MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
Ameer Log Movie Review
WTC Qualification Scenario
Sowcar Janaki
Agnipariksha Season 2
Telangana Air Pollution
Indian Diaspora in USA
Telangana Cinema Ticket Prices
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
  • Home
  • Entertainment
  • TVK Vijay: పెళ్లిలో విజయ్‌కి దారుణమైన అవమానం, దళపతికి రాజకీయ బీజం.. స్టాలిన్‌ కొంపముంచింది ఇదే

TVK Vijay: పెళ్లిలో విజయ్‌కి దారుణమైన అవమానం, దళపతికి రాజకీయ బీజం.. స్టాలిన్‌ కొంపముంచింది ఇదే

సినిమాల్లో తిరుగులేని స్టార్‌గా, దళపతిగా రాణిస్తోన్న విజయ్‌.. రాజకీయాలవైపు ఎందుకు టర్న్ తీసుకోవాల్సి వచ్చింది? ఆయనకు జరిగిన అవమానమేంటి? దళపతి రాజకీయ ఎంట్రీ వెనకున్న కారణాలివేనా?   

3 Min read
Author : Aithagoni Raju
Published : May 05 2026, 09:33 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
విజయ్‌ తమిళనాట సరికొత్త సంచలనం
Image Credit : stockPhoto

విజయ్‌ తమిళనాట సరికొత్త సంచలనం

దళపతి విజయ్‌.. తమిళనాట సంచలనం సృష్టించారు. తమిళనాడు-2026 ఎన్నికల ఫలితాల్లో తన టీవీకే పార్టీ ప్రభంజనం సృష్టించింది. ఆయన ఏకంగా 108సీట్లు గెలుపొందారు. మ్యాజిక్‌ ఫిగర్‌కి ఇంకా పది సీట్లు తక్కువగా వచ్చినా, విజయ్‌ పార్టీ నెంబర్‌ 1 స్థానంలో ఉంది. అధికారం దక్కించుకోబోతుందని చెప్పడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. ఆయన ఈ స్థాయిలో సీట్లు గెలవడం అందరిని ఆశ్చర్యపరుస్తోంది. దేశ రాజకీయాలను షేక్‌ చేస్తోంది. దేశంలో మూడు రాష్ట్రాల్లో బీజేపీ గెలిచినా, దానిపై చర్చలేదు. అంతా విజయ్‌ చుట్టూనే రాజకీయం నడుస్తోంది. ఆయన ఇప్పుడు ఇండియా వైడ్‌గా హాట్‌ టాపిక్‌గా మారారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
విజయ్‌లో రాజకీయ బీజం పడటానికి కారణం ఇవే
Image Credit : Asianet News

విజయ్‌లో రాజకీయ బీజం పడటానికి కారణం ఇవే

మరి విజయ్‌ రాజకీయాలకు రావాలని ఎందుకు అనిపించింది? ఆయనకు రాజకీయ ఆలోచనకు బీజం పడ్డ సందర్భమేంటి? అనేది చూస్తే, చాలా చిన్న కారణం ఉంది. అయితే విజయ్‌కి మాత్రం అది చాలా ప్రస్టీజియస్‌ ఇష్యూ. ఆయనకు ఒక పెళ్లిలో జరిగిన అవమానమే కారణమని టాక్‌. కొన్నాళ్ల క్రితం ఒక ప్రముఖ నిర్మాత కొడుకు వివాహం జరిగింది. ఆ పెళ్లికి దళపతి విజయ్‌తోపాటు చాలా మంది సెలబ్రిటీలు హాజరయ్యారు. సీఎంగా ఉన్న స్టాలిన్‌ కూడా వచ్చారు. ఈవెంట్‌ హాల్‌లో ముందుగా విజయ్‌ వెళ్తున్నారట. ఆ తర్వాత సీఎం వచ్చారు. సీఎం సెక్యూరిటీ.. విజయ్‌ ఒక సూపర్‌ స్టార్‌ అని కూడా చూడకుండా ఆయన్ని సైడ్‌ చేశారట. కామన్‌గా సీఎం వస్తున్నారంటే సెక్యూరిటీ సీఎంకి రౌండ్‌గా ఉంటారు, ఎవరినీ రానివ్వరు, ఆ పరిధిలో ఉండనివ్వరు.

Related Articles

Related image1
Dasari Narayana Rao: ఈ చిన్న మిస్టేక్‌తో వేల కోట్లు పోగొట్టుకున్న దాసరి నారాయణరావు.. ఆయన్ని మోసం చేసిందెవరు?
Related image2
TVK Vijay: చిరంజీవి, పవన్‌కి సాధ్యం కానిది విజయ్‌కి ఎలా సాధ్యం.. దళపతి సక్సెస్‌ సీక్రెట్‌ ఇదే
35
విజయ్‌కి జరిగిన అవమానమే కారణమా?
Image Credit : x

విజయ్‌కి జరిగిన అవమానమే కారణమా?

అలానే సీఎం స్టాలిన్‌ వస్తుంటే.. విజయ్‌ ని సెక్యూరిటీ సిబ్బంది పక్కకు మూవ్‌ చేశారు. ఒక కామన్‌ మ్యాన్‌ లాగానే ట్రీట్‌ చేశారు. ఈ సందర్భంగా విజయ్‌ని.. స్టాలిన్‌ కూడా చూశారట. కానీ ఎలాంటి రియాక్షన్‌ లేదు. జస్ట్ స్మైల్‌ ఇచ్చి వెళ్లిపోయారట. ఒక పెద్ద స్టార్‌ ఎదురుపడితే, సీఎం అయినా, పీఎం అయినా విష్‌ చేసి, షేక్‌ హ్యాండ్‌ ఇచ్చి, వెళ్తుంటారు. బేసిక్‌ రెస్పెక్ట్ ఇస్తుంటారు. కానీ ఇక్కడ విజయ్‌కి అది మిస్‌ అయ్యింది. దాన్ని విజయ్‌ అవమానంగా ఫీలయ్యారట. తానేంటో చూపించాలనే ఆలోచన అప్పుడే వచ్చిందట. ఓ రకంగా తాను రాజకీయాల్లోకి రావాలనే ఆలోచనకు బీజం పడింది అక్కడే అని తమిళనాడు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. అలానే చిన్నప్పట్నుంచి ఆయన చాలా అవమానాలు ఫేస్‌ చేశారట. కులానికి సంబంధించి, మతానికి సంబంధించిన అవమానాలు కూడా ఫేస్‌ చేశారట. ఇవన్నీ ఆయనలో గుడుకట్టుకున్నాయని అంటుంటారు. 

45
స్టాలిన్‌ కొంపముంచింది ఇదేనా
Image Credit : Asianet News

స్టాలిన్‌ కొంపముంచింది ఇదేనా

దీనికితోడు విజయ్‌ సినిమాల విడుదలకు అడ్డంకులు. విజయ్‌ హీరోగా వచ్చిన చాలా సినిమాలు విడుదల విషయంలో ప్రభుత్వాలు అడ్డుంకులు సృష్టించాయి. పొలిటికల్‌ డైలాగ్‌లు, రాజకీయ విమర్శలు ఉండటం, సినిమాల్లో ప్రభుత్వాన్ని నిలదీసే, వారి తప్పులను ఎత్తిచూపే సీన్లు ఉండటంతో విడుదలకు అడ్డంకులు సృష్టించారు. మొన్న `జననాయకుడు` విషయంలోనే కాదు `సర్కార్‌, మెర్సల్‌, తలైవా ఇలా చాలా సినిమాల విషయంలో ఇదే జరిగింది. దీంతో విజయ్‌కి అక్కడే మండిందట. రాజకీయ లెక్కలేంటో తేల్చుకోవాలనుకున్నారట. దీనికితో ఇటీవల `జననాయకుడు` సినిమాని విడుదలను ఆపేశారు. పొలిటికల్‌ డైలాగ్‌లు ఉండటంతోనే దీన్ని అడ్డుకున్నారు. ఈ మూవీ ఇప్పటికీ రిలీజ్‌ కాలేదు. ఇది కూడా సీఎం స్టాలిన్‌ కొంపముంచిందట. సినిమా విషయంలో ఇన్ని రకాల ఇబ్బందులు పెట్టడం స్టాలిన్‌కి మైనస్‌గా మారింది. విజయ్‌కి ప్లస్‌ అయ్యింది. అది ఏకంగా సీఎం పీఠం దక్కేలా చేసింది. స్టాలిన్‌కి సీఎం పీఠం ఊడేలా చేసింది.

55
విజయ్‌కి మండింది ఇక్కడే
Image Credit : Asianet News

విజయ్‌కి మండింది ఇక్కడే

మరోవైపు తమిళనాడులో ఇటీవల ఏ హీరో సినిమాలు చేసినా సన్‌ పిక్చర్స్ తోనో, లేదంటే ఉదయనిధి స్టాలిన్‌ పెట్టిన రెడ్‌ జాయింట్‌ ప్రొడక్షన్స్ తోనూ టై అప్‌ కావాల్సి ఉంటుందట. విడుదల విషయంలో అయినా, రిలీజ్‌ రైట్స్, ప్రొడక్షన్‌లో భాగం కావడం, ఓటీటీ వంటి విషయాల్లో వారితో కలవాలనే నిబంధన ఉందట. విజయ్‌ హీరోగా వచ్చిన చిత్రాల విషయంలోనూ ఇదే నిబంధన వర్తించిందట. దీంతో ఇది కూడా విజయ్‌కి మండటానికి కారణమైందని, రాజకీయంగా తాడో పేడో తేల్చుకోవాలనే ఆలోచన వచ్చిందని సమాచారం. ఇలా తనకు జరిగిన అవమానం కారణంగా విజయ్‌ రాజకీయాల్లోకి రావాలనే ఆలోచనకు వచ్చారని, ఎవరూ ఊహించని విధంగా ఇప్పుడు ఏకంగా సీఎం పదవిని చేపట్టబోతున్నారని అంటున్నారు. ఏదేమైనా, కారణాలేమైనా.. విజయ్‌ తమళ రాజకీయాల్లోనే కాదు, దేశ రాజకీయాల్లోనూ పెను సంచలనంగా చెప్పొచ్చు. సరికొత్త చరిత్ర కి శ్రీకారం చుట్టారని చెప్పొచ్చు.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
టీవీకే విజయ్
తమిళ సినిమా
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్

Latest Videos
Recommended Stories
Recommended image1
Srikanth: నీ హద్దుల్లో నువ్వు ఉండు... ఎలా కనిపిస్తున్నాను.. సుడిగాలి సుధీర్‌కు హీరో శ్రీకాంత్ వార్నింగ్
Recommended image2
Prithviraj Sukumaran: వారణాసి విలన్ హౌస్ గురించి ఈ విషయాలు తెలుసా ? 54 కోట్ల ఆస్తి, లగ్జరీ కార్లు.. వామ్మో!
Recommended image3
Pahalgam Love Story Review: 'పహల్‌గామ్ లవ్ స్టోరీ' మూవీ రివ్యూ..లవ్ స్టోరీలో దేశభక్తి
Related Stories
Recommended image1
Dasari Narayana Rao: ఈ చిన్న మిస్టేక్‌తో వేల కోట్లు పోగొట్టుకున్న దాసరి నారాయణరావు.. ఆయన్ని మోసం చేసిందెవరు?
Recommended image2
TVK Vijay: చిరంజీవి, పవన్‌కి సాధ్యం కానిది విజయ్‌కి ఎలా సాధ్యం.. దళపతి సక్సెస్‌ సీక్రెట్‌ ఇదే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved