MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • National
  • Interesting Facts : ఏమిటీ.. ఇక్కడ వజ్రాల వర్షం కురుస్తుందా..!

Interesting Facts : ఏమిటీ.. ఇక్కడ వజ్రాల వర్షం కురుస్తుందా..!

మనం పుస్తకాల్లో చదువుకున్నదానికంటే మన సౌర కుటుంబం చాలా విచిత్రమైనది… ఎన్నో రహస్యాలు దాచుకుంది. నీటిపై తేలియాడేంత తేలికైన శని, విపరీతమైన వేడిని దాచుకున్న శుక్రుడు, వజ్రాల వర్షం కురిసే నెప్ట్యూన్‌…ఇలాంటి నమ్మలేని నిజాలెన్నో…

3 Min read
Author : Arun Kumar P
Published : Mar 21 2026, 01:33 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
111
సౌర కుటుంబంలో మనకు తెలియని రహస్యాలు
Image Credit : nasa

సౌర కుటుంబంలో మనకు తెలియని రహస్యాలు

సౌర కుటుంబం అంటే గ్రహాల వరుస క్రమం మాత్రమే కాదు అదొక అద్భుతమైన, విచిత్రమైన ప్రపంచం. మనం స్కూల్లో చదువుకున్నదానికి, వాస్తవానికి చాలా తేడా ఉంది. ఉదాహరణకు బుధుడి కంటే శుక్రుడు చాలా వేడిగా ఉంటాడు. నెప్ట్యూన్, యురేనస్ గ్రహాలపై వజ్రాల వర్షం కురుస్తుందని శాస్త్రవేత్తలు నమ్ముతున్నారు. నాసా ప్రకారం సౌర వ్యవస్థ మొత్తం ద్రవ్యరాశిలో 99.8% సూర్యుడిలోనే ఉంది. ఇలాంటి 10 విషయాలు మన విశ్వం ఎంత డైనమిక్‌గా ఉందో చూపిస్తాయి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
211
ఇనుప గోళంలాంటి బుధుడు
Image Credit : nasa

ఇనుప గోళంలాంటి బుధుడు

నాసా మెసెంజర్ (MESSENGER) మిషన్ ప్రకారం బుధుడి వ్యాసార్థంలో (Radius) దాదాపు 85% దాని లోహపు కోర్‌తోనే నిండి ఉంది. భూమి కోర్ దాని వ్యాసార్థంలో 50% మాత్రమే. సౌర వ్యవస్థ ఏర్పడే తొలినాళ్లలో జరిగిన ఏదో పెద్ద ఘాతానికి బుధుడి బయటి రాతి పొరలు తొలిగిపోయి ఉండొచ్చని అంచనా వేస్తున్నారు.

311
సౌర వ్యవస్థ సరిహద్దు 'ఊర్ట్ క్లౌడ్'
Image Credit : nasa

సౌర వ్యవస్థ సరిహద్దు 'ఊర్ట్ క్లౌడ్'

సూర్యుడి గురుత్వాకర్షణ ప్రభావానికి చివరి సరిహద్దు ఊర్ట్ క్లౌడ్ (Oort Cloud). ఇది మంచు ముక్కలతో నిండిన ఒక ఊహాజనిత గోళం. ఇది దాదాపు 1.6 కాంతి సంవత్సరాల దూరంలో ఉంది. చాలా తోకచుక్కలు ఇక్కడే పుడతాయని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ప్లూటోను ఇప్పుడు మరుగుజ్జు గ్రహంగా పరిగణిస్తున్నా, ఈ ఊర్ట్ క్లౌడ్ సౌర వ్యవస్థకు బయటి అంచులా పనిచేస్తుంది.
411
సౌర వ్యవస్థలో సూర్యుడే 'బాస్'
Image Credit : nasa

సౌర వ్యవస్థలో సూర్యుడే 'బాస్'

మన సౌర కుటుంబం ఎంత పెద్దదో భూమిపై నుంచి ఊహించడం కష్టం. నాసా ప్రకారం, సౌర వ్యవస్థ మొత్తం ద్రవ్యరాశిలో 99.86% ఒక్క సూర్యుడిదే. మిగిలిన అన్ని గ్రహాలు, చంద్రులు, గ్రహశకలాలు, తోకచుక్కలన్నీ కలిపి 0.2% కన్నా తక్కువే. సౌర వ్యవస్థను ఒక పెద్ద గది అనుకుంటే, భూమి ఒక చిన్న నాణెం అంత ఉంటుంది.
511
నీటిపై తేలియాడే శని గ్రహం
Image Credit : nasa

నీటిపై తేలియాడే శని గ్రహం

శని గ్రహం ఒక గ్యాస్ జెయింట్. దీని సాంద్రత (Density) ఎంత తక్కువంటే, నీటిపై తేలగలదు. ఇది ఎక్కువగా హైడ్రోజన్, హీలియంతో తయారైంది. నాసా ప్రకారం, సౌర వ్యవస్థలో నీటి కంటే తక్కువ సాంద్రత ఉన్న ఏకైక గ్రహం ఇదే. ఒకవేళ శని గ్రహాన్ని పట్టేంత పెద్ద నీటి తొట్టి ఉంటే, అది కచ్చితంగా నీటిపై తేలుతుంది.
611
శుక్రుడు.. నిప్పుల కొలిమిలాంటి గ్రహం
Image Credit : nasa

శుక్రుడు.. నిప్పుల కొలిమిలాంటి గ్రహం

సూర్యుడికి దగ్గరగా ఉన్నది బుధుడే అయినా, శుక్ర గ్రహంపై ఉష్ణోగ్రత చాలా ఎక్కువ. యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ (ESA) ప్రకారం, శుక్రుడిపై 'రన్-అవే గ్రీన్‌హౌస్ ఎఫెక్ట్' ఉంది. అక్కడి కార్బన్ డయాక్సైడ్ వాతావరణం వేడిని విపరీతంగా బంధించి ఉంచుతుంది. అందుకే శుక్రుడి ఉపరితల ఉష్ణోగ్రత ఎప్పుడూ 470 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది. ఈ వేడికి సీసం (Lead) కూడా కరిగిపోతుంది.
711
గ్రహాల మధ్య ఎంత ఖాళీ ఉందో తెలుసా?
Image Credit : nasa

గ్రహాల మధ్య ఎంత ఖాళీ ఉందో తెలుసా?

అంతరిక్షం చాలా వరకు ఖాళీగా ఉంటుంది. జెట్ ప్రొపల్షన్ ల్యాబొరేటరీ (JPL) ప్రకారం, సౌర వ్యవస్థలోని అన్ని గ్రహాలను ఒకదాని పక్కన ఒకటి పెట్టినా, భూమికి, చంద్రుడికి మధ్య ఉన్న దూరంలో ఇంకా 8,000 కిలోమీటర్ల ఖాళీ మిగిలిపోతుంది. దీన్నిబట్టి గ్రహాలు ఒకదానికొకటి ఎంత దూరంలో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు.
811
నెప్ట్యూన్‌పై వజ్రాల వర్షం..!
Image Credit : nasa

నెప్ట్యూన్‌పై వజ్రాల వర్షం..!

నెప్ట్యూన్, యురేనస్ గ్రహాల లోపల వాతావరణం అద్భుతంగా ఉంటుంది. SLAC నేషనల్ యాక్సిలరేటర్ ల్యాబొరేటరీ పరిశోధన ప్రకారం, ఈ గ్రహాల లోపల ఉండే తీవ్రమైన పీడనం వల్ల మీథేన్ నుంచి కార్బన్ విడిపోయి వజ్రాలుగా మారుతుంది. ఆ వజ్రాలు వర్షంలా నేలపై కురుస్తాయి.
911
గురుడి 'గ్రేట్ రెడ్ స్పాట్' మాయం?
Image Credit : nasa

గురుడి 'గ్రేట్ రెడ్ స్పాట్' మాయం?

గురు గ్రహంపై వందల ఏళ్లుగా ఉన్న ఒక పెద్ద తుపానే దాని ప్రత్యేకత. కానీ అది క్రమంగా చిన్నదవుతోంది. 1800లలో ఈ 'గ్రేట్ రెడ్ స్పాట్' 40,000 కిలోమీటర్ల వెడల్పు ఉండేది (అంటే మూడు భూములు పట్టేంత పెద్దది). ప్రస్తుత డేటా ప్రకారం, ఈ తుాపాను 16,500 కిలోమీటర్లకు కుంచించుకుపోయింది. ప్రతీ ఏటా ఇది మరింత చిన్నదవుతూనే ఉంది.

1011
ఎవరెస్ట్‌కు మూడు రెట్ల పర్వతం!
Image Credit : nasa

ఎవరెస్ట్‌కు మూడు రెట్ల పర్వతం!

అంగారక గ్రహంపై అద్భుతమైన భౌగోళిక నిర్మాణాలు ఉన్నాయి. అక్కడి 'ఒలింపస్ మాన్స్' (Olympus Mons) అనే అగ్నిపర్వతం 21.9 కిలోమీటర్ల ఎత్తు ఉంది. ఇది మన ఎవరెస్ట్ పర్వతం కంటే దాదాపు మూడు రెట్లు పెద్దది. అంగారకుడిపై 'ప్లేట్ టెక్టోనిక్స్' లేకపోవడంతో, వందల కోట్ల సంవత్సరాలుగా ఒకే 'హాట్‌స్పాట్' మీద ఇది పెరుగుతూ ఇంత పెద్దదిగా మారింది.
1111
సౌర వ్యవస్థ 'జంక్‌యార్డ్'.. కైపర్ బెల్ట్
Image Credit : nasa

సౌర వ్యవస్థ 'జంక్‌యార్డ్'.. కైపర్ బెల్ట్

సౌర వ్యవస్థ నెప్ట్యూన్ దాటి కూడా విస్తరించి ఉంది. అక్కడ గడ్డకట్టిన వస్తువులతో నిండిన ఒక పెద్ద ప్రాంతం ఉంది, దీన్ని 'జంక్‌యార్డ్' అని కూడా అంటారు. నాసా 'న్యూ హొరైజన్స్' మిషన్ ప్రకారం, కైపర్ బెల్ట్‌లో లక్షలాది మంచు వస్తువులు ఉన్నాయి. శాస్త్రవేత్తలు ఇక్కడ ప్లూటో, హౌమియా, మాకెమాకే అనే 3 మరుగుజ్జు గ్రహాలను గుర్తించారు. సౌర వ్యవస్థ తొలినాళ్లలో ఎలా ఉండేదో చెప్పేందుకు కైపర్ బెల్ట్ ఒక 'శిలాజ రికార్డు' (Fossil record) లాంటిది.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
ప్రపంచం
భారత దేశం
వైరల్ న్యూస్
ఏషియానెట్ న్యూస్
 
5th T20 • NZ vs IND 2026
NZNZ
Sun, 1 Nov, 2026
INDIND
12:30 pm
Match yet to begin.
Schedule ›
4th T20 • NZ vs IND 2026
Result
NZNZ
259/7
INDIND
172/9
NZ beat IND by 87 runs
Schedule ›
3rd TEST • SA vs AUS
Result
SASA
329 & 387
AUSAUS
429 & 111
SA won by 176 runs
Schedule ›
3rd T20 • NZ vs IND 2026
Result
NZNZ
198/3
INDIND
199/4
IND won by 6 wickets
Schedule ›
2nd T20 • NZ vs IND 2026
Result
NZNZ
180/5
INDIND
181/6
IND won by 4 wkts
Schedule ›
1st T20 • NZ vs IND 2026
Result
NZNZ
225/4
INDIND
230/6
IND beat NZ by 4 wickets
Schedule ›
Latest Videos
Recommended Stories
Recommended image1
ఇస్రో మరో చారిత్రాత్మక విజయం.. GSLV-F18 రాకెట్‌తో మ‌న‌కు క‌లిగే ప్ర‌యోజ‌నం ఏంటంటే.?
Recommended image2
Supreme Court: దానిని అత్యాచారంగా పరిగణించలేం.. సుప్రీం సంచలన వ్యాఖ్య‌లు
Recommended image3
Good Governance : రాజకీయ ఆందోళనలు యువత భవిష్యత్తును ఎలా దెబ్బతీస్తున్నాయి?
Related Stories
Recommended image1
Haunted Railway Stations : భారత్‌లోని టాప్ 5 మిస్టరీ రైల్వే స్టేషన్లు.. కర్నూల్ స్టేషన్ దీ వింత కథే..!
Recommended image2
సౌర వ్యవస్థలో భూమిని పోలిన మరో గ్రహం ! సూర్యునికి ఎంతో దూరంలో ఉందంటే..?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved