MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Bigg Boss Telugu 10
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Telangana
  • కేసీఆర్ కుటుంబ విభేదాలు : కవిత పై సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

కేసీఆర్ కుటుంబ విభేదాలు : కవిత పై సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Telangana CM Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో పబ్లిక్ ఎఫైర్స్ ఫోరం ఆఫ్ ఇండియా (PAFI) 12వ వార్షిక సదస్సులో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్సీ కవిత - కేసీఆర్ కుటుంబ అంతర్గత తగాదాలు, తెలంగాణ అభివృద్ధి ప్రణాళికలపై సీఎం మాట్లాడారు.

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Sep 19 2025, 05:47 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
కవితను ఆ నలుగురే బయటకు పంపారు : సీఎం రేవంత్ రెడ్డి
Image Credit : Asianet News

కవితను ఆ నలుగురే బయటకు పంపారు : సీఎం రేవంత్ రెడ్డి

Telangana CM Revanth Reddy: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దేశరాజధాని ఢిల్లీలో జరిగిన పబ్లిక్ ఎఫైర్స్ ఫోరం ఆఫ్ ఇండియా (PAFI) 12వ వార్షిక సమావేశంలో మాట్లాడుతూ.. మాజీ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కేసీఆర్) కుటుంబంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. 

కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, సంతోష్ రావు కలిసి కల్వకుంట్ల కవితను బయటకు నెట్టేశారని ఆయన అన్నారు. కుటుంబంలోని ఆస్తి పంచుకోవడమే ఈ విభేదాలకు కారణమంటూ వ్యాఖ్యలు చేశారు. తాను ఎవరికి సపోర్ట్ చేయడం లేదనీ, ఇది పూర్తిగా వారి వ్యక్తిగత సమస్య అని రేవంత్ చెప్పారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
కవితపై రాజకీయ వైఖరి రేవంత్ ఎమన్నారంటే?
Image Credit : X/Kalvakuntla Kavitha

కవితపై రాజకీయ వైఖరి రేవంత్ ఎమన్నారంటే?

కల్వకుంట్ల కవిత కాంగ్రెస్ పార్టీలోకి వస్తానంటే వ్యతిరేకిస్తానని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. గతంలో తన కుటుంబ కార్యక్రమానికి కవిత అడ్డుపడ్డారని గుర్తు చేశారు. కేసీఆర్ కుటుంబం ప్రజల నుండి సామాజిక బహిష్కరణకు గురైందని ఆయన వ్యాఖ్యానించారు. ఉద్యమం పేరుతో యువతను మోసం చేశారని విమర్శించారు. ఇప్పుడు అదే కుటుంబంలో విభేదాలు తలెత్తాయని పేర్కొన్నారు.

35
తెలంగాణ రైజింగ్ 2047
Image Credit : X/Revanth Reddy

తెలంగాణ రైజింగ్ 2047

‘తెలంగాణ రైజింగ్ 2047’ లక్ష్యంతో రాష్ట్రాన్ని సుస్థిర అభివృద్ధి మార్గంలో తీసుకెళ్లేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్ నగరానికి ఆధునిక రవాణా సదుపాయాలు అవసరమని, ప్రస్తుతం ఉన్న 70 కిలోమీటర్ల మెట్రోను 150 కిలోమీటర్లకు విస్తరించాలనేది లక్ష్యమని చెప్పారు. రోజుకు 5 లక్షల మంది ప్రయాణిస్తున్న మెట్రో రైలులో రాబోయే ఐదేళ్లలో 15 లక్షల ప్రయాణికులు ఉండేలా ప్రణాళికలు రూపొందించారని వివరించారు.

45
తెలంగాణ రవాణా, పర్యావరణం, భవిష్యత్ ప్రాజెక్టులు
Image Credit : ANI

తెలంగాణ రవాణా, పర్యావరణం, భవిష్యత్ ప్రాజెక్టులు

హైదరాబాద్ చుట్టూ రీజినల్ రింగ్ రోడ్డును నిర్మిస్తామన్నారు. హైదరాబాద్-బెంగళూరు మధ్య బుల్లెట్ రైలు ఏర్పాటు ప్రతిపాదన ఉందని ఆయన తెలిపారు. మూసీ నదిని సబర్మతి మాదిరిగా పునరుద్ధరించడానికి మూసీ రివర్‌ఫ్రంట్ కార్పొరేషన్‌ను ఏర్పాటు చేశామని చెప్పారు. కాలుష్యాన్ని తగ్గించేందుకు కాలుష్యకారక పరిశ్రమలను నగరానికి దూరంగా తరలించి, ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహిస్తామని పేర్కొన్నారు.

55
తెలంగాణ ఆర్థిక, భద్రతా రంగ ప్రణాళికలు
Image Credit : ANI

తెలంగాణ ఆర్థిక, భద్రతా రంగ ప్రణాళికలు

రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను 2034 నాటికి ఒక ట్రిలియన్ డాలర్లకు, 2047 నాటికి మూడు ట్రిలియన్ డాలర్లకు పెంచడమే ప్రధాన లక్ష్యమని సీఎం చెప్పారు. దేశ జీడీపీలో 10 శాతం తెలంగాణ నుంచే రావాలని ఆశాభావం వ్యక్తం చేశారు. మాదక ద్రవ్యాల నియంత్రణలో ‘ఈగల్ స్క్వాడ్’ సమర్థవంతంగా పనిచేస్తోందని, తాజాగా విడుదలైన ర్యాంకింగ్‌లో తెలంగాణ పోలీస్ దేశంలోనే నంబర్ వన్‌గా నిలిచిందని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
తెలంగాణ
హైదరాబాద్
అనుముల రేవంత్ రెడ్డి
కల్వకుంట్ల కవిత
రాజకీయాలు
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Bank Holidays : సెప్టెంబర్ 25 నుంచి 30 వరకు బ్యాంకులు బంద్‌.. ఏరోజు, ఎందుకు సెలవు?
Recommended image2
Farmer ID: రైతులకు బిగ్ అలర్ట్.. పీఎం కిసాన్, రైతు భరోసా ఆగిపోవద్దంటే వెంటనే ఇలా చేయండి
Recommended image3
Heavy Rains Alert: బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం.. ఈ ప్రాంతాల్లో వారం రోజులు వర్షాలే వర్షాలు
Related Stories
Recommended image1
Revanth Reddy: 2027 నాటికి ఆ స‌ర్వీసులు, నెట్ జీరో సిటీగా హైద‌రాబాద్‌.. రేవంత్ కీల‌క వ్యాఖ్యలు
Recommended image2
Pawan Kalyan: అసెంబ్లీలో TDP Vs జనసేనాని. అదిరిపోయే సమాధానమిచ్చిన పవన్ కళ్యాణ్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved