MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • National
  • Thalapathy Vijay : పాస్ మార్కులు రాకున్నా స్టేట్ టాపర్.. టివికే విజయ్ విజయం ఇలాంటిదే..!

Thalapathy Vijay : పాస్ మార్కులు రాకున్నా స్టేట్ టాపర్.. టివికే విజయ్ విజయం ఇలాంటిదే..!

తమిళనాడు ఎన్నికల పలితాల తర్వాత దళపతి విజయ్ పేరు దేశవ్యాప్తంగా మారుమోగుతోంది. ఆయన సాధించిన విజయం అలాంటిది. అయితే TVK 108 సీట్లు సాధించడం ఓకే… కానీ ఆ పార్టీ సాధించిన ఓట్లు ఎన్నో తెలుసా..? పాస్ మార్కుల స్థాయిలో కూడా రాలేవా..? 

2 Min read
Author : Arun Kumar P
Published : May 05 2026, 12:18 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
మ్యాజిక్ ఫిగర్ లేకున్నా విజయ్ సీఎం.!
Image Credit : Gemini AI

మ్యాజిక్ ఫిగర్ లేకున్నా విజయ్ సీఎం.!

TVK Vijay : తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఊహకందని ఫలితాలు వెలువడ్డాయి... దళపతి విజయ్ అద్భుత విజయాన్ని అందుకున్నారు. అధికారి డిఎంకే (ద్రవిడ మున్నేట్ర కజగం), ప్రతిపక్ష అన్నా డిఎంకే (AIADMK) ను కాదని తమిళ ప్రజలు ఈసారి సరికొత్త తీర్పు ఇచ్చారు. మొదటిసారి ఎన్నికల్లో పోటీచేసిన విజయ్ పార్టీ TVK (తమిళగ వెట్రి కళగం) అత్యధిక సీట్లు సాధించి అతిపెద్ద పార్టీగా అవతరించింది. సింగిల్ గానే మ్యాజిక్ ఫిగర్ కు అత్యంత చేరువగా సీట్లు సాధించింది టివికే... ప్రభుత్వ ఏర్పాటుకు సిద్దమయ్యింది.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
25
TVK ఓట్ షేర్ ఎంతో తెలుసా..?
Image Credit : Chat gpt

TVK ఓట్ షేర్ ఎంతో తెలుసా..?

తమిళ సినిమాల్లో స్టార్ హీరోగా గుర్తింపుపొందిన విజయ్ రాజకీయాల్లోనూ స్టార్ గా మారాడు... ఎన్టీఆర్, ఎంజిఆర్ మాదిరిగా సినిమాల నుండి రాజకీయాల్లోకి వచ్చి అతి తక్కువ సమయంలోనే విజయం సాధించాడు. మొత్తం 234 అసెంబ్లీ స్థానాల్లో విజయ్ పార్టీ TVK 108 సీట్లు సాధించింది.

ఈ ఎన్నికల్లో టివికే ఓట్ షేర్ 34.92. పోలైన ఓట్లు 100 శాతం అనుకుంటే విజయ్ పార్టీకి వచ్చింది 35 శాతం ఓట్లే. ఇంకా చెప్పాలంటే మొత్తం పోలైన ఓట్లలో టివికెకు 17226209 ఓట్లు వచ్చాయి. కానీ సాధించిన సీట్లు మాత్రం చాలా ఎక్కువ. చాలాచోట్ల టివికె స్వల్ప మెజారిటీతో విజయం సాధించిందని ఈ లెక్కలను బట్టి అర్థమవుతోంది.

Related Articles

Related image1
TVK Vijay : సీఎంగా విజయ్ తొలి సంతకం దానిపైనేనా..?
Related image2
TVK Vijay: పెళ్లిలో విజయ్‌కి దారుణమైన అవమానం, దళపతికి రాజకీయ బీజం.. స్టాలిన్‌ కొంపముంచింది ఇదే
35
DMK, AIADMK ఓట్ షేర్ ఎంత..?
Image Credit : X/ TVKPartyHQ

DMK, AIADMK ఓట్ షేర్ ఎంత..?

తమిళనాడులో 5 కోట్లకు పైగా ఓటర్లున్నారు... వీరిలో ఈ అసెంబ్లీ ఎన్నికల్లో 85 శాతం మంది ఓటుహక్కును వినియోగించుకున్నారు. వీరిలో అత్యధికమంది తమిళ వెట్రి కళగం పార్టీకి ఓటు వేశారు... ఆ పార్టీకి 35 శాతం ఓట్ షేర్, 108 సీట్లు వచ్చాయి.

ఇక అధికార డిఎంకే, ప్రధాన ప్రతిపక్షం అన్నా డిఎంకేకు ఎదురుదెబ్బ తగిలింది. ఈ ఎన్నికల్లో డిఎంకే ఓట్ షేర్ 24 శాతం... సాధించిన ఓట్లు 11929144. అంటే TVK కంటే 10 శాతం తక్కువ ఓట్లు వచ్చాయన్నమాట. ఇక AIADMK కు 21.21 శాతం ఓట్ షేర్... 10462146 ఓట్లు వచ్చాయి. ఇలా డిఎంకే, అన్నా డిఎంకే మధ్య ఓట్ షేర్, సాధించిన ఓట్లలో పెద్దగా తేడా లేదు... కానీ 10 శాతం ఓట్ షేర్, 52 లక్షలకు పైగా ఓట్ల తేడాతో టివికే సూపర్ విక్టరీ సాధించింది… అధికారాన్ని కైవసం చేసుకునేందుకు సిద్దమయ్యింది.

45
తమిళనాడులో ఏ పార్టీకి ఎన్నిసీట్లు..?
Image Credit : ANI

తమిళనాడులో ఏ పార్టీకి ఎన్నిసీట్లు..?

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ పార్టీ టివికే 108 స్థానాలతో అతిపెద్ద పార్టీగా అవతరించింది. ఇక డిఎంకే 59, అన్నా డిఎంకే 47 సీట్లు సాధించాయి. ఏ పార్టీకి 50 శాతం సీట్లు రాలేవు... అంటే మ్యాజిక్ ఫిగర్ 118 సీట్లు సాధించలేకపోయాయి... దీంతో హంగ్ పరిస్థితి ఏర్పడింది. ఈ క్రమంలో సింగిల్ గా ఏ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసే అవకాశం లేదు...టివికే అధికారానికి 10 సీట్ల దూరంలో నిలిచింది... కాబట్టి ఇతర పార్టీలతో కలవాల్సిందే.

తమినాడు లో కాంగ్రెస్ 5, పిఎంకె 4, సిపిఐ 2, సిపిఎం 2 స్థానాలు సాధించాయి. ఇక ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ పార్టీ 2, విసికే 2, బీజేపీ 1, డీఎండికే 1, అమ్మ మక్కల్ పార్టీ 1 చోట్ల విజయం సాధించాయి. ఈ పార్టీల్లో కొన్నింటితో కలిసి టివికే మ్యాజిక్ సాధిస్తుందని.... సొంతంగానే ప్రభుత్వాన్ని ఏర్పాటుచేస్తుందనే ప్రచారం సాగుతోంది. మరి టివికే అధినేత విజయ్ ఏ నిర్ణయం తీసుకుంటారో చూడాలి.

55
టివికే ప్రభుత్వ ఏర్పాటుకు సన్నాహాలు..
Image Credit : X/ TVKPartyHQ

టివికే ప్రభుత్వ ఏర్పాటుకు సన్నాహాలు..

ఇప్పటికే టివికే ప్రధాన కార్యాలయం పనయూరు వద్ద విజయ్ అభిమానులు సందడి నెలకొంది. తమిళనాడు నలుమూలల నుంచి టివికే నాయకులు, కార్యకర్తలు తరలివస్తున్నారు. ఇవాళ (మంగళవారం) విజయ్ పార్టీ కార్యాలయానికి రానున్న నేపథ్యంలో ఈ సందడి నెలకొంది.

ఇప్పటికే తమిళనాడు గవర్నర్ కు విజయ్ లేఖ రాసినట్లు తెలుస్తోంది. రెండు వారాల్లో ప్రభుత్వం ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలని ఆయన గవర్నర్ ను కోరారు. మెజారిటీ నిరూపించుకునేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు గవర్నర్ కు ఈ లేఖ ద్వారా తెలిపారు. టివికే గెలుపొందిన ఎమ్మెల్యేలతో భేటీ కానున్న విజయ్ ఎలా ముందుకు వెళ్లాలన్నదానిపై నిర్ణయం తీసుకోనున్నారు.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
టీవీకే విజయ్
రాజకీయాలు
భారత దేశం
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్

Latest Videos
Recommended Stories
Recommended image1
Snake: కోబ్రా కాటేసినా నో టెన్షన్.. ఈ కన్నీళ్లు మీ ప్రాణాలు కాపాడతాయి.. అసలు మ్యాటర్ ఇదీ!
Recommended image2
Gold: ప్రపంచంలోనే అత్యధిక బంగారం ఉన్న దేశం ఏదో తెలుసా? ఆ నంబర్ చూస్తే షాకవుతారు !
Recommended image3
Now Playing
కేరళ సీఎంగా వి.డి. సతీశన్ ప్రమాణ స్వీకారం | Kerala New CM Swearing-In Ceremony | Asianet News Telugu
Related Stories
Recommended image1
TVK Vijay : సీఎంగా విజయ్ తొలి సంతకం దానిపైనేనా..?
Recommended image2
TVK Vijay: పెళ్లిలో విజయ్‌కి దారుణమైన అవమానం, దళపతికి రాజకీయ బీజం.. స్టాలిన్‌ కొంపముంచింది ఇదే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved