MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • National
  • TVK Vijay : సీఎంగా విజయ్ తొలి సంతకం దానిపైనేనా..?

TVK Vijay : సీఎంగా విజయ్ తొలి సంతకం దానిపైనేనా..?

Telangana Assembly Election Results 2026 : ఎన్నికల ప్రచారంలో దళపతి విజయ్  ప్రజలకు అనేక హామీలు ఇచ్చారు. ఇప్పుడు TVK పార్టీయే అధికారం చేపట్టేలా కనిపిస్తోంది. మరి విజయ్ సీఎం కాగానే తొలి సంతకం ఏ ఫైలుపై ఉంటుందో తెలుసా..?

2 Min read
Author : Arun Kumar P
| Updated : May 04 2026, 04:24 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
విజయ్ సీఎం కాగానే ఏం చేస్తారు..?
Image Credit : Gemini AI

విజయ్ సీఎం కాగానే ఏం చేస్తారు..?

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో నటుడు విజయ్ 'తమిళగ వెట్రి కళగం' (TVK) పార్టీ కొత్త అధ్యాయాన్ని సృష్టించింది. టీవీకే ఇప్పుడు రాష్ట్రంలో ఒక పెద్ద రాజకీయ శక్తిగా ఎదుగుతోంది... స్థాపించిన రెండేళ్లలోనే అధికారాన్ని చేజిక్కించుకోబోతోంది. ఈ క్రమంలోపార్టీ అధ్యక్షుడు విజయ్ ముఖ్యమంత్రి అయితే 'తొలి సంతకం' దేనిపై ఉంటుందనే దానిపై ప్రజల్లో ఆసక్తి పెరిగింది. ఎన్నికల హామీల్లో అందరి దృష్టిని ఆకర్షించింది ఏడాదికి 6 ఉచిత సిలిండర్ల పథకమే. ఈ ఫైలుపైనే ఆయన తొలి సంతకం చేసే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

24
విజయ్ హయాంలో మహిళకు పండగే..
Image Credit : Gemini AI

విజయ్ హయాంలో మహిళకు పండగే..

ఎన్నికల ప్రచారంలో విజయ్ ఇచ్చిన హామీల్లో గృహిణులకు బాగా కనెక్ట్ అయింది ఈ సిలిండర్ పథకమే. గ్యాస్ ధరల పెరుగుదలతో ఇబ్బంది పడుతున్న పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఇది పెద్ద ఊరటనిస్తుందని భావిస్తున్నారు. రాజకీయాల్లో కొత్త మార్పు తీసుకురావాలని విజయ్ కోరుకుంటున్నందున తన మొదటి సంతకంగా ఏడాదికి 6 ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకాన్ని లేదా మహిళలకు నెలకు రూ.2,500 సాయం అందించే పథకాన్ని ఎంచుకుంటారని అంచనా వేస్తున్నారు.

టీవీకే ఎన్నికల మేనిఫెస్టోలో మహిళలు, యువత, రైతుల కోసం పలు పథకాలు ఉన్నాయి. పేద కుటుంబాలకు చెందిన మహిళల వివాహానికి 8 గ్రాముల బంగారం, పట్టుచీర… ఆడపిల్లల రక్షణ, విద్యాభివృద్ధికి ప్రత్యేక పొదుపు పథకాలు టివికే మేనిఫెస్టోలో ఉన్నాయి. ఇక ప్రస్తుతం వృద్ధులు, వితంతువులు, వికలాంగులకు అందిస్తున్న పెన్షన్ ను పెంచనున్నట్లు టివికే తెలిపింది. ఈ పెన్షన్‌ను నెలకు రూ.3,000కు చేస్తామని హామీ ఇచ్చింది.

Related Articles

Related image1
TVK Vijay : విజయ్ ను గెలిపించింది వీళ్లే..!
Related image2
Thalapathy Vijay : అసలు TVK లో T అంటే ఏమిటి..?
34
యువతకు టివికే వరాలు..
Image Credit : X/ TVKPartyHQ

యువతకు టివికే వరాలు..

యువ ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు కీలక ప్రకటనలు చేసింది టివికే. ప్రతి కాలేజీ విద్యార్థికి అండర్ గ్రాడ్యుయేట్ నుంచి డాక్టోరల్ స్టడీస్ వరకు చదువుకోవడానికి రూ.20 లక్షల వరకు పూచీకత్తు లేని విద్యా రుణాలు ఇవ్వనున్నట్లు ప్రకటించింది. ఇక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సహాయంతో ఉచితంగా పోటీ పరీక్షలకు కోచింగ్ అందిస్తామని విజయ్ పార్టీ తెలిపింది.

ఎంప్లాయ్‌మెంట్ ఆఫీసుల్లో రిజిస్టర్ చేసుకున్న ప్రతి గ్రాడ్యుయేట్‌కు నెలకు రూ.5,000 అందిస్తామని టివికే ప్రకటించింది. గ్రాడ్యుయేట్లకు నెలకు రూ.10,000, ఐటీఐ, డిప్లొమా హోల్డర్లకు నెలకు రూ.8,000 స్టైఫండ్‌తో ఏటా 5 లక్షల ఇంటర్న్‌షిప్‌లు కల్పిస్తామని హామీ ఇచ్చింది.

1 నుంచి 12వ తరగతి వరకు ప్రభుత్వ, ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలల్లో చదివే ప్రతి చిన్నారి తల్లికి ఏటా రూ.15,000 ఇస్తామని ప్రకటించింది. మహిళల స్వయం సహాయక సంఘాలకు (SHGs) రూ.5 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు అందిస్తామని టివికే చీఫ్ విజయ్ తెలిపారు. ఇలా చదువుకునే విద్యార్థులు, ఉద్యోగాల కోసం ఎదురుచూసే యువతపై వరాలు కురిపించారు విజయ్. 

44
TVK శ్రేణుల సంబరాలు..
Image Credit : Gemini AI

TVK శ్రేణుల సంబరాలు..

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో టివికే పార్టీ 234 స్థానాల్లో పోటీచేసింది... ఇందులో 100 కు పైగా స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. అత్యధిక స్థానాలను దక్కించుకునే అవకాశాలుండటంతో ఈ పార్టీ కార్యాలయం ముందు కార్యకర్తలు సముద్రంలా పోటెత్తి నినాదాలు, డ్యాన్సులు చేస్తూ సంబరాలు చేసుకుంటున్నారు. రాష్ట్రవ్యాప్తంగా టీవీకే కార్యకర్తలు విజయ్ 'విజిల్ పోడు' పాటను ప్లే చేస్తూ సంబరాలు చేసుకుంటున్నారు. విజయ్ కూడా పోటీచేసిన రెండు స్థానాల్లో ఘన విజయం దిశగా దూసుకెళుతున్నారు.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
టీవీకే విజయ్
రాజకీయాలు
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Elections: ఎన్నికల్లో గెలిచిన ఎమ్మెల్యేలకు మొదటి రోజు నుంచే జీతం ఇస్తారా.? రూల్స్ ఏంటి.?
Recommended image2
Thalapathy Vijay : అసలు TVK లో T అంటే ఏమిటి..?
Recommended image3
Thalapathy Vijay Trisha: త్రిష ఎమ్మెల్యే కానున్నారా.? మంత్రి ప‌ద‌వి కూడా.? ఆస‌క్తిక‌ర చ‌ర్చ
Related Stories
Recommended image1
TVK Vijay : విజయ్ ను గెలిపించింది వీళ్లే..!
Recommended image2
Thalapathy Vijay : అసలు TVK లో T అంటే ఏమిటి..?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved