిలోమీటర్లకు విస్తరించి, రోజువారీ ప్రయాణికులను 15 లక్షలకు పెంచుతామని తెలిపారు. 

మూసీ నదిని సబర్మతి తరహాలో అభివృద్ధి చేస్తామని, కాలుష్య పరిశ్రమలను బయటకు తరలించి ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహిస్తున్నామని చెప్పారు. ఫ్యూచర్ సిటీ, బుల్లెట్ రైలు వంటి ప్రాజెక్టులతో పాటు గ్రామీణ వ్యవసాయాన్ని బలోపేతం చేస్తామని పేర్కొన్నారు. 2047 కల్లా మూడు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తెలంగాణ ఎదగాలన్నదే లక్ష్యమని వివరించారు.

అలాగే, కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, సంతోష్ రావు కలిసి కల్వకుంట్ల కవితను బయటకు పంపారని అన్నారు.  కుటుంబంలోని ఆస్తి తగాదాలు దీనికి కారణమంటూ వ్యాఖ్యలు చేశారు. తాను ఎవరికి సపోర్ట్ చేయడం లేదనీ, కవితను కాంగ్రెస్ లోకి తీసుకునేది లేదని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు.

25
పవన్ కళ్యాణ్ ఫైర్
Image Credit : Youtube/Mega Surya Production

పవన్ కళ్యాణ్ ఫైర్

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో శుక్రవారం ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. టీడీపీ నేత బోండా ఉమ, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై విమర్శలు చేశారు. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు చైర్మన్‌ పీ. కృష్ణయ్యను ఎంఎల్ఏ లేఖలను నిర్లక్ష్యం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. కృష్ణయ్యను కలవాలంటే పవన్‌ను సంప్రదించాలంటూ వ్యాఖ్యలు చేశారు. 

దీనిపై పవన్ తనదైన శైలిలో స్పందించారు. తాను అందుబాటులో లేరనడం తప్పుడు అభిప్రాయమని స్పష్టం చేశారు. పీసీబీ పనితీరు పరిశ్రమలతో ముడిపడి ఉందని, కృష్ణయ్య బాధ్యతలు చేపట్టిన తర్వాతే ప్రజల ప్రశ్నలకు సమాధానాలు మొదలయ్యాయని పేర్కొన్నారు. కాలుష్య నియంత్రణలో ప్రభుత్వం, అధికారులు, ప్రజలు కూడా భాగస్వాములు కావాలని పవన్ సూచించారు.

Related Articles

Related image1
కేసీఆర్ కుటుంబ విభేదాలు : కవిత పై సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు
Related image2
ఆసియా కప్ 2025 సూపర్-4 షెడ్యూల్ ఇదే.. భారత్-పాకిస్తాన్ మ్యాచ్ ఎప్పుడు?
35
ఎయిర్ చీఫ్ మార్షల్ అమర్ ప్రీత్ సింగ్ కీలక వ్యాఖ్యలు
Image Credit : PTI

ఎయిర్ చీఫ్ మార్షల్ అమర్ ప్రీత్ సింగ్ కీలక వ్యాఖ్యలు

బాలాకోట్‌ దాడుల సమయంలో ఉపగ్రహ చిత్రాల్లో స్పష్టత లేకపోవడంతో ప్రశ్నలు ఎదుర్కొన్నామని ఎయిర్ చీఫ్ మార్షల్ అమర్ ప్రీత్ సింగ్ అన్నారు. అయితే, హ్యూమన్‌ ఇంటెలిజెన్స్‌ ద్వారా వివరాలు తెలిశాయని తెలిపారు. అయితే ఆపరేషన్‌ సింధూర్  పూర్తిస్థాయి రాజకీయ మద్దతుతో, త్రివిధ దళాలు, ఏజెన్సీల సమన్వయంతో పక్కా ప్రణాళికతో జరిగినదని పేర్కొన్నారు. మురిద్కేలో లష్కరే స్థావరం భారీగా దెబ్బతిందని, ఆయుధ సామర్థ్యంపై సందేహాలున్నవారు ఆ భవనంపై ఏర్పడిన రంధ్రాలను చూసి అర్థం చేసుకోవచ్చని స్పష్టం చేశారు.

45
నరేంద్ర మోదీ - డొనాల్డ్ ట్రంప్ భేటీ
Image Credit : Getty

నరేంద్ర మోదీ - డొనాల్డ్ ట్రంప్ భేటీ

ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ వచ్చే నెల మలేసియాలో జరగనున్న ఆసియాన్‌ శిఖరాగ్ర సదస్సు సందర్భంగా భేటీ అయ్యే అవకాశముందని రిపోర్టులు పేర్కొంటున్నాయి. ఆపరేషన్‌ సింధూర్ తరువాత ఇరువురి మధ్య ఇది తొలి సమావేశం కానుండటంతో ఆసక్తి నెలకొంది. 

ట్రంప్‌ ఇటీవల మలేసియా పర్యటనకు వస్తున్నట్లు ఆ దేశ ప్రధాని అన్వర్‌ ఇబ్రహీంకు ఫోన్‌లో తెలిపారని స్థానిక మీడియా తెలిపింది. అయితే ఈ భేటీపై భారత్‌, అమెరికా ప్రభుత్వాల నుంచి అధికారిక ప్రకటన ఇంకా రాలేదు. ఇటీవల మోదీ పుట్టినరోజు సందర్భంగా ట్రంప్‌ ఫోన్‌ చేసి శుభాకాంక్షలు తెలిపిన విషయం తెలిసిందే. దీంతో వీరి భేటీ ఉంటుందనే చర్చ సాగుతోంది.

55
ఆసియా కప్ లో మరోసారి భారత్ vs పాకిస్తాన్ పోరు
Image Credit : X/ Baba Umar

ఆసియా కప్ లో మరోసారి భారత్ vs పాకిస్తాన్ పోరు

ఆసియా కప్ 2025 భారత్, పాకిస్తాన్ జట్లు మరోసారి తలపడున్నాయి. ఇప్పటికే గ్రూప్ దశలో పోటీ పడ్డాయి. పాకిస్తాన్ ను భారత్ చిత్తుగా ఓడించింది. ఇప్పుడు ఈ రెండు జట్లు సూపర్ 4 కు అర్హత సాధించాయి. దీంతో సెప్టెంబర్ 21న దుబాయ్ వేదికగా భారత్, పాకిస్తాన్ లు మరోసారి తలపడనున్నాయి.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
తెలంగాణ
ఆంధ్ర ప్రదేశ్
భారత దేశం
ప్రపంచం
క్రీడలు
క్రికెట్
రోజు వారీ ప్రధాన వార్తలు
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Related Stories
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved