- Home
- National
- Supreme Court: జంతు ప్రేమికులకు సుప్రీం వార్నింగ్.. ధర్మాసనం అంత సీరియస్ ఎందుకయ్యిందంటే
Supreme Court: జంతు ప్రేమికులకు సుప్రీం వార్నింగ్.. ధర్మాసనం అంత సీరియస్ ఎందుకయ్యిందంటే
వీధి కుక్కలకు సంబంధించి దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్ట్ సంచలన నిర్ణయం తీసుకుంది. వచ్చే ఎనిమిది వారాల్లో ఒక్క కుక్క కూడా వీధుల్లో కనిపించకూడదని తీర్పునిచ్చింది. ఇప్పుడీ అంశం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా జరిగింది.

వీధి కుక్కల తరలింపుపై సుప్రీం కోర్టు కీలక ఆదేశం
దేశ రాజధాని ఢిల్లీ, ఎన్సీఆర్ పరిధిలో వీధి కుక్కల దాడులు, రేబిస్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో సుప్రీం కోర్టు అత్యవసర చర్యలకు పూనుకుంది. వచ్చే ఎనిమిది వారాల్లో ఒక్క కుక్క కూడా వీధుల్లో కనిపించకుండా షెల్టర్లకు తరలించాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. కుక్కల తరలింపును అడ్డుకునే ఏ సంస్థలైనా కఠిన శిక్షలు ఎదుర్కోవాల్సి ఉంటుందని కూడా హెచ్చరించింది.
KNOW
‘ప్రాణాలు పోయిన పిల్లలను తిరిగి తెస్తారా?’
జస్టిస్ జేబీ పార్దీవాలా, జస్టిస్ ఆర్ మహదేవన్‌లతో కూడిన బెంచ్ ఈ కేసును సుమోటోగా స్వీకరించి విచారణ జరిపింది. విచారణలో సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా తెలిపిన వివరాల ప్రకారం, వీధి కుక్కల కోసం ఇప్పటికే ప్రత్యేక ప్రదేశం గుర్తించినప్పటికీ, జంతు హక్కుల సంఘాలు కోర్టుల ద్వారా స్టే ఆర్డర్ తెచ్చుకోవడంతో చర్యలు నిలిచిపోయాయి. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన బెంచ్ – “రేబిస్ బారినపడి ప్రాణాలు కోల్పోయిన పిల్లలను ఈ జంతు ప్రేమికులు తిరిగి తెస్తారా? ప్రజల ప్రాణాల కంటే జంతు సెంటిమెంట్ ముఖ్యమా?” అని ప్రశ్నించింది.
దత్తతకు అనుమతి లేదు
సుప్రీం కోర్టు ప్రకటించిన దాని ప్రకారం.. ఈ కుక్కలను ఎవరు దత్తత తీసుకోవడానికి అనుమతించరాదు. రాజధాని వీధుల్లో పిల్లలు భయంలేకుండా సైకిల్ తొక్కే, ఆడుకునే వాతావరణం రావాల్సిందేనని పేర్కొంది. ప్రజా భద్రత కోసం తీసుకున్న ఈ నిర్ణయంలో ఎలాంటి వ్యక్తిగత ప్రయోజనం లేదని ధర్మాసనం స్పష్టం చేసింది.
పెటా అభ్యంతరం
ఈ తీర్పుపై పెటా ఇండియా తీవ్రంగా స్పందించింది. సీనియర్ డైరెక్టర్ డాక్టర్ మినీ అరవిందన్ ప్రకారం, 2022–23 సర్వే ప్రకారం ఢిల్లీలో సుమారు 10 లక్షల వీధి కుక్కలు ఉన్నప్పటికీ, సగానికి పైగా స్టెరిలైజ్ చేయలేదని తెలిపారు. ఒక్కసారిగా షెల్టర్లకు తరలించడం వల్ల రేబిస్ సమస్య తగ్గదని, దీని పరిష్కారం సరైన స్టెరిలైజేషన్ ప్రోగ్రామ్‌లు, అక్రమ పెట్ షాపులు మూసివేయడం, అడాప్షన్‌ను ప్రోత్సహించడం అని సూచించారు.
సెంటిమెంట్‌కు చోటు లేదు
సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు ఢిల్లీ, నోయిడా, ఘజియాబాద్, గురుగ్రామ్ వంటి ప్రాంతాల్లో దూరప్రాంత డాగ్ షెల్టర్ల నిర్మాణం తక్షణం ప్రారంభం కానుంది. వీధి కుక్కల తరలింపుపై ఎటువంటి ఆటంకం వస్తే వెంటనే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ధర్మాసనం స్పష్టం చేసింది. అధికారులకు, “ఇది ప్రజల ప్రాణ భద్రత కోసం ఎలాంటి సెంటిమెంట్‌కు చోటు లేదు” అని గట్టిగా హెచ్చరించింది.